Karthika Deepam Idi Nava Vasantham Serial Episode శౌర్య బూచోడు అని అంటుందని అంటే నర్శింహ వచ్చాడా అని కార్తీక్ దీపని అడుగుతాడు. దానికి దీప ఏడుస్తూ అవును బాబు నిద్రపోతున్న పాపని ఎత్తుకుపోవాలి అని వచ్చాడు అని చివరి నిమిషంలో చూసి నా బిడ్డను నేను కాపాడుకున్నానని అంటుంది. ఇంటికి వచ్చి పాపని ఎత్తుకెళ్లిపోతాను అంటే మీరు ఎలా ఊరుకున్నారని ఏ సుత్తో, కత్తితో వాడిని కొట్టాల్సిందని అంటాడు. దీప ఆ విషయం వదిలేయమని అంటుంది.
కార్తీక్: రౌడీని ఈ పరిస్థితికి తీసుకొచ్చాడు వాడిని ఎలా వదులుతాను. అసలు వాడు పాప జోలికి ఎందుకు వచ్చాడు.
దీప: వద్దు బాబు వదిలేయండి. మీరు ఏమీ అడగొద్దు. నేను చెప్పలేను. పిలవగానే వచ్చారు సంతోషం.
కార్తీక్: సరే దీప నీ కోసం కాదు రౌడీ కోసం అగుతాను. రౌడీ కోలుకోని అప్పుడు చెప్తా వాడి సంగతి వాడికి అప్పుడు ఉంటుంది. పాపని చూశారు కదా ఎంత భయపడిందో వాడికి చేయాల్సింది నేను చేస్తా.
జ్యోత్స్న: ఏం జరుగుతుంది. తండ్రి దూరం పెడితే అనుకోవడానికి కానీ వాడు వచ్చి తీసుకెళ్తా అన్నా దీప ఎందుకు అడ్డు పడుతుంది. ఇక్కడే ఉండిపోవడానికా.. నా అంచనా కరెక్ట్ అయితే బావని దీప హాస్పిటల్‌కి పిలుచుంటుంది. (కార్తీక్‌కి కాల్ చేస్తే లిఫ్ట్ చేయడు. దీప ఫోన్ చూస్తుంది కానీ కార్తీక్‌కి చెప్పదు.) ఏంటో ఎవరో కావాలనే చేస్తున్నట్లుంది. మీ ఇద్దరి మధ్య ఏదో నాకు తెలీని కథ నడుస్తుందని నాకు అర్థమైంది. అది నేనే కనిపెడతాడు.
శౌర్య కార్తీక్.. కార్తీక్ అని కలవరించడంతో నర్స్ కార్తీక్‌తో మీ పాపకు మీరు అంటే చాలా ఇష్టం కదా అని అంటుంది. దాంతో దీప కార్తీక్‌లు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. దీప బయటకు వెళ్తే నర్శింహ క్లాప్స్ కొట్టుకుంటూ వస్తాడు. దీప దగ్గరకు వెళ్లి ఏంటి కొడతావా కొట్టు కొడితే నా తల పగిలిపోవాలి అని అంటాడు.
నర్శింహ: అదేంటే అయితే నిన్ను కలవరించాలి.. లేదంటే మా అమ్మని కలవరించాలి. కానీ ఆ కార్తీక్‌కి కలవరిస్తుంది ఏంటి. ఆడు ఇప్పుడు పాప దగ్గరే ఉన్నాడు కదా. నువ్వే కదా ఫోన్ చేసి మరీ పిలిచావ్. అన్నీ కనిపెడుతూనే ఉన్నానే.
దీప: సహనం కోల్పోయాను నర్శింహ దయచేసి ఇక్కడి నుంచి వెళ్లిపో.
నర్శింహ: పాపని తీసుకెళ్లడానికే నేను ఇక్కడికి వచ్చాను.
దీప: నర్శింహ..
కార్తీక్: దీప అంత గట్టిగా అరించింది ఏంటి.
నర్శింహ: ఇక్కడ కార్తీక్‌ని చూశాకా నా మనసు మార్చుకున్నాను. ఇక్కడే దీనికి ఓ ముగింపు ఇవ్వాలి అనుకుంటున్నాను. ఇంతకు ముందు అడిగిందే ఇప్పుడు అడుగుతున్నా శౌర్య నా కూతురు అయితే నాకు ఇచ్చేయ్. నా కూతురు కాదు అంటే వదిలేయ్..
కార్తీక్: ఎవర్ని ఎత్తుకెళ్తావ్‌రా..
నర్శింహ: వచ్చాడు హీరో..
కార్తీక్: నువ్వు ఇలాగే బాధ పడితూ ఉంటే ఇలాంటి వెధవకి బుద్ధిరాదు దీప. వీడికి కత్తిపీటే కరెక్ట్.
దీప: ముందు నేను నా కూతుర్ని కాపాడుకోవాలి.
నర్శింహ: ఇదేదో బాగుందే వాడు నిన్ను రెచ్చగొడుతున్నాడు. నువ్వు వాడిని జో కొడుతున్నాడు. సార్‌కి అసలు విషయం తెలీదా దీప. చెప్పలేదా..
కార్తీక్: ఏంటి దీప అది..
నర్శింహ: ఇలాంటి విషయాలు సార్‌కి చెప్పాలి కదా దీప. లేదంటే తప్పుగా అర్థం చేసుకోడా. కార్తీక్ సార్ నేను పాప జోలికి వచ్చింది నేను మీ దీపని బాధ పెట్టడానికి కాదు. మేడంగారికి ఇచ్చిన గడువులో నాకు ఏదో ఒక సమాధానం చెప్పలేదు కదా. ఈ పంచాయితీ ఈ రోజుతో తేలిపోవాలి. ఏం లేదు సార్ దీపని నేను ఓ మాట అడిగాను. దానికి దీప సమాధానం చెప్పడం లేదు అది చెప్తే వెళ్లిపోతా. శౌర్య నాకు పుట్టిన కూతురు అయితే నాకు ఇచ్చేయ్ మనండి నేను పోతా. అది నా కూతురు కాదు అని చెప్పమనండి ఇక జీవితంలో మీ జోలికి రాను.
కార్తీక్: మనసులో.. ఇన్ని రోజులు దీప బాధ పడటానికి కారణం ఇదన్నమాట.
నర్శింహ: ఆడదాని మౌనం అంగీకారం. అంటే శౌర్య నా కూతురు అని ఒప్పుకున్నట్లే కదా. మిగతా విషయాలు మీరు ఇద్దరూ మాట్లాడుకోండి నేను నా కూతుర్ని తీసుకొని పోతా.
కార్తీక్: రేయ్.. రేయ్.. పాప జోలికి వస్తే ఊరుకోను.
నర్శింహ: అది నా కూతురు సార్. ఆపడానికి మీరు ఎవరు.
కార్తీక్: నర్శింహ పాప ఇప్పుడే భయంతో వణికిపోతుంది. వెళ్లిపో..
దీప: నర్శింహ నన్ను నా కూతుర్ని వదిలేయ్.. మెల్లగా మాట్లాడు ఈ మాటలు దానికి వినపడకూడదు.
నర్శింహ: నేను నా కూతుర్ని తీసుకుపోతా.
కార్తీక్: నువ్వు పాపని తీసుకెళ్లడానికి వీల్లేదు. శౌర్య నీ కూతురు కాదురా.. శౌర్య నా కూతురు. నేనే శౌర్య కన్న తండ్రిని. నీకు కావాల్సిన సమాధానం దొరికింది కదా పోరా.
నర్శింహ: ఇంతలా వెంటపడినా ఇది ఇన్ని రోజులు సమాధానం చెప్పలేదు ఇందుకన్నమాట. నువ్వెలాంటి దానివో ఇప్పుడు అర్థమైందే.
కార్తీక్ మాటలకు నర్శింహ వెళ్లిపోతాడు. హాస్పిటల్‌కి వచ్చి అదంతా విన్న అందతా విన్న జ్యోత్స్న కూడా ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇంతలో శౌర్య కూడా లేచి బయటకు వస్తుంది. దీంతో దీప శౌర్య దగ్గరకు వెళ్లి టిఫెన్ తినిపిస్తుంది. కార్తీక్ మాటలకు దీప ఆలోచలో పడుతుంది. శౌర్య అదంతా చూసిందేమో అని కంగారు పడుతుంది. ఇక పాపని దీప పడుకోపెట్టి బయటకు వెళ్తుంది. జ్యోత్స్న మధ్యలో కారు ఆపి కార్తీక్ మాటలు తలచుకొని ఏడుస్తుంది. నేను ఏమైపోవాలి అని గుండె పగిలేలా ఏడుస్తుంది. బయట కార్తీక్ ఉంటే దీప ఆవేశంగా కార్తీక్ దగ్గరకు వెళ్తుంది. ఎదురుగా నర్స్ చేతిలో కత్తెర తీసుకొని కార్తీక్ భుజం మీద పెట్టి ఏయ్ నువ్వా నా కూతురి తండ్రివి అని అరుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.