Seethe Ramudi Katnam Serial Today Episode ముఖర్జీ ఇంటికి వచ్చిన సీతని చూసి మహాలక్ష్మీ, రామ్ వాళ్లు ఇరిటేట్ అవుతారు. రామ్ చిరాకు పడి పక్కకు వెళ్లిపోతాడు. అక్కడకు వెళ్లిన సీత రామ్‌ని వెనక నుంచి హగ్ చేసుకుంటుంది. నేనే కదా మామ అని అంటే పబ్లిక్ ప్లేస్‌లో ఇలాంటి పనులు ఏంటి అని కేకలేస్తాడు. నా భర్త, నా మొగుడు నా ఇష్టం అని అంటుంది. మనం విడాకులు తీసుకోలేదు కదా అంటుంది.
రామ్: నాకు దూరంగా ఉండు సీత ఉండమన్నా కదా ఉండు అంతే. ఇలా ప్రవర్తించి అందరి ముందు నా పరువు తీయకు. మనం విడివిడిగా ఉన్నప్పుడు దూరంగానే ఉండాలి.
సీత: అంటే నా మీద ప్రేమ పోయిందా మామ
రామ్: నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది.
మహాలక్ష్మీ: తనకు ఎలా చెప్పినా అర్థం కాదు రామ్. సీత నీ వెధవ వేషాలు మా దగ్గర కాదు. దయచేసి ఇక్కడైనా మమల్ని ప్రశాంతంగా ఉండనివవ్వు. రామ్ చాలా డిస్ట్రబ్‌గా ఉన్నాడు. నువ్వు తనకు దూరంగా ఉండు.
సీత: మామ నువ్వు నా వల్ల డిస్ట్రబ్‌గా ఉన్నావా.
రామ్: నీకు మళ్లీ చెప్పాలా పిన్ని చెప్తే అర్థం కావడం లేదా. నన్ను చూస్తే నీకు తెలీడం లేదా. ముఖర్జీ గారు పిలిచారు అని ఇక్కడికి వచ్చావ్ ఇప్పుడు నేను చెప్తున్నా విను ఇక్కడి నుంచి వెళ్లిపో. బయట ఉంటావో వెళ్లిపోతావో నీ ఇష్టం.
రామ్‌ని తీసుకొని మహాలక్ష్మీ వెళ్లిపోతుంది. సీత ఇక పార్టీలో కనిపించదు. అందరూ ముఖర్జీ కూతురు కోసం ఎదురు చూస్తారు. ముఖర్జీ, అతని భార్య వచ్చి తన ముద్దుల కూతురు.. తమ ఏకైక వారసురాలు మిధున వస్తుందని చెప్తారు. దాంతో మిధున (మోడ్రన్ డ్రస్‌లో ఉన్న సీతలా ఉంటుంది) ఎంట్రీ ఇస్తుంది. అందరూ మిధున అచ్చం సీతలా ఉండటంతో షాక్ అవుతారు. రామ్ మిధునని సీత అనగానే మహాలక్ష్మీ కాదని మిధున అని చెప్తుంది. అచ్చం సీతలా ఉందని అందరూ అనుకుంటారు. ఇక ముఖర్జీ మహాలక్ష్మీ ఫ్యామిలీని మిధునకు పరిచయం చేస్తారు. మిధున రామ్‌ని ఇంట్రస్టింగ్‌గా చూస్తుంది. గౌతమ్ మిధునకి ప్లాట్ అయిపోయి చూస్తూ ఉంటాడు. మహాలక్ష్మీని పరిచయం చేస్తే తనకు మిధున ముందే తెలుసు అని మహాలక్ష్మీ అంటే రెండు సార్లు కలిశామని మహాలక్ష్మీ అంటుంది. దాంతో మిధున నేను కలిశానా అని మర్చిపోయినట్లు అడుగుతుంది. రెండు సార్లు కలిసినా గుర్తు పట్టలేదుదీనికి చాలా పొగరు అని అర్చన అంటే డబ్బు ఉంటే అలాగే ఉంటుందిలే అని మహాలక్ష్మీ రెండు సార్లు కలిసిన సీన్ గుర్తు చేస్తుంది. అప్పుడు మిధున గుర్తొచ్చారని మీరు మా బిజినెస్ పార్టనర్స్‌నా డాడ్ మీ గురించి చెప్పలేదు కేవలం అంకుల్ గురించే చెప్పారు అంటుంది.
ఇక మిధునని రామ్‌కి పరిచయం చేస్తారు. మిధున షేక్ హ్యాండ్ ఇవ్వగానే రామ్ ఇవ్వడు. ఇక గౌతమ్ పరిచయం చేసుకొని హ్యాండ్ ఇస్తే మిధున ఇవ్వదు. ఇక ముఖర్జీ వాళ్లు సీత కోసం అడుగుతారు. సీత గురించి మిధున అడుగుతుంది. సీత రామ్‌లు భార్య భర్తలని ఇప్పుడు విడివిడిగా ఉన్నారు అంటే ఇంత హ్యాండ్‌సమ్‌ని ఎలా వదులుకుంది సీత అని మిధున అంటుంది. ఇక ముఖర్జీ సీత కోసం బయటకు వెళ్తాడు. గౌతమ్ మహాలక్ష్మీని పక్కకు తీసుకెళ్లి తనకు మిధున నచ్చిందని పెళ్లి చేయమని అంటాడు. మహాలక్ష్మీ కుదరదు అన్నట్లు మాట్లాడుతుంది. సీత మిధున ఒక్కరే అని అనుమానంగా ఉందని అంటుంది. వాళ్లు ఒక్కరు కాదు ఇద్దరు అని గౌతమ్ అంటాడు. ఇక అర్చన వచ్చి తల్లీకొడుకులు ఏం మాట్లాడుతున్నారు అంటే అర్చనకు నిజం తెలిసిపోయిందని అనుకుంటారు. ఇక అర్చన పిన్నీ కొడుకులు అనడంతో నిజం తెలీదు అనుకుంటారు. నువ్వు మిధునని చూడగానే గౌతమ్‌కి ఇచ్చి పెళ్లి చేయాలి అనుకున్నావ్ కదా మహా అని అర్చన అంటే నిజమా మమ్మీ అని గౌతమ్ సంతోషంలో పిలిచేస్తాడు. తర్వాత ఇద్దరూ కవర్ చేస్తారు.
ముఖర్జీ వచ్చి సీతని ఎందుకు అవమానించారు తను రాను అంటుందని చెప్తారు. ఇక్కడ మా ఫ్యామిలీ గొడవలు వద్దని అలా బయట ఉండమని చెప్పామని మహాలక్ష్మీ అంటుంది. మా గెస్ట్‌ని మీరు ఎందుకు అలా చెప్తారు సీత ఎందుకు గొడవ పెడుతుందని మిధున తల్లి అంటుంది. వీళ్లు వెళ్లిపోయిన తర్వాత సీతని పిలుద్దామని అంటారు. ఇక మిధున సీత గొడవ పడుతుందా అని అంటే మీ ఇద్దరూ ఒకేలా ఉంటారు నువ్వు దేవత అయితే సీత దెయ్యం అని గౌతమ్ అంటే రామ్ గౌతమ్ మీద కేకలు వేసి లేని తన గురించి మాట్లాడొద్దని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: బాలయ్యని ఫాలో అవ్వడం అంత ఈజీ కాదోయ్ గిరి.. జైలులో తాళి కట్టడానికి గిరి ప్లాన్!