Seethe Ramudi Katnam Serial Today March 11th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: సీతతో కాళ్ల బేరానికి రామ్.. ప్రాజెక్ట్ కోసం మహా ఇంట్లో గడసరి!
Seethe Ramudi Katnam Today Episode ముఖర్జీ ప్రాజెక్ట్ కోసం సీతని తీసుకురమ్మని మహాలక్ష్మీ రామ్‌తో చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode ఆఫీస్‌కి ముఖర్జీ వచ్చి 1000 కోట్ల ప్రాజెక్ట్ వచ్చిందని అంటాడు. ఇక సీత గురించి అడుగుతాడు. సీత కూడా ఉండాలి కదా అంటాడు. సీత గురించి అందరికీ అడిగితే ఎవరూ నోరు మెదపరు. మహాలక్ష్మీ సీత ఇంట్లో ఉందని చెప్తుంది. దాంతో ముఖర్జీ సీతని రేపు తీసుకురమ్మని సీతే అగ్రిమెంట్ మీద సంతకం పెట్టాలని అంటారు.
రామ్, జనార్థన్‌లు సీత ఇంట్లో ఉందని ఎందుకు చెప్పావని అంటే ప్రాజెక్ట్ కోసం సీత ఉండాలి అంటుంది. సీతని రేపు తీసుకురమ్మని రామ్ అంటాడు. సీత వస్తే నీ ప్రాణాలకు ప్రమాదం కదా అని జనార్థన్ అంటే పది మందికి మంచి జరిగుతుంది అంటే నాకు ఏం అయినా పర్లేదని మహాలక్ష్మీ అంటుంది. సీత లేదు అంటే ప్రాజెక్ట్ మనకు ఇవ్వరని సీతని ఎలా అయినా ఒప్పించి తీసుకురమ్మని మహాలక్ష్మీ రామ్‌తో చెప్తుంది. అసలు విషయం చెప్పకుండా సీతని తీసుకు రమ్మని చెప్తుంది. రామ్ సరే అని రేవతి ఇంటికి వెళ్తాడు.
సీతని పిలవడం రామ్‌కి ఇష్టం లేకపోయినా పిన్ని చెప్పినట్లు పది మందికి మంచి జరుగుతుంది అంటే ఒక మెట్టు అయినా దిగినా పర్లేదని అనుకొని లోపలికి వెళ్తాడు. రామ్ లోపలికి వెళ్తాడు. రేవతి, కిరణ్ గురించి అడిగితే వాళ్లు బయటకు వెళ్లారని చెప్తుంది. నీతో మాట్లాడాలి అని రామ్ అంటాడు. ఇంతలో కిరణ్, రేవతిలు వస్తారు. సీతని ఇంటికి తీసుకెళ్తానని అంటాడు. రేవతి, కిరణ్‌లు సంతోషపడతారు కానీ సీత అనుమానంగా చూస్తుంది. సీత వెళ్లను అని మొండికేస్తుంది.
సీత: నేను ఎందుకు వెళ్లాలి. ఆయన వెళ్లిపోమంటే వెళ్లాలి రమ్మంటే రావాలి అంతా ఈయన ఇష్టమేనా. అయినా నీతో ఏం మాట్లాడాలి ఆరోజు మీ ఇంటికి వస్తే రావొద్దు అన్నావ్. ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చావ్.
రామ్: అవన్నీ ఇంటికెళ్లి మాట్లాడుకుందాం.
సీత: నేనురాను.
రామ్: నిన్ను తీసుకురమ్మని మా పిన్నే చెప్పింది.
సీత: ఓహో ఆవిడ గారు చెప్తే వచ్చారా. ఆవిడ చెప్తే ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు. ఇప్పుడు ఆవిడ రమ్మన్నారని తీసుకెళ్తాను అంటున్నావ్. నేను తోలుబొమ్మని కాదు. నేను ఎక్కడికీ రాను. అని వెళ్లిపోతుంది. సీత చెప్పింది నిజమే అని రేవతి, కిరణ్ అంటారు. సీతని ఒప్పిస్తామని అంటారు.
ఇద్దరూ సీత దగ్గరకు వెళ్లి సీతని ఒప్పించడానికి ప్రయత్నిస్తారు. దానికి సీత అత్తయ్య ఏదో ప్లాన్ తోనే పంపిందని లాభం లేకపోతే ఇలా చేయదు అని అంటుంది. ఇక తనకు కూడా వెళ్లాలనే ఉందని బ్యాగ్ పట్టుకొని వస్తుంది. సీత మళ్లీ వెనక్కి రాకుండా చూసుకోమని ఇద్దరూ రామ్‌కి చెప్తారు. తేడా జరిగితే దబిడి దిబిడే అని అంటుంది. ఇక బ్యాగ్ రామ్ చేతిలో పెట్టి తీసుకురమ్మని అంటుంది. మహాలక్ష్మీతో అందరూ సీతని ఎందుకు తీసుకొస్తున్నారని అంటే ప్రాజెక్ట్ కోసం తప్పదు అని అంటుంది. సీత వాళ్లు ఇంటికి వస్తారు. నీ రాకకోసం అందరూ ఎదురు చూస్తున్నారని చలపతి చెప్తాడు. నా కోసం ఎదురు చూస్తున్నారు అంటే ఇది కలా నిజమా అని సీత అంటే మహాలక్ష్మీ దానికి సమాధానం చెప్పాలి అని చలపతి అంటాడు. ఇక సీత తన బ్యాగ్ మహాలక్ష్మీ మీదకు విసిరేసి మహా కుర్చీలో అందరి ముందు కాళ్ల మీద కాలు వేసుకొని కూర్చొంటుంది. గౌతమ్ మనసులో మరీ ఓవర్ చేస్తుందని అనుకుంటాడు. నువ్వేంటి ఇలా చేస్తున్నావ్ అని రామ్ అడుగుతాడు. జనార్థన్ రామ్‌లు ప్రాజెక్ట్ కోసం సీతకి చెప్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: కార్తీక్ ఇంట్లో ఆస్తి పంపకాల రచ్చ.. కార్తీక్ నిర్ణయానికి కుస్తీలు పడుతున్న తండ్రి!