Seethe Ramudi Katnam Today Episode: మధు ఫ్రెండ్స్ ఇంటికి వచ్చి మధుని పెద్ద బంగ్లాలో చూశాం అని తన భర్త పేరు రామ్‌ అని చెప్పారని అతను హీరోలా ఉంటాడు అని సూర్య ముందు అంటారు. సూర్య రగిలిపోతాడు. సూర్య అన్న వాళ్లతో మీరు చూసింది అబద్ధం అని రామ్ మధు చెల్లి సీత భర్త అని చెప్తాడు. మధు ఫ్రెండ్స్‌ని రామ్ అన్నయ్య వెళ్లిపోమని చెప్తాడు. ఇక మధు జరిగింది చెప్పబోతే సూర్య అడ్డుకుంటాడు. అదే నిజం అని సూర్య కూడా అంటాడు. 


సూర్య: మధుకి నేను అంటే ఇష్టమని నన్ను ప్రేమిస్తుందని నేను అపార్థం చేసుకున్నాను. అది మీరు అర్థం చేసుకోండి. 
జలజ: మధు ఇప్పుడు ఫీలై ప్రయోజనం ఏంటి. నువ్వు ఈ ఇంటికి రాకుండా ఉండాల్సింది. సూర్య నిన్ను అర్థం చేసుకోడని నాకు ఎప్పుడో తెలుసు. నీకు తన మీద ప్రేమ చచ్చిపోయింది అన్నాడు. నిజానికి తనకి నీ మీద ప్రేమ తగ్గిపోయింది. ఆ స్థానంలో అనుమానం వచ్చింది. అనుమానపు భర్తతో ఉండటం కంటే చావడం బెటర్. ఆలోచించు మధు నీకు ఎక్కడ గౌరవం ఉంటే అక్కడికి వెళ్లిపో.


సీత సుమతి ఫొటోతో మాట్లాడుతుంటుంది. విద్యాదేవి అది చూసి సీత దగ్గరకు వచ్చి మీ అత్తమ్మ ఫొటో హాల్‌లో పెట్టించడం తనకు చాలా సంతోషంగా ఉందని అంటుంది. ఇక విద్యాదేవి సీతతో నువ్వు అందరి ముందు మహాలక్ష్మీ మీద అనుమానంతో ఎదురించి మాట్లాడావు కదా రామ్ నిన్ను ఏం అనడా అని అడుగుతుంది. దానికి సీత అలాంటిది ఏమీ ఉండదు అని చెప్తుంది. రామ్ తనని అనేముందు ఓ పని చేస్తాడు అని తన వల్ల వాళ్ల పిన్ని బాధ పడిందని బాగా ఆలోచించి మహాలక్ష్మి గదిలోకి వెళ్తాడు అని మహాలక్ష్మి గదిలో చైర్‌లో గంభీరంగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుందని రామ్ వెళ్లి పిన్ని అని పిలిచినా పలకదు అని ఇమిటేట్ చేస్తుంది. సీత మాటలకు ఫీలవుతున్నావా పిన్ని సీత మాటలకు సారీ అని చెప్తాడని అంటుంది. రామ్ సేమ్ అలాగే మహాలక్ష్మితో చెప్తాడు. భోజనానికి రామ్ పిలుస్తాడు అని అంటుంది. రామ్ కూడా మహాలక్ష్మి అలాగే పిలుస్తుంది. తర్వాత తింటాను అని మహాలక్ష్మి అంటుందని.. రామ్‌ని వెళ్లిపోమని అంటుందని.. మహాలక్ష్మిని ఇమిటేట్ చేస్తుంది. ఇక సీత మహాలక్ష్మిని ఇమిటేట్ చేయడం విద్యాదేవి నవ్వుకుంటూ ఉంటారు. ఇంతలో రామ్ కిందికి వస్తాడు. సీతని ప్రశ్నిస్తాడు. సీత అవును కాదు అంటూ తలాడిస్తుంది. ఇక రామ్ సీతని గదిలోకి తీసుకెళ్లి తనని కూడా ఇమిటేట్ చేయమని అంటాడు. సీత రామ్ ఆఫీస్ నుంచి వచ్చిన దగ్గర నుంచి సీతతో ఎలా ఉంటాడో ఎలా రొమాంటిక్‌గా మాట్లాడుతాడో చేసి చూపిస్తుంది. మధ్యలో మహా పిలిచిందని రామ్ సీతని వదిలేసి వెళ్లపోయినట్లు చేస్తుంది. రామ్ కూడా సీతని ఇమిటేట్ చేస్తాడు. 


ఇక రాత్రి ప్రీతి వాటర్ బాటిల్‌ తీసుకొని కిందకి వస్తుంది. నీళ్లు తీసుకుంటుండగా సుమతి ఫొటో వెనక సీత దాక్కొని ప్రీతిని భయపెడుతుంది. ప్రీతి నేను మీ అమ్మ సుమతిని ఇలా రా ప్రీతి నిన్ను ఏమీ చేయను అని అంటుంది. ఆ మాటలు విన్ని ప్రీతి చాలా భయపడుతుంది. ఇక సీత ఆపకుండా... ప్రీతి నువ్వు చాలా మంచి దానివి.. తెలివైనదానివి.. బాగా చదువుకున్నావు కానీ మహాలక్ష్మి మాటలు విని చెడిపోతున్నావు..  నువ్వే కాదు ఈ ఇంట్లో అందరూ మహాలక్ష్మి మాటలు విని తప్పులు చేస్తున్నారు. నాకు అందరి గురించి తెలుసు. మహాలక్ష్మి నిన్ను మీ అన్న రామ్‌ని తన కంట్రోల్‌లో పెట్టుకొని తన ఇష్టం వచ్చినట్లు ఆడిస్తుంది. ఈ భవిష్యత్ బాగుండాలి అంటే మీరు మహాలక్ష్మి మాటలు వినకూడదు. మీ అమ్మగా మీకు నేను అన్నింటా అండగా ఉంటాను ఇక నా మాటలు వినండి మీరు సంతోషంగా ఉంటారు అని అంటుంది. ఇక నా దగ్గరకి రా ప్రీతి అని సుమతిలా పిలవగానే ప్రీతి మహాలక్ష్మి దగ్గరకు పరుగులు తీస్తుంది. హాల్‌లో అమ్మ మాట్లాడిందని.. నన్ను అన్నయ్యని పిన్నికి దూరంగా ఉండమని అమ్మ ఫొటో చెప్పిందని ప్రీతి టెన్షన్‌గా భయంగా చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: సత్యభామ సీరియల్: తన మనసు గెలుచుకున్నావ్ అని క్రిష్‌తో చెప్పిన సత్య.. రేణుక విషయం తెలిసి మహదేవయ్య ఇంట్లో రచ్చరచ్చ!