Seethe Ramudi Katnam Today Episode జనార్థన్‌, గిరిధర్ రావడం చూసిన మహాలక్ష్మి మ్యానేజర్ కిరణ్‌ని కొడుతుంది. ఏమైందని అన్నాదమ్ములు అడిగితే కిరణ్ తమ ఇంటికి అల్లుడు అవ్వాలని ప్రయత్నిస్తున్నాడు అని మీ ఒక్కగానొక్క చెల్లి రేవతికి లైన్ వేస్తున్నాడు అని చెప్తుంది. రేవతితో సరసాలు ఆడుతుంటే తాను చూశానని మహాలక్ష్మి చెప్తుంది. కిరణ్ డాక్యుమెంట్స్ గురించి చెప్పబోతే మహాలక్ష్మి ఫైర్ అయిపోతుంది. అర్చన రావడంతో మహాలక్ష్మి సైగ చేస్తే అర్చన కూడా కిరణ్‌ని నిందిస్తుంది.


అర్చన: నాకు ముందు నుంచి వీడి మీద అనుమానమే మహా. వీడు తరచుగా ఇంటికి వచ్చేది ఆఫీస్ పని మీద కాదు రేవతి కోసం అని అప్పుడే అర్థమైంది. 
మహాలక్ష్మి: ఆఫ్ట్రాల్ మేనేజర్‌వి నీకు మా ఇంటి ఆడపిల్ల కావాల్సి వచ్చిందా. నువ్వెంత నీ స్థాయి ఎంత.
రేవతి: ఆయన్ను ఏం అనొద్దు వదినా. ఆయన తప్పు ఏం లేదు. నేనే ఆయన్ను ఇష్టపడ్డాను. 
గిరిధర్: ఇలాంటి వాడితో నీకు ప్రేమ ఏంటి. ప్రేమించడానికి ఇంకెవరూ దొరకలేదా నీకు.
మహాలక్ష్మి: మన కింద పని చేసే వాడిని మనం పని వాడిలా చూడాలి. ప్రేమికుడిలా కాదు.
అర్చన: మనం జీతం ఇస్తే బతకలేని వాడితో నువ్వెలా బతకాలి అనుకుంటున్నావ్ రేవతి.  
గిరిధర్: నీ స్థాయికి కూడా వీడు సరిపోడు.
రేవతి: స్థాయి అంతస్తు చూసి ప్రేమించ లేదు అన్నయ్య. మనకి నచ్చి ప్రేమించా.
మహాలక్ష్మి: మనం జాబులో తీసేస్తే రోడ్డున పడతాడు. వీడితో నీకు ప్రేమ అవసరమా.. వీడితో రోడ్డున పడి అడుక్కు తింటావా.  
అర్చన: నీకు అంత ఖర్మ పట్టలేదు. నిన్ను పెళ్లి చేసుకోవడానికి కోటీశ్వరులు క్యూలో ఉన్నారు.
రేవతి: నాకు కోటీశ్వరులు అవసరం లేదు. నేను కిరణ్‌ని పెళ్లి చేసుకుంటా. 
జనార్థన్: వీడితో పెళ్లికి మేం ఒప్పుకోం. 
మహాలక్ష్మి: మమల్ని కాదు అని నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావ్. జనా, గిరి ముందు ఇతన్ని తన్ని తరిమేయండి. 


జనార్థన్ గిరిధర్‌లు కిరణ్‌ని కొట్టి తరిమేస్తారు. రేవతిని మహాలక్ష్మి, అర్చనలు గదిలో పెట్టి లాక్ చేస్తారు. కిరణ్ మహాలక్ష్మి వాళ్లతో నన్ను అవమానించారు కదా ఏదో ఒక రోజు రేవతిని పెళ్లి చేసుకొని తీసుకెళ్లిపోతానని అంటాడు.  


కిరణ్: నా స్థాయిని కించపరిచారు. మీరు జీతం ఇస్తే తప్ప బతకలేను అని అవమానించారు. చూస్తూ ఉండండి ఏదో ఒక రోజు మీరు ఊహించని స్థాయికి చేరుకొని అప్పుడు వచ్చి రేవతిని తీసుకెళ్తాను ఇది నా ఛాలెంజ్.


రేవతి గతం విద్యాదేవి, చలపతి, సీతలకు చెప్తుంది. ఇక ఆస్తి గురించి మాట్లాడుకుంటారు. మహాలక్ష్మి ఆస్తి మొత్తం తన పేరున రాసుకోవాలి అని చూస్తే తాను పిచ్చి దానిలా నటించి ఆస్తి పత్రాలు చింపేసిన విషయం సీత చెప్తుంది. దానికి చలపతి ఆ తర్వాత చాలా జరిగి ఉంటాయని అంటాడు. 


విద్యాదేవి: ఆస్తి కోసం మహాలక్ష్మి నిన్ను కిరణ్‌ని విడదీసిందన్నమాట. ఆ తర్వాత నువ్వు ఎప్పుడూ కిరణ్‌ని కలవలేదా. 
రేవతి: ఒకసారి కలిశాను. (గతం.. ) సారీ కిరణ్ నిన్ను అంతలా అవమానిస్తారు అని నేను అనుకోలేదు.
కిరణ్: మీ మహాలక్ష్మి వదిన అంత దుర్మార్గురాలు అని నేను అనుకోలేదు. ఆస్తి కోసం డ్రామాలు ఆడుతుంది. ఆస్తి మొత్తం ఆవిడ పేరున ఉంటే రామ్, ప్రీతిల గతి ఏం కావాలి. మీ అన్నయ్య పూర్తిగా ఆవిడ మాయలో పడిపోయారు. ప్రతి దానికి ఆవిడ నిర్ణయం మీదే ఆధార పడుతున్నారు. 
రేవతి: మన పెళ్లికి వాళ్లు ఒప్పుకోరు. నేను నిన్ను తప్ప మరెవరినీ పెళ్లి చేసుకోను.
కిరణ్: నేను కూడా.
రేవతి: అయితే నీతో వచ్చేస్తాను. గుడిలోనో, రిజిస్టర్ మ్యారేజో చేసుకుందాం. 
కిరణ్: అలా వద్దు అందరి ఎదురుగా దర్జాగా చేసుకుందాం. మనం ఇప్పుడు పెళ్లి చేసుకోవద్దు. నన్ను మ్యానేజర్ అని అవమానించారు. నేను పగ తీర్చుకోవాలి. నేను వాళ్ల అహాన్ని చెరిపేస్తాను. బాగా సంపాదించి వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటాను.  
రేవతి: అదంతా ఎందుకు కిరణ్.
కిరణ్: నా కోసం వెయిట్ చేసే ఓపిక నీకు లేకపోతే నీకు అడ్డురాను. నీ జన్మకి నువ్వే నా భార్యవి. నా మీద నమ్మకంతో ధైర్యంగా ఉండు రేవతి. ఎప్పటికైనా తిరిగి వస్తాను. మన ప్రేమను గెలిపించుకుంటాను.
రేవతి: అలా కిరణ్ వెళ్లి పోయాడు. అప్పుడు నుంచి ఆయన ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నాను.
చలపతి: ఇది జరిగి కొన్ని సంవత్సరాలు అయింది. నాకు అయితే అతను తిరిగి వస్తాడని నమ్మకం లేదు. 
సీత: అలా అనకండి బాబాయ్ నిజమైన ప్రేమ మనుషుల్ని మనసుల్ని దూరం చేయదు. 
రేవతి: మేం త్వరలోనే కలుస్తాం అని నాకు నమ్మకం ఉంది. 


పెళ్లి వాళ్ల ముందు సీత ప్రవర్తన గురించి రామ్ సీతని తిడతాడు. దానికి సీత ఇన్నేళ్లు రేవతి అత్తయ్య ఎందుకు పెళ్లి చేసుకోలేదో నీవ్వు తెలుసుకున్నావా అని అడుగుతుంది. ఇక సీత రేవతి ప్రేమ గురించి రామ్‌కి చెప్తుంది. కిరణ్‌ గురించి రేవతి ఎదురు చూస్తుందని అంటుంది. చేతనైతే మాకు సాయం చేయు అంతే కానీ ఇలా మీ పిన్ని గురించి మాతో గొడవ పడకు అని సీత రామ్‌కి చెప్తుంది. మహాలక్ష్మి కిరణ్‌ గురించి ఆలోచిస్తుంది. కిరణ్‌ డబ్బు సంపాదించి తిరిగి వస్తే తాను ఓడిపోయినట్లే అని అనుకుంటుంది. సీత మహాలక్ష్మిని చూసి కావాలనే కిరణ్‌తో మాట్లాడినట్లు నటిస్తుంది. మహాలక్ష్మి సీత దగ్గరకు వచ్చి ఫోన్‌లో ఎవరు అని అడిగి ఫోన్ లాక్కుంటుంది. చూస్తే అది సీత నాటకం అని తెలుస్తుంది. కిరణ్‌ తిరిగి వస్తాడని రేవతి, కిరణ్‌లు పెళ్లి చేసుకుంటారని సీత మహాలక్ష్మితో చెప్తుంది దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: కార్తీకదీపం 2 సీరియల్: పెళ్లి గురించి తల్లిదండ్రులకు క్లారిటీ ఇస్తానన్న కార్తీక్.. దీపకి కౌంట్‌డౌన్ స్టార్ అన్న నర్శింహ!