Seethe Ramudi Katnam Serial Today Episode శివకృష్ణ, లలితలు విద్యాదేవి సుమతి అని తెలియడంతో మహాలక్ష్మిని నిలదీయడానికి విద్యాదేవిని తీసుకొని మహా ఇంటికి వస్తారు. శివకృష్ణ సీరియస్‌గా మహాలక్ష్మిని పిలుస్తాడు. రామ్, సీతలు ముందు కిందకి వస్తారు. ఏమైందని ఎందుకు అలా అరుస్తున్నారని రామ్ అడుగుతాడు. ఇంతలో మహాలక్ష్మి వస్తుంది.
మహాలక్ష్మి: సిగ్గు లేకుండా మళ్లీ మా ఇంటికి ఎందుకు వచ్చావ్ విద్యాదేవి.
శివకృష్ణ: తను రాలేదు మేం తీసుకొని వచ్చాం.
జనార్థన్: తీసుకురావడానికి మీరు ఎవరు.. తిరిగి రావడానికి తను ఎవరు.
అర్చన: ఈ ఇంట్లో ఆమెకు స్థానం లేదు అని చెప్పాం కాదు మళ్లీ ఏ ముఖం పెట్టుకొని వచ్చారు.
ప్రీతి: నాకు ఆవిడ ముఖం చూడటమే ఇష్టం లేదు. ఆవిడ ఉంటే నేను మళ్లీ సూసైడ్ చేసుకుంటా.
శివకృష్ణ: నీకు ప్రాణం పోసిందే ఈవిడ. నువ్వు పుట్టిందే ఈవిడకు.
మహాలక్ష్మి: నా ఇంటికే వచ్చి నట్టింట్లో ఏం మాట్లాడుతున్నారు.
లలిత: ఇది నీ ఇళ్లు మహాలక్ష్మి గారు. ఈవిడ ఇళ్లు.
జనార్థన్: ఎవరినో తీసుకొచ్చి ఆవిడ ఇళ్లు అంటారేంటి.
శివకృష్ణ: ఈవిడ ఎవరో కాదు బావగారు స్వయానా నా తోడ బుట్టిన చెల్లెలు. సుమతి.. మీరు పెళ్లి చేసుకున్న మీ భార్య. రామ్ ప్రీతిల కన్నతల్లి.
సీత: ఏంటి నాన్న మీరు చెప్పేది ఈవిడ నా మేనత్తా.
రామ్: ఏంటి మామయ్య ఈవిడ నా తల్లా.
మహాలక్ష్మి: నీ కూతురికే పిచ్చి అనుకున్నా నీ ఫ్యామిలీ మొత్తానికి పిచ్చేనా.
విద్యాదేవి: ఎవర్ని పిచ్చి అంటున్నావ్ మహాలక్ష్మి, వాళ్లు చెప్పేదంతా నిజం. నేనే సుమతిని.
మహాలక్ష్మి: టీచర్ అవతారం చాలించి కొత్త నాటకం మొదలు పెట్టావా విద్యాదేవి.. సుమతి ఎలా ఉంటుందో మాకు తెలీదు అనుకుంటున్నావా. నేను సుమతి ప్రాణ స్నేహితురాలిని.
విద్యాదేవి: అందుకేనా ఆ ప్రాణం తీయాలి అనుకున్నావ్.
జనార్థన్: ఏం మాట్లాడుతున్నావ్ విద్యాదేవి.
విద్యాదేవి: నా వర్థంతి రోజు నేను సుమతిగా మాట్లాడిన మాటలు మీకు గుచ్చికుని ఉంటే అప్పుడే నేను ఎవరో మీకు అర్థమై ఉండేది. మీరు చనిపోయింది అనుకున్న సుమతి ఆ రోజు నా ఒంట్లోకి రాలేదు. ఇది నా శరీరం కేవలం నా రూపం మారింది అంటే. నేను చనిపోలేదు మహాలక్ష్మి. నేను కోమాలో చాలా ఏళ్లు ఉన్నాను అంతే. నీ నిజ స్వరూపం తెలిసి నిన్ను నిలదీయాలి అని బయల్దేరాను. అదే సమయంలో నా కొడుకు రామ్‌కి ప్రమాదం జరగబోతే రామ్‌ని కాపాడి నేను ప్రమాదంలో పడ్డాను. అప్పుడు నా ముఖం పూర్తిగా కాలిపోయింది. రామ్ సీత నాకు ట్రీట్మెంట్ ఇప్పించారు. డాక్టర్లు ప్లాస్టిక్ సర్జరీ చేసి నా ముఖాన్ని ఈ రూపంలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు మీ ముందు ఉన్నది మారిన ముఖంతో ఉన్న సుమతినే.
రామ్ విద్యాదేవి దగ్గరకు వెళ్లి ఎమోషనల్ అయి హగ్ చేసుకొని ఏడుస్తాడు. ప్రీతి తల్లిని అన్న మాటలు తలచుకొని బాధ పడి మమ్మీ అంటూ విద్యాదేవిని హగ్ చేసుకుంటుంది. ఇద్దరి పిల్లల్ని దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకుంటుంది. ఇక జనార్థన్ కూడా విద్యాదేవి దగ్గరకు వెళ్లి నమ్మలేకపోతున్నా సుమతి ఇది నువ్వేనా అని అడుగుతాడు. దాంతో సుమతి మీ మీద ఒట్టండి నేను నిజంగా మీ సుమతినే అంటే జనార్థన్ సుమతి ఒకర్ని ఒకరు హగ్ చేసుకుంటారు. మహాలక్ష్మి రగిలిపోతుంది. సీత కూడా అత్తమ్మా అంటూ ఎమోషనల్ అవుతుంది. శివకృష్ణ సుమతి తన చెల్లి అని తన ప్రేమ గురించి చెప్తాడు. మహాలక్ష్మి ఆస్తి కోసం తనని నమ్మించి మోసం చేసి కిరాయి హంతకులతో తనని చంపించాలి అని చూసిందని చెప్పి అందరికీ చెప్తుంది. శివకృష్ణ, లలితలు కూడా మహాలక్ష్మిని తిడతాడు. జనార్థన్, రామ్, ప్రీతిలు కూడా మహాలక్ష్మిని అసహ్యించుకుంటారు. తన ఫ్యామిలీని వదిలిసి వెళ్లిపోమని సుమతితో పాటు అందరూ చెప్తారు. సీత మహాలక్ష్మిని మెడ పట్టుకొని గెంటేస్తా అంటే మహాలక్ష్మి నేనే వెళ్తాను అని పైకి వెళ్తుంది. బ్యాగ్ తీసుకొని వస్తాను అని గన్ తీసుకొని వస్తుంది. ఈ ఇంటికి దేవతలా ఉన్న నన్ను విలన్‌ని చేశావ్ అని గన్‌ని సుమతికి గురి పెడుతుంది. శివకృష్ణ అడ్డు రావడంతో శివకృష్ణను కాల్చేస్తుంది. విద్యాదేవి గట్టిగా అరుస్తుంది. తీరా చూస్తే విద్యాదేవి అన్న ఇంట్లోనే ఉంటుంది. ఇదంతా విద్యాదేవి ఉహించుకుంటుంది.
ఇంట్లో అందరూ విద్యాదేవిని వరస పెట్టి పిలవమని అంటారు. సుమతి గదినే తనకి ఇస్తారు. నిజం చెప్తే తాను ఊహించుకున్నదే జరుగుతుందని అందుకు కొన్ని రోజులు తన గురించి నిజం చెప్పకూడదని విద్యాదేవి అనుకుంటుంది. అర్చన సాంబ దగ్గరకు వచ్చి తనకు కావాల్సిన వస్తువులు తీసుకురమ్మని అంటే సాంబ మహాలక్ష్మి చెప్తేనే చేస్తాను అంటాడు. ఇంతలో సీత వచ్చి దారం తీసుకురమ్మని చెప్తే చిటికెలో వెళ్లి తీసుకొస్తాను అని అంటాడు. అర్చన ఆపి సీత నేను చెప్తే వినలేదు సీత చెప్తే ఎందుకు వెళ్తున్నావ్ అని అడుగుతుంది. దీంతో సాంబ సీత తనని మహా నుంచి కాపాడుతుందని మీరు కాపాడలేరు అని అంటాడు. సీత కావాలనే అర్చనను రెచ్చ గొడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.