Seethe Ramudi Katnam Serial Today Episode మహాలక్ష్మీ, అర్చనలు బయటకు వెళ్లిపోతారు. అర్చన తన ఫోన్‌కి నాగు కాల్ చేస్తే తన పని అయిపోతుందని చాలా టెన్షన్ పడుతుంది. ఏం కాదు అని మనం దొరికే లోపు సీతని నాగు చంపేస్తాడని దాని శవమే దొరుకుతుందని మహాలక్ష్మీ అంటుంది. ఆ మాటలు త్రిలోక్ వినేస్తాడు. సీరియస్‌గా త్రిలోక్ వచ్చి మహాలక్ష్మీకి వాటర్ బాటిల్ అందిస్తాడు. అర్చన షాక్ అయిపోయి నీరు తాగేస్తుంది. మహాలక్ష్మీ కూడా తాగేస్తుంది.
త్రిలోక్: సీత కిడ్నాప్ విషయంలో మీ ఇద్దరికీ సంబంధం ఉంది కదా.
మహాలక్ష్మీ: మేం ఎందుకు అలా చేస్తాం సీఐ గారు.
త్రిలోక్: మరెందుకు అంత టెన్షన్ పడుతున్నారు.
మహాలక్ష్మీ: మేం ఏం చేసినా మీకు చెప్తాం కదా.
త్రిలోక్: మీ మంచి కోరి చెప్తున్నా మీకు ఈ కిడ్నాప్‌కి ఏం సంబంధం లేకపోతే సరే సరి లేదంటే మీరు పెద్ద రిస్క్‌లో పడినట్లే ఈ కేసులో ఏసీపీ గారు ఇన్వాల్వ్ అయిపోయారు.
అర్చన: మహా నాకు చాలా భయంగా ఉంది మన పని అయిపోయినట్లే.
మహాలక్ష్మీ: అర్చన నువ్వు భయపడి నన్ను భయపెట్టకు ఇప్పుడేం చేయలేం ప్లాన్ మధ్యలో ఉన్నాం.
రౌడీలు సీతని చంపేద్దామని అనుకుంటారు. ఇంతలో నాగుకి పోలీస్ ఫోన్ చేసి పెద్దింటి కోడలు సీత కిడ్నాప్ అయిందని కేసు డీఐజీ గారి వరకు వెళ్లిందని అందరూ పోలీసులు వాళ్ల ఇంటి దగ్గరే ఉన్నారని కిడ్నాప్ చేసిన వాడిని చంపేస్తారని అంటాడు. నాగు తమకు ఏం తెలీదని చెప్తాడు. పోలీసులు తెగ ప్రయత్నిస్తారు. ఒక్క క్లూ కూడా దొరకలేదని అనుకుంటారు. ఇంతలో రామ్ ఇంటికి వస్తాడు. ఇంటి చుట్టూ పోలీసుల్ని చూసి ఏమైందా అని షాక్ అయిపోతాడు. లోపలకి వెళ్లి ఏమైందని అడుగుతాడు. సీత కిడ్నాప్ అయిందని చెప్పగానే రామ్ షాక్ అయిపోతాడు. జనార్థన్ రామ్‌తో ప్రీతి, ఉష సీతలు గుడికి వెళ్లారని సీత కిడ్నాప్ అయిందని చెప్తాడు. చలపతి, విద్యాదేవి రామ్‌కి విషయం చెప్తారు.
రామ్: పిన్నీ మీరు ఎందుకు ఉష, ప్రీతిలతో వెళ్లలేదు సీతని ఎందుకు పంపారు. నిజం చెప్పండి పిన్ని ఇందులో మీ ప్లాన్ ఏమైనా ఉందా.
మహాలక్ష్మీ: ఏం మాట్లాడుతున్నావ్ రామ్ మేం ఎందుకు కిడ్నాప్ చేస్తాం. నన్నే అనుమానిస్తున్నావా. నేను నీ పిన్నిని రామ్.
టీచర్: నాకు మీ మీద అనుమానంగా ఉంది. నేను వద్దన్నా
సీతని పంపారు. నేను చలపతి వెళ్తామన్నా వద్దని సీతని పంపారు. తప్పంతా వీళ్లదే రామ్.
మహాలక్ష్మీ: తప్పంతా నాదే అని నా కొడుకుతో చెప్తున్నావా. అసలు ఈవిడ చేసిన తప్పేంటో తెలుసా రామ్. సీత పెట్టిన అఖండ దీపం ఆరిపోయినా ఆ విషయం ఈవిడ మీ దగ్గర దాచిపెట్టింది. ఆ రోజు దీపం ఆరిపోవడం వల్లే ఈ రోజు సీత ప్రమాదంలో పడింది. ఈ విషయం ఈవిడ ఆరోజే చెప్పి ఉంటే మనం ఏదైనా పరిహారం చేసుండే వాళ్లం. ఆ విషయం దాచిపెట్టి ఈవిడ నీకు పెద్ద ద్రోహం చేసింది రామ్.
రామ్: మా పిన్ని చెప్పింది నిజమా టీచర్. మీరు చెప్పుంటే మేం ముందే జాగ్రత్త పడేవాళ్లం కదా.
విద్యాదేవి తాను పరిహారం చేస్తున్నా అని టీచర్ అన్నా మహాలక్ష్మీ కోప్పడుతుంది. ఇలాంటివి నమ్మడం ఏంటి అని జనా అంటే సీత కూడా నమ్ముతుందని గిరి అంటాడు. మొత్తానికి ఇంట్లో అందరూ ఒకరిని ఒకరు అనుకుంటారు. రామ్ విద్యాతో మీలో ఎవరు తప్పు చేశారో తెలీదు కానీ నా సీత ప్రమాదంలో పడిందని మీరు నా ముందు ఉండొద్దు వెళ్లండి అని టీచర్‌ని పంపేస్తాడు. మహాలక్ష్మీ మరోసారి రామ్‌ని రెచ్చగొడితే రామ్ మహాలక్ష్మీ మీద అరుస్తాడు. మీరు సీతని పంపడం తప్పు వాళ్లు సీతని వదిలేయడం తప్పు అని అంటాడు. ఇక ఏసీపీ మహాలక్ష్మీతో పిల్లల్ని పిలిపించమని అంటాడు. మహాలక్ష్మీ ఉషకి కాల్ చేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: పాపని కాపాడమని చేతులు చాచి సాయం అడిగిన కాంచనను అవమానించిన తండ్రి..!