Seethe Ramudi Katnam Today Episode: విద్యాదేవిని ప్రీతి చనిపోతాను అని బెదిరించడంతో విద్యాదేవి ఇంటి నుంచి బయల్దేరుతుంది. వెళ్తూ వెళ్తూ జనార్థన్‌ని ప్రీతిని బాగా చూసుకోమని అంటుంది. తాను ఎక్కడున్నా మీ మంచి కోరుతాను అని మీ గురించే ఆలోచిస్తాను అని అంటుంది. మహాలక్ష్మి వెంటనే వెళ్లిపోమని విద్యాదేవికి చెప్తుంది. ఇక ప్రీతి దగ్గరకు విద్యాదేవి వెళ్లి నువ్వు కోరుకున్నట్లే వెళ్లిపోతున్నా కానీ నా మనసు నీ దగ్గరే ఉంటుందని అంటుంది. ప్రీతిని టీచర్ తల నిమిరితే ప్రీతి చేయి తోసేస్తుంది. ఇంకెప్పుడూ రావొద్దని చెప్తుంది. విద్యాదేవి రామ్, సీతలకు చెప్పకుండా వెళ్లిపోతున్నా అని బాధపడుతుంది. అర్చన, గిరిధర్, మహాలక్ష్మి, ప్రీతిలు సంతోషంగా ఉంటారు.


అర్చన: మహా.. కాంగ్రాట్స్ మహా రామ్, సీతలు రాకుండానే ఆ టీచర్‌ని తరిమికొట్టేశావ్. ఈ మొత్తం ఎపిసోడ్‌లో మనందరం హ్యాపీ కానీ ఆ టీచర్, ప్రీతి ఫ్రెండ్ విక్కీ మాత్రం బాధపడ్డారు. పాపం ఆ విక్కీ అనవసరంగా వచ్చి టీచర్ చేతిలో తన్నులు తిన్నాడు. 
మహాలక్ష్మి: వాడు అనవసరంగా ఏం రాలేదు. నేనే ఫోన్ చేసి పిలిచాను.
అర్చన: నువ్వు రమ్మన్నావా.. ఎందుకు.
మహాలక్ష్మి: విద్యాదేవిని వెళ్లగొట్టడానికి వాడిని రమ్మన్నాను. ప్రీతితో క్లోజ్‌గా ఉండమన్నాను. సినిమాకి తీసుకెళ్లమన్నాను. అది చూసి టీచర్ వైల్డ్‌గా రియాక్ట్ అవుతుందని ప్రీతిని సూసైడ్ చేసినట్లు నటించమని చెప్పాను. అలా టీచర్ ఇంటి నుంచి వెళ్లింది. ఈ ఇంటికి పట్టిన శని వదిలిపోయింది. దట్‌ ఈజ్ మహాలక్ష్మి.
అర్చన: మనసులో.. టీచర్‌ని ఇంటి నుంచి పంపించడానికి సొంత కూతురు దగ్గరకే బాయ్‌ఫ్రెండ్‌ని రప్పించింది అంటే మహాలక్ష్మి మహా డేంజర్. 



సీత, రామ్‌లు సరదాగా మాట్లాడుకుంటూ ఇంటికి బయల్దేరుతారు. తన కోసం ఫైట్ చేసినందుకు థ్యాంక్స్ అని చెప్తుంది. ఈ రోజు తాను చాలా ఎంజాయ్ చేశాను అని సీత రామ్‌తో చెప్తుంది. ఇక మనసులో.. టీచర్‌ చెప్పడం వల్లే మామతో బయటకు రాగలిగాను అని టీచర్‌ని ఎప్పుడూ ఇంట్లో ఉండేలా చేయాలని అనుకుంటుంది. టీచర్‌కి తన సంతోషం అంతా చెప్పాలి అని అనుకుంటుంది. మరోవైపు విద్యాదేవి వెళ్తుంటే మహాలక్ష్మి చిటికెలు వేసి ఆపుతుంది. 


మహాలక్ష్మి: నవ్వుతూ ఈ ఇంటికి వచ్చావ్ ఏడుస్తూ వెళ్లిపోతున్నావ్. ఈ మహాలక్ష్మికి ఎదురు వస్తే ఇలాగే ఉంటుంది. ఎందుకు నవ్వుతున్నావ్ ఏడ్వలేక నవ్వుతున్నావా..
విద్యాదేవి: నీ అజ్ఞానం చూస్తుంటే నవ్వొస్తుంది మహాలక్ష్మి.
మహాలక్ష్మి: నన్నే పేరు పెట్టి పిలుస్తావా..
విద్యాదేవి: పేరు పెట్టింది పిలవడానికే కదా. 
మహాలక్ష్మి: నన్ను పేరు పెట్టి పిలవాలి అంటే అందుకు ఓ అర్హత, హోదా, స్థాయి ఉండాలి.
విద్యాదేవి: అహంకారానికి పేరు పెడితే అది నువ్వే అని అర్థమైంది మహాలక్ష్మి. నీ దుర్మార్గాలు అరాచకాలు ఎప్పటికీ ఇలాగే సాగుతాయి అనుకోకు ఏదో ఒక రోజు నీకు ఎదురు దెబ్బ తగులుతుంది. 
మహాలక్ష్మి:  నన్ను ఢీ కొట్టే వాళ్లు, ఎదురు దెబ్బ కొట్టేవాళ్లు ఇంకా ఈ భూమి మీద పుట్టలేదు.
విద్యాదేవి: నీ లాంటి ఎంతో మందిని ఈ భూమి చూసింది. తనలో కలిపేసుకుంది. నిన్ను ఎదురుదెబ్బ తీసేవాళ్లు ఈ ఇంట్లోనే ఉన్నారు.
మహాలక్ష్మి: ఎవరు ఆ సీత.. అదా.. అదా నన్ను దెబ్బ తీసేది. హా.. నా కాలి గోటిని కూడా అది టచ్ చేయలేదు.
విద్యాదేవి: నీ పతనం మొదలైంది. సీతా రాములు త్వరలో నిన్ను పాతాళానికి తొక్కేస్తారు. 
మహాలక్ష్మి: సీతకి డ్యాన్స్ నేర్పడానికి వచ్చావ్. ఈ ఇంట్లో ప్రతి విషయంలో ఇన్వాల్స్ అయ్యావు. రామ్, ప్రీతి నీ కన్న బిడ్డలు అన్నట్లు ప్రవర్తించావ్. నా భర్త జనాతో కూడా క్లోజ్‌గా మూవ్ అయ్యావ్. తన చేతికి బ్రేస్లేట్ కట్టావ్. తను నీ మీద పడితే నీకు కంగారు లేకపోవడం నువ్వు జనా వైపు ఏదో ఆరాధన భావంతో చూడటం నేను అంతా గమనిస్తూ ఉన్నాను. అసలు నువ్వు ఏ ఉద్దేశంతో నా ఇంటికి వచ్చావ్. నువ్వు నిజంగానే టీచర్‌వేనా.. వశీకరణ విద్య తెలిసిన తాంత్రికురాలివా. నీకు ఏం కావాలి. నా ఇంటికి కుంటుంబం మొత్తాన్ని లాగేసుకోవాలి అని ప్లాన్ చేశావ్. మళ్లీ ఎందుకు నవ్వుతున్నావ్.
విద్యాదేవి: నీ మనసులో మాట బయట పెట్టినందుకు. నీ మాటలు చూస్తుంటే ఒకప్పుడు నువ్వు ఇలాంటి దురుద్దేశంతోనే ఈ ఇంటిలోకి ఎంటర్ అయ్యావని అనిపిస్తుంది. నీకు నన్ను చూసి అలాంటి ఆలోచనలు వస్తున్నాయి అంటే నువ్వు తప్పకుండా అలాంటి పని చేసే వచ్చుంటావ్. నువ్వు సుమతి ఫ్రెండ్‌గా ఈ ఇంటికి వచ్చి ఆమెను ఏదో చేసి ఆమె స్థానాన్ని నువ్వు కొట్టేసినట్లుగా అనిపిస్తుంది.
మహాలక్ష్మి: ఆపు..
విద్యాదేవి: ఎందుకు అంత కంగారు పడుతున్నావ్. 
మహాలక్ష్మి: చాలా ఎక్కువ మాట్లాడుతున్నావ్.
విద్యాదేవి: నువ్వు అభద్రతాభావంతో ఉన్నావ్. నువ్వు సుమతిని ఏదో చేశావ్.
మహాలక్ష్మి: నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావ్.. గెట్ అవుట్.. నా ఇంటి నుంచి వెళ్లిపో.. ఎవరు ఇది నా చరిత్ర అంతా తెలిసినట్లు మాట్లాడుతుంది. చచ్చినా దీన్ని మళ్లీ ఈ ఇంటికి రానివ్వకూడదు. 


విద్యాదేవి వెళ్తుంటే వాచ్‌మెన్ సాంబ ఆపి వెళ్లొద్దని సీతకి అండగా ఉండమని వేడుకుంటాడు. దానికి విద్యాదేవి ఇప్పుడు వెళ్లకతప్పదని దేవుడి దయ ఉంటే త్వరలోనే వస్తాను అని రాజ్యం, నువ్వు సీతకి అండగా ఉండండి అని చెప్పి వెళ్తుంది. ఇక విద్యాదేవి వెళ్తూ మనసులో సీత జీవితం చక్కదిద్దేవరకు ఇంటి నుంచి వెళ్లకూడదు అనుకున్నాను అని కానీ మహాలక్ష్మి మోసం చేసి పంపేసిందని ఫీలవుతుంది. మరోవైపు సీత టీచర్‌ని ఎలా అయినా ఇంట్లో ఉంచడానికి ఒప్పించాలి అని అనుకుంటుంది. ఇక విద్యాదేవి పక్కనుంచే సీత, రామ్‌లు కారులో వెళ్తారు కానీ ఆమెను చూడరు. విద్యాదేవి ఓ బస్‌స్టాప్‌కి వెళ్లి ఎక్కడికి వెళ్లాలి ఏం చేయాలో అర్థం కావడం లేదు అనుకుంటుంది. ఆశ్రమానికి వెళ్తే బాగుంటుందా.. వాళ్లు గుర్తు పడతారా అని ఆలోచిస్తుంది. కొన్ని రోజులు ఎక్కడైనా ఉండాలి అనుకుంటుంది. కానీ ఎక్కడికి వెళ్లాలి  ఎవర్ని ఆశ్రయం ఆడగాలి అని ఆందోళన పడుతుంటుంది. ఇంతలో అటుగా వచ్చిన శివకృష్ణ విద్యాదేవిని చూసి కారు ఆపి టీచర్ దగ్గరకు వెళ్తాడు. ఇక్కడెందుకు ఉన్నారని అడుగుతాడు. దాంతో టచర్ జరిగింది చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 



Also Read: కార్తీకదీపం 2 సీరియల్: ఇదేం ట్విస్ట్‌రా బాబోయ్.. శౌర్య తన కన్న కూతురే అని చెప్పిన కార్తీక్.. గుండె పగిలేలా ఏడ్చిన జ్యోత్స్న!