Seethe Ramudi Katnam Serial Today Episode సీత విద్యాదేవిని మహాలక్ష్మీ సీట్‌లో కూర్చొపెడుతుంది. సీత విద్యాదేవితో ఈ రోజు మిమల్ని ఛైర్మన్ స్థానంలో కూర్చొపెట్టా తర్వాత మామయ్య పక్కన కూర్చొపెడతా అంటుంది. ఇక సీత వెళ్తూ మనసులో మహాలక్ష్మీ అత్తయ్య ఏదో ఒక రోజు మీరు ఊడిపడతారని నాకు తెలుసు కానీ ఆ రోజుకి నేను చేయాల్సింది చేస్తా అనుకుంటుంది. సాయంత్రం ఇంటికి వచ్చే సరికి జనార్థన్ బాధగా కూర్చొని ఉంటాడు.
గిరిధర్, అర్చనలు సరదాగా కలిసి తింటుంటే జనార్థన్ చాలా బాధపడతారు. సీత వాళ్లతో మామయ్య తినకుండా మీరు ఎలా తింటున్నారు మీకు మనసు ఉందా అని తిడుతుంది. రామ్ కూడా అలా ప్రవర్తిస్తారేంటి అని తిడతాడు. అర్చన వాళ్లు కడుపు మాడితే ఆయనే తింటాడు అని అంటారు. ఇద్దరూ అందరితో గొడవ పడతారు.
రామ్: పిన్ని ఉన్నంత కాలం నాన్న పిన్ని వెనక తోకాడిస్తూ తిరిగి ఇప్పుడు ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు. మీకు కృతజ్ఞత అనేదే లేదు. పిన్నితో పాటు ఆయన్ను కూడా చంపేయాలి అనుకుంటున్నారు.
విద్యాదేవి: ఏవండీ పాలు తాగండి. తాగమని చెప్తున్నానా. తాగుతారా లేదా. మీరు తాగకపోతే నేను తాగిస్తాను అని సీరియస్ అయి జనాతో పాలుతాగించేస్తుంది.
చలపతి: విద్యాదేవి గారి పుణ్యమా అని పాలు అయినా తాగారు కనీసం మీరు ఆ పని కూడా చేయలేదు.
సీత: ఇలాంటి స్వార్థ పరులు అంతే బాబాయ్ మనుషుల్ని అర్థం చేసుకోలేరు మనం టీచర్‌ని చాలా తిట్టాం అన్నీ అన్నాం అయినా ఆవిడ మనకోసం చాలా చేస్తున్నారు. ఈ ఇంటి గురించి ఆవిడ కంటే ఎవరూ బాగా ఆలోచించరు. అందుకే మామ ఆఫీస్‌తో పాటు జనార్థన్ మామయ్యని తిరిగి మామూలు మనిషిని చేసే బాధ్యత కూడా ఆవిడకే అప్పగిస్తే మంచిది అని నా ఫీలింగ్.
చలపతి: మంచి నిర్ణయం సీత.
గిరిధర్: చూశావా ఇంతకు ముందు ఆఫీస్ ఇప్పుడు ఇంటి పెత్తనం. అంతా విద్యాదేవి చేతిలో పెట్టాలి అని సీత ప్లాన్ చేస్తుంది.
అర్చన: మొదటి నుంచి సీత ప్లానే అది కదా మహాలక్ష్మీ చావడం సీతకి కలిసొచ్చింది.
చలపతి: మనం మంచి పని చేయం ఇంకొరికి చేయనివ్వం. కామ్‌గా తినండి సీత మీద ఫోకస్ పెడితే కట్టు బట్టలతో వెళ్లిపోతారు.
రామ్: నాన్న త్వరగా కోలుకోవాలి అంతే చాలు నాకు.
సీత: ఇక నుంచి విద్యాదేవి టీచర్ మమల్ని చూస్తుంది మామయ్య
చలపతి: కంపెనీని కాపాడుతున్నారు మా బావని కాపాడండి టీచర్ ఈ కుటుంబం మీకు రుణపడి ఉంటుంది.
సీత: మీ ఆయన్ను బాగు చేసుకునే బాధ్యత మీదే అత్తయ్య పతి సేవ మొదలు పెట్టండి.
విద్యాదేవి: అలాగే కోడలు పిల్ల.
విద్యాదేవి జనార్థన్‌కి ధైర్యం చెప్తుంది. మహా లేకపోయినా మీ బాధ్యత నాది అని చెప్పి చేయి ఇస్తుంది. జనార్థన్ చేతిని విద్యాదేవి చేతిలో పెట్టగానే తీసుకెళ్లి అన్నం వడ్డిస్తుంది. తర్వాత తన కొంగుతో తుడుస్తుంది. గదిలోకి తీసుకెళ్లి మందులు వేయిస్తుంది. పడుకోపెట్టి దుప్పటి కప్పుతుంది. సీత చూసి మురిసి పోతుంది. సుమతి అత్తమ్మ మామయ్యకి ఇంకా దగ్గర అవ్వాలని అనుకుంటుంది. ఇక జనార్థన్ పడుకొని మహాలక్ష్మీ గుర్తొచ్చి మహా అని అరుస్తాడు. సుమతి వచ్చి పడుకోమని చెప్తుంది. ఉదయం బాధ పడుతున్న జనాకి కాఫీ తీసుకెళ్లి ఇస్తుంది. జనార్థన్ కాఫీ తాగకుండా మహాలక్ష్మీని తలచుకొని ఏడుస్తాడు. ఇక టీచర్ జనాని తీసుకెళ్లి ఆయన సీట్లో కూర్చొపెట్టి ల్యాప్‌టాప్లో పని చెప్తుంది. తర్వాత టీవీలో కామెడీ సీన్స్ వేసి నవ్విస్తుంది. అందరూ జనార్థన్ నవ్వడం చూసి సంతోషపడతారు. అర్చన వాళ్లు మాత్రం కోపంతో వెళ్లిపోతారు.
ఇక తర్వాత జనార్థన్, విద్యాదేవిలు కలిసి ఆఫీస్‌కి వస్తారు. అందరూ జనాని పలకరిస్తారు. ఇక ఆఫీస్‌కి ఇక తాను రాను విద్యాదేవి అంటే జనార్థన్ మహాలక్ష్మీ స్థానం ఈ విద్యాదేవిదే అని ఆఫీస్‌కి ఆవిడ వస్తుందని అంటాడు. ఇక గిరిధర్, అర్చనలు ఇంట్లో పేకాట ఆడుకుంటూ ఉంటారు. చలపతి దగ్గరకు వెళ్లి పనీ పాట లేకుండా నేను ఉన్నాను అనుకున్నా మీరు ఇప్పుడు తోడయ్యారు అంటాడు. ఇక అర్చనకు ఇంటి పెత్తనం తీసుకొవచ్చు కదా అంటాడు. సీత ఉండగా ఏం చేయనివ్వదు అని అంటుంది అర్చన. మహా ఉండి ఉంటే మా పరిస్థితి వేరేలా ఉండేదని గిరి అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: రాజు, రోహిణిలకు పెళ్లైందని కుప్పకూలిపోయిన రూప.. మళ్లీ గొడవ అవుతుందా!