Seethe Ramudi Katnam Serial Today Episode రౌడీలు తప్పించుకొని పారిపోతారు. రామ్ డ్రమ్‌లో ఉన్న సీత చీర కొంగు చూసి సీత డ్రమ్‌లో ఉందని గుర్తిస్తాడు. డ్రమ్ కింద పడిపోకుండా చివరి నిమిషంలో పట్టుకుంటాడు. ఇక విద్యాదేవి టీచర్ చేతిలో హారతి వెలిగించుకొని అమ్మవారికి చూపిస్తుంది. చలపతి, రామ్ ఇద్దరూ సీతని డ్రమ్ నుంచి బయటకు తీస్తారు. మహాలక్ష్మీ చాలా టెన్షన్ పడుతుంది. రామ్ సీతని ఎంత పిలిచినా ఉలకదు పలకదు. రామ్ చాలా ఏడుస్తాడు. 


చలపతి రామ్‌తో సీత ఇక మనకు లేదు రామ్ అని ఏడుస్తాడు. రామ్ సీత సీత అని పిలిచి చాలా గట్టిగా ఏడుస్తాడు. సీత లేకపోతే నేను బతకలేను.. నా మాటలు నీకు వినిపిస్తున్నాయి అని నాకు తెలుసు సీత.. నువ్వు లేకుండా నేను బతకలేను సీత.. నా కోసం రా సీత.. నువ్వు నన్ను వదిలి వెళ్లవని తెలుసు సీత లే సీత అని ఏడుస్తాడు. అయ్యో రామ్ అని చలపతి ఏడుస్తాడు. రామ్ సీతకి సీఆర్‌పీ చేస్తాడు. దాంతో సీత లేస్తుంది.  కానీ చాలా నీరసంగా ఉంటుంది. చెమటలు పట్టేస్తుంది. సీత వీక్‌గా ఉంది వెంటనే హాస్పిటల్‌కి తీసుకెళ్లాలని చలపతి అంటే రామ్ సీతని ఎత్తుకొని కారు వరకు తీసుకొస్తాడు. ఇద్దరూ సీతని హాస్పిటల్‌కి తీసుకెళ్తారు. ఇంట్లో అందరూ చాలా టెన్షన్ పడతారు.


సీత చనిపోయింటుంది కదా అని అర్చన అంటే కచ్చితంగా చనిపోయింటుందని మహాలక్ష్మీ అంటుంది. ఇక జనార్థన్ రామ్‌కి కాల్ చేస్తాడు. సీత దొరికిందని డేంజర్ ఏం లేదని చెప్పడంతో అందరూ కంగ్రాట్స్ చెప్పుకొని సంతోషపడితే మహాలక్ష్మీ, అర్చనలు ముఖం మాడ్చుకుంటారు. పోలీసులు చాలా కష్టపడి లొకేషన్ పట్టుకున్నందుకు రేవతి అందరికీ స్వీట్స్ పంచుతుంది. ఇక ఆ ఏరియా పోలీసులు త్రిలోక్‌కి కాల్ చేసి రౌడీలు తప్పించుకున్నారని చెప్తారు. దాంతో త్రిలోక్ స్పాట్‌కి వెళ్లి సాక్ష్యాలు ఏమైనా ఉంటాయేమో గుర్తించమని అంటాడు. వాళ్ల వెనక ఎవరు ఉన్నారో కనిపెట్టాలని రేవతి పోలీసులతో అనుకుంటుంది.


అర్చన: ఏంటి మహా ఇలా జరిగింది. ఆ సీత కచ్చితంగా చనిపోతుంది అనుకుంటే బతికిపోయింది.
మహాలక్ష్మీ: అదే నాకు అర్థం కావడం లేదు. 
అర్చన: కాసేపట్లో రామ్ సీతని తీసుకొని వస్తాడు. సీతకి మన మీద అనుమానం  వచ్చింది అంట మన పని ఇక అంతే.
మహాలక్ష్మీ: దానికి మన మీద ఎలా అనుమానం వస్తుంది. సాక్ష్యాలు ఉండాలి కదా. 
అర్చన: ప్రీతి, ఉషలు ఎందుకు వదిలేశారు అని సీత నిలదీస్తే మొత్తం బయటకు వచ్చేస్తుంది.
మహాలక్ష్మీ: అది ఏం చేసినా నేను అడ్డుకుంటాను. 
త్రిలోక్: మేడం మీతో రెండు మాటలు మాట్లాడాలి అని వచ్చాను కానీ మీరు ఏదో టెన్షన్‌లో ఉన్నారని అర్థమైంది. మీ కోడల్ని కాపాడినందుకు మాకు నజరానా లేదా. నేను నిజంగా డ్యూటీ చేయలేదు అని మీకు తెలుసు మేడం అలా చేసి ఉంటే మిమల్ని ఈపాటికి అరెస్టే చేసేవాళ్లు. కిడ్నాపర్లు ఇప్పుడు తప్పించుకున్నా దొరికిన తర్వాత మీ గుట్టు రట్టు అవుతుంది. ఇప్పుడు మీరు తప్పించుకున్నా అప్పుడు నేను ఏం చేయలేను.
మహాలక్ష్మీ: మేం ఏం చేయలేదు సీఐ గారు.


సాంబ విద్యాదేవికి కాల్ చేసి సీత దొరికిందని చెప్తాడు. టీచర్ చాలా సంతోషిస్తుంది. టీచర్ దేవుడికి దండం పెట్టుకొని పంతులుకి విషయం చెప్తుంది. తర్వాత లలితకు కాల్ చేసి విషయం చెప్తుంది. లలిత చాలా సంతోషిస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: కార్తీకదీపం 2 సీరియల్: పాపకి 50.. కార్తీక్‌కి 50.. దీపతో జ్యోత్స్న బేరం.. కూతిరి కోసం జ్యో కండీషన్‌కి దీప ఒప్పుకుంటుందా!