Seethe Ramudi Katnam Today Episode: మహాలక్ష్మి, తన భర్త, అర్చన, గిరిధర్, చలపతి ఆఫీస్‌కు వస్తారు. చలపతికి మహాలక్ష్మి బయటే ఉండమని లాయర్, ఆడిటర్ వస్తారని వాళ్లని తీసుకొని లోపలికి రమ్మని చెప్తుంది. ఇక మహాలక్ష్మి తన క్యాబిన్‌కు వెళ్లాక గిరిధర్‌కి డోర్ క్లోజ్ చేసి రమ్మని చెప్తుంది. అది చూసిన చలపతి నన్ను బయటే ఉండమని లోపలికి వెళ్లి డోర్ క్లోజ్ చేసుకున్నారు అంటే ఏం మాట్లాడుకుంటారా అని చలపతి డౌట్ పడతాడు. 


అర్చన: ఈ ఎమర్జెన్సీ బోర్డ్ మీటింగ్ ఎందుకు మహా.. అది కూడా రామ్ లేకుండా.. ఆడిటర్, లాయర్‌లను ఎందుకు రమ్మని చెప్పావ్. 
గిరిధర్: ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నావ్ ఏంటి వదినా అది.
చలపతి: మహాలక్ష్మి నన్ను ఎందుకు లోపలికి పిలవలేదు. నాకు తెలీని సీక్రెట్స్ ఏంటి..
మహాలక్ష్మి: ఊరు నుంచి వచ్చాక సీత ఏం మాట్లాడిందో మీరందరూ విన్నారు కదా.. 
మహాభర్త: ఊరు నుంచి ఫొటోలు తీసుకొచ్చి మనల్ని బెదిరించింది. 
మహాలక్ష్మి: ఆ పని అది ఎప్పుడో ఒకసారి చేసి తీరుతుంది. నేను చెప్పబోయేది ఆ విషయం గురించి కాదు.. రామ్‌నీ నన్ను విడదీయలేరు.. నేను రామ్ భార్యని నాకు రామ్‌ మీద అన్ని హక్కులు, అధికారాలు ఉన్నాయి అని నిన్న సీత చాలా పొగరుగా చెప్పింది కదా.. అందుకే త్వరలోనే దాని పొగరు అన్నీ అనిగేలా చేసి రామ్‌తో దానికి విడాకులు ఇప్పిస్తాను. రామ్‌కి ఆస్తిలో 50 శాతం వాటా ఉంది. కంపెనీల్లో షేర్లు ఉన్నాయి. రేపు డివోర్స్  అయ్యాక సీతకు భరణం ఇవ్వాల్సి వస్తుంది. ఆస్తిలో రామ్ వాటా కంపెనీల్లో షేర్స్ సీతకు ఇవ్వాల్సి వస్తుంది. 
మహాభర్త: అలా ఎలా ఇస్తాం. సీతకు చిల్లిగవ్వ కూడా ఇవ్వకూడదు. 
అర్చన: దాన్ని కట్టుబట్టలతో ఇంటి నుంచి పంపించేయాలి..
మహాలక్ష్మి: నా ఆలోచన కూడా అదే.. రామ్‌కి సంబంధించిన ఏ పాపర్టీస్‌లోనూ.. షేర్స్‌లోనూ డివోర్స్ తర్వాత సీతకు చెందకూడదు అంటే రామ్‌ పేరు మీద ఎలాంటి ఆస్తిలు ఉండకూడదు. రామ్‌కి చెందిన అన్నీ మన పేరుమీద ట్రాన్షఫర్ చేసుకోవాలి. ఈ పని ఇప్పుడే జరిగిపోవాలి. అప్పుడే రామ్ ఎప్పుడు సీతకు విడాకులు ఇచ్చిన ఒక్క రూపాయి కూడా సీతకు వెళ్లదు. 
మహాభర్త: మంచి నిర్ణయం తీసుకున్నావ్ మహా.. 
మహాలక్ష్మి: అందుకే లాయర్‌ని, ఆడిటర్‌ని పిలిపించాను వాళ్లు రాగానే ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను.
మహాభర్త: కానీ మహా రామ్‌తో ఒక్క మాట చెప్పి చేస్తే బెటర్. రామ్‌కి తెలీకుండా ఏం చేయలేం కదా.. 
అర్చన: మహా చెప్తే రామ్ కాదంటాడా బావగారు.. మహా ఏం చెప్తే రామ్ అది కచ్చితంగా చేస్తాడు.
గరిధర్: కానీ రామ్‌కి చెప్పి చేయడం మంచిది వదినా.. అప్పుడే లీగల్‌గా ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉంటుంది.
మహాలక్ష్మి: లాయర్‌, ఆడిటర్‌లు వస్తే వాళ్లే ఏదో ఒకటి చెప్తారు. అప్పుడు వరకు ఆగండి.. ఈ విషయం మన మధ్యే ఉండాలి. రేవతికి కానీ, బయట ఉన్న మా అన్నయ్యకి కానీ తెలీకుండా ఉండాలి.


చలపతి: సీతకు ఫోన్ చేసి.. రామ్‌కి తెలీకుండా మహా మా అందర్ని ఆఫీస్‌కు తీసుకొచ్చింది. నన్ను బయటే ఉంచి మిగతా అందరితో ఏదో మాట్లాడుతుంది. నేను వినడానికి చాలా ప్రయత్నించాను కానీ కుదరలేదు. మహా వాళ్లు మళ్లీ ఏదో స్కెచ్‌ వేస్తుంది. అది నీకోసమే అని అర్థమవుతుంది. ఆఫీస్‌కు ఆడిటర్‌ని, లాయర్‌ని పిలిపిస్తుంది. వాళ్లు ఇంకా రాలేదు. వాళ్లు రాగానే లోపలికి తీసుకురమ్మని నాతో చెప్పింది.
సీత: ఏదో ఒకలా వాళ్లు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకో బాబాయ్. వాళ్ల ప్లాన్ ఏంటో నాకు తెలియాలి. 


లాయర్, ఆడిటర్‌ వస్తే చలపతి వాళ్లని లోపలికి తీసుకెళ్తారు. ఇంతలో వేరే పని చెప్పి చలపతిని అక్కడి నుంచి పంపేస్తారు. లాయర్, ఆడిటర్‌కి విషయం చెప్తుంది. ఇక లాయర్ రామ్ సంతకం పెట్టాలి అని అంటారు. మహాలక్ష్మి రామ్‌తో నేను చెప్తాను అని పని పూర్తి చేయమని చెప్తుంది. 


మహాలక్ష్మి: సీతకు రామ్ చేత విడాకులు ఇప్పిస్తాను. దాని చేతుల్లో విడాకులు పెట్టి కట్టుబట్టలతో దాన్ని బయటకు పంపి నాకు ఇష్టమైన మధుమితను నా కోడలిగా రప్పించుకుంటాను. అప్పటి వరకు రామ్, సీత అటు సూర్య, మధుమితలు శారీరకంగా కలవకుండా చేస్తాను. ఇదే నా అల్టిమేట్ ప్లాన్.
సీత: మహాలక్ష్మి ప్లాన్ ఏదైనా దాన్ని తిప్పి కొడతాడు. మామ భార్యగా ఈ ఇంటికి కోడలిగా ఇక్కడే ఉంటాను. ఈ సీత అంటే ఏంటో చూపిస్తాను. 
రామ్: సీత.. ఏం చేస్తున్నావ్.. 
సీత: నీ కోసం స్పెషల్‌గా  వంట చేస్తున్నా మామ. 
రామ్: సరే నేను కూడా వంటలో నీకు హెల్ప్ చేస్తా అంటాడు. కూరగాయలు కోస్తాడు. తర్వాత రామ్ మీద పిండి పడుతుంది. అది చూసి సీత నవ్వు తుంది. దీంతో రామ్ సీత మీద పిండి వేసేస్తాడు. మరోవైపు మహా వాళ్లు ఇంటికి వస్తుంటారు. రామ్‌తో ఎలా సంతకం చేయించుకుంటావని అందరూ అడుతారు. ఇక ఈ విషయం సీతకు తెలిస్తే ఎలా అని గిరిధర్ అడుగుతాడు. సీతను తక్కువ అంచనా వేయొద్దని అర్చన చెప్తుంది దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: 'నాగ పంచమి' సీరియల్ జనవరి 31st: మేఘనని పెళ్లి చేసుకుంటానని పంచమితో చెప్పిన మోక్ష, కరాళికి క్లారిటీ ఇచ్చిన మహాంకాళి!