Seethe Ramudi Katnam Today Episode మహాలక్ష్మి ప్రీతి కాళ్లకు కాలు అడ్డుపెట్టి పడేలా చేసి సీత, రామ్‌ల తొలిరేయి ఆపేస్తుంది. విద్యాదేవి, సీత, రేవతిలు  మహాలక్ష్మి చేసిన పని గురించి మాట్లాడుకుంటారు. తాము దూరంగా ఉండాలి అని ఇంతకు ముందు కూడా ఇలాంటివి చాలా చేసిందని సీత విద్యాదేవితో చెప్తుంది.


విద్యాదేవి: అసలు ఫంక్షన్‌కి వెళ్లిన వారు ఎందుకు తిరిగి వచ్చారు.
అర్చన: ఏముంది మీరు ప్రీతి, ఉషలకు సినిమాకు పంపాలి అనుకున్నారు. వాళ్లు వెళ్లకుండా ఇంట్లో ఉండి ఇక్కడ జరిగింది  మహాలక్ష్మి వదినకు చెప్పుంటారు.
విద్యాదేవి: మనసులో.. నేను మహాలక్ష్మిని చాలా తక్కువ అంచనా వేశాను. సారీ సీత నా వల్ల మీరు అప్‌సెట్ అయ్యారు.
సీత: అదేం లేదు టీచర్‌ ఇవాళ జరగాల్సింది ఏదో ఒక రోజు జరుగుతుంది. కానీ నా వల్ల ప్రీతి కాలు బెనికింది. తను బాధ పడుతుంటుంది. అదే బాధగా ఉంది. 


ప్రీతి దగ్గరకు విద్యాదేవి వెళ్తుంది. ప్రీతి కాలిని తన ఒడిలోకి తీసుకుంటుంది. ప్రీతి లేచి కాలు లాక్కుంటే కాలు నొప్పి తగ్గిస్తాను అని అంటుంది. కాలు నొప్పి తగ్గిస్తాను అని విద్యాదేవి అంటుంది. ప్రీతికి నచ్చ చెప్పి కాలికి బామ్ రాస్తుంది. 


విద్యాదేవి: నువ్వు నన్ను ఎన్ని మాటలు అన్నా నాకు నీ మీద కోపం ఉండదు ప్రీతి. ఎందుకో తెలుసా నాకు నీ లాంటి కూతురు ఉంది. అది చిన్నప్పుడు నాకు దూరం అయింది అందుకే తనని నీలో చూసుకుంటున్నాను. నీకు కూడా చిన్నప్పుడు మీ అమ్మ దూరం అయిందని విన్నాను. అప్పుడు నువ్వు పసి దానివి కదా నీకు గుర్తుండదు.
ప్రీతి: నాకు గుర్తుంది. మా అమ్మ రూపం ఇప్పటికీ నాకు గుర్తుంది.
విద్యాదేవి: మనసులో.. ఆ రూపం మారిన మీ అమ్మ కూడా నీ కళ్ల ముందే ఉంది ప్రీతి. 
ప్రీతి: అయినా మా అమ్మని నేను మిస్ అవ్వలేదు. నన్ను మా పిన్ని అంత బాగా చూసుకుంటుంది. 


విద్యాదేవి ప్రీతికి మంచి విషయాలు చెప్తుంది. మంచిగా ఉండాలని మంచి పేరు తెచ్చుకోవాలని చెప్తుంది. ఇప్పుడు నువ్వు చిన్నపిల్లవని ఇప్పుడిప్పుడే టీనేజ్‌కు వస్తున్నావ్ అని ఇప్పుడే లైఫ్‌లో మంచి నిర్ణయాలు తీసుకోవాలి అని ఈ వయసులోనే ఈ విషయాలు తెలుసుకోవాలని చెప్తుంది. మీ అమ్మ ఉండి ఉంటే నీకు అన్నీ చెప్పుండేదని అంటుంది. ఇక చిన్నప్పుడు మీ అమ్మలా ఇప్పుడు జోల పాట పాడుతాను హాయిగా నిద్రపో అని చెప్తుంది. లాలి.. లాలి.. జోలాలి అంటూ పాట పాడుతుంది. ప్రీతి పడుకుంటుంది. తర్వాత విద్యాదేవి దుప్పటి కప్పి వెళ్లిపోతుంది. 


సీత: ప్రీతికి ఎలా ఉంది మామ.
రామ్: కాస్త బెనికింది. రేపు హాస్పిటల్‌కి తీసుకెళ్తాను. పడుకుంది. సారీ సీత నిన్ను చాలా డిసప్పాయింట్ చేశాను. మనం హ్యాపీగా ఉన్న టైంలో నేను కిందకి వెళ్లాల్సి వచ్చింది. 
సీత: ప్రీతి నీకు చెల్లి అయితే నాకు మరదలు మామ. తను కింద పడిపోయి బాధ పడుతున్నా పట్టించుకోకుండా నీతో పడక సుఖం కావాలి అనుకునే అమ్మాయిని కాదు మామ నేను. మనుషులు కలవాలి అని కోరుకునేది వాళ్లు మనసులు కలవాలి అనే కాని ఆ సుఖం కోసం కాదు మామ. మనం ఇలా దూరంగా ఉన్నా నాకు బాధ లేదు. మనసులు కలిసినా మనసులు కలిసినా బంధం ఏర్పడితే చాలు.
రామ్: నీ మనసు నాకు తెలుసు సీత. నువ్వు ఇలా అర్థం చేసుకుంటావ్ అని తెలుసు. అందుకే నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. ఇందాక మనం సంతోషంగా ఉన్నా నా మనసులో గిల్టీ ఉండేది. పిన్ని అంగీకారం లేకుండా నీతో కలవడం తప్పు అనిపించింది కానీ నిన్ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఒప్పుకున్నాను. కానీ అది తప్పు అని ఆ దేవుడికి కూడా అనిపించింది అందుకే ఇలా జరిగింది. మనం ఇంకొంత కాలం వెయిట్ చేద్దాం సీత. ఏదో ఒకరోజు మా పిన్నే మన ఫస్ట్ నైట్ ఏర్పాటు చేస్తుంది. ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను సీత.
సీత: మనసులో.. మీ పిన్ని గురించి ఎప్పుడు తెలుసుకుంటావా అని ఎదురు చూస్తున్నాను మామ. 
రామ్: త్వరలోనే పిన్ని ముహూర్తం ఫిక్స్ చేస్తుంది. మన పిల్లలతో కూడా ఆడుకోవాలి అని పిన్నికి ఉంటుంది కదా.
సీత: మనసులో.. మన జీవితాలతో ఆడుకోవాలి అని తను ఎప్పుడో ఫిక్స్ అయింది. 
రామ్: మనం పిన్నికి చాలా రుణపడి ఉన్నాం.  మనకు పాప పుడితే  మహాలక్ష్మి అని పిన్ని పేరు పెట్టుకుందాం.
సీత: మనసులో.. మనం రుణపడింది మీ పిన్నికి కాదు మామ మీ అమ్మకి మామ. మన బిడ్డకు సుమతి అని పేరు పెట్టాలి.  


 మహాలక్ష్మి, జనార్థన్, అర్చన, గిరిధర్‌లు సీత రామ్‌ల తొలిరేయి ఆగిపోయినందుకు సంతోషపడతారు. ప్రీతి ఎందుకు పడిపోయిందా అని ఆరా తీస్తారు.  మహాలక్ష్మి తన వల్లే ప్రీతి పడిపోయిందని తెలిస్తే ఏమనుకుంటారో అని అనుకుంటుంది. ఇక విద్యాదేవికి ప్రీతి, రామ్, సీతల పట్ల ఎందుకు అంత అభిమానంగా ఉందని గిరిధర్ అంటాడు. జనార్థన్ విద్యాదేవి అందరి పట్ల అలాగే ఉంటుందని తాను పడిపోబోతే పట్టుకుందని అంటాడు. దానికి  మహాలక్ష్మి విద్యాదేవి కన్నింగ్ అని అంటుంది. అయితే  మహాలక్ష్మి ముందు సీతకు సపోర్ట్ చేస్తున్న రేవతిని పంపించాలి అనుకుంటుంది. అందరూ షాక్ అవుతారు. ఇంటి ఆడబిడ్డని ఇంటి నుంచి పంపేయడం తప్పు అంటే  మహాలక్ష్మి ఇంటి నుంచి పంపడం అంటే పెళ్లి చేసి అత్తారింటికి పంపడం అని  అంటుంది. అందరూ రేవతితో మాట్లాడాలి అనుకుంటారు. 


రేవతి హాల్‌లో ఉంటే జనార్థన్, గిరిధర్‌లు వెళ్లి రేపు నీకు పెళ్లి చూపులను అని అంటారు. దానికి రేవతి తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని అంటుంది. అర్చన,  మహాలక్ష్మిలు కూడా రేవతిని పెళ్లి చేసుకోమని చెప్తారు. రేవతి అందర్ని ఎదురిస్తుంది. అమెరికా సంబంధమని వారంలో పెళ్లి అని చెప్తారు. రేవతి తనకు పెళ్లి ఇష్టం లేదు అని కరాఖండీగా చెప్పేస్తుంది. ఇంతలో సీత వస్తుంది.  అన్నయ్య వదినలు అని వీళ్లకి ఇప్పుడు గుర్తొచ్చిందని అంటుంది. ఇక సీత పిన్ని పెళ్లి కోసం నేను కూడా ఎదురు చూస్తున్నాను అని అంటుంది. సీత వెటకారంగా రేవతితో పెళ్లి గురించి మాట్లాడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: సత్యభామ సీరియల్: ఫ్యాన్స్‌కి పండగే.. సత్యలో మొదలైన మార్పు, భర్తని చూ..స్తూ ఉండిపోతుందిగా.. ఎగిరి గంతేస్తున్న క్రిష్!