Seethe Ramudi Katnam Today Episode: మధుమిత, రామ్ కలిసి ఉన్న ఫొటో పేపర్‌లో వస్తుంది. దాన్ని చూసిన శివ ఆ పేపర్ పట్టుకొని మధుమిత ఇంటికి వచ్చి కూతుర్ని తిడతాడు. మధుమిత తానే ఏ తప్పు చేయలేదు అని అసలు ఆ ఫొటోకు తనకు సంబంధం లేదని చెప్పిన వినిపించుకోకుండా తిడతాడు. మధుమిత ఏడుస్తుంది.  


శివ: మళ్లీ నీ బుద్ధి చూపించావ్.. రామ్ భార్య అనిపించుకోవడానికే కదా ఇలా చేశావ్. ఆ ఇంటి కోడలు అవ్వాలని ఇలా చేశావా.. 
సూర్య: ఏం మాట్లాడుతున్నారు మధు నా భార్య.
శివ: మరి నువ్వు ఎక్కడ ఉన్నావ్. దీని పక్కన నువ్వే లేవెందుకు. రామ్, సీత జంటగా ఉండాల్సిన ఫొటోలో రామ్ పక్కన సీత లేదు. దీని పక్కన నువ్వు లేవు ఇది ప్లాన్ కాక మరేంటి. చేయాల్సిందంతా చేసి ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారా.
మధు: సీత మీద ఒట్టు వేసి చెప్తున్నా నాన్న ఇదంతా ఎలా జరిగిందో నాకు తెలీదు.
శివ: సీత మీద ఒట్టు వేస్తే చంపేస్తా. నీ అబద్ధాలతో దాన్ని చంపేయాలి అనుకుంటున్నావా.. మీకు ఇంతకు ముందే చెప్పా మీ వల్ల సీతకు ఏం జరిగినా చంపేస్తానని. మీ మనసులో ఏమైనా దారుణాలు, కుట్రలు, కుతంత్రాలు ఉంటే వెంటనే వాటిని ఆపేయండి. లేదంటే ఈ సారి ఇలా రాను యూనీఫాంలో వస్తాను మీ అందర్ని ఎన్‌కౌంటర్‌ చేసిపారేస్తా. ఇది నీకు తెలిసి జరిగినా తెలియక జరిగినా ఇంకోసారి ఇలా జరిగితే ఊరుకోను ఇదే నీకు లాస్ట్ వార్నింగ్.
సూర్య అన్న: ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవద్దురా పొరపాటున పేపర్‌లో ప్రింట్ చేసి ఉంటారు. 
సూర్యవదిన: పొరపాటు పేపర్ వాళ్లది కాదు సూర్య మధుది. మీ పెళ్లికి ముందే మహాలక్ష్మి వాళ్లు తన ఇంటి కోడలు మధుమిత అని పేపర్‌లో వేయించారు. రిసెప్షన్‌కి వచ్చిన అందరూ మధుమితే రామ్ భార్య అని అనుకున్నారు. పేపర్‌వాళ్లు కూడా అదే అనుకున్నారు. దానికి తోడు మన మధు కూడా కాస్త ఓవర్ చేసింది. సీతని సైడ్ చేసి రామ్‌తో క్లోజ్‌గా మూవ్ అయింది. తనే ఆ ఇంటి కోడలు అయినట్లు రామ్ భార్య అయినట్లు బిహేవ్ చేసింది. పాపం సొంత అక్కే కదా అని మహాలక్ష్మి మేడమ్ వాళ్లు కూడా సరదాగా తీసుకున్నారు. కానీ పేపర్‌ వాళ్లు సీరియస్‌గా రామ్, మధులే జంట అని ఇలా ఫొటో వేశారు. మీ అన్నయ్య చెప్పినట్లు ఈ విషయాన్ని నువ్వు అంత సీరియస్‌గా తీసుకోకు. కానీ మధు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండు. వదినగా నీ మంచి కోరి చెప్తున్నా.. నిప్పు లేనిదే పొగరాదు సూర్య. మధుకి నువ్వుంటే ఇష్టమున్న ఆ ఇంటిపై రామ్‌పై ఎక్కడో చిన్న ఆశ ఉన్నట్లు ఉంది. లేకపోతే రామ్‌తో అంత చనువుగా తిరగదు కదా. 
 
చలపతి: సీతమ్మ నువ్వు సూపర్ అమ్మా. నీ ధైర్యానికి నా సలాం.
సీత: ఏంటి బాబాయ్ నన్ను అంతలా పొగిడేస్తున్నారు. ఇప్పుడు నేను ఏం చేశానని. 
చలపతి: సునామికి ఎవరైనా ఎదురు వెళ్తారా నువ్వు వెళ్తావ్.. తుఫాన్‌ను ఎవరైనా తొక్కిపెట్టగలరా నువ్వు తొక్కేశావ్.. నీ మీదకు లేచిన మహాలక్ష్మి చేతిని అలా పట్టుకొని ఆపావు చూడు ఆ ఒక్క షాట్ చాలమ్మా. నువ్వు అమాయకురాలివే కాదు అసాధ్యురాలివి కూడా. 
సీత: తన పుట్టలో చేయి పెట్టాలి అని చూస్తే చీమే ఊరుకోదు అలాంటిది నా కాపురంలో వేలు పెడితే నేను ఊరుకుంటానా బాబాయ్. మా అత్త వెనక నుంచి వచ్చినా ముందు నుంచి వచ్చినా ఎదుర్కొడానికి నేను రెడ బాబాయ్. 
చలపతిభార్య: ఈ రిసెప్షన్ పెద్ద ప్లాన్ సీత. దానికి మీ అక్క రావడం యాదృశ్చికం కాదు. తను నీలా రెడీ అవ్వడం.. రామ్ పక్కన నిలబడటం.. ఫొటోలు దిగడం ఇదంతా మహా ఆడిన నాటకం.
సీత: తెలుసు పిన్ని. అత్తయ్య నోటు నుంచే ఆ చెండాలమైన ప్లాన్ విన్నాను. 


సూర్య: ఆల్రెడీ నా దగ్గర నిజాలు దాచిపెట్టావ్.. ఇప్పుడు నీ మొసలి కన్నీళ్లతో నన్ను ఎందుకు మోసం చేయాలి అని చూస్తున్నావ్.
మధు: మోసం ఏంటి సూర్య.. నిజాలు దాచడం ఏంటి..
సూర్య: హాస్పిటల్‌కి వెళ్తామని చెప్పి వదినతో సిటీకి వెళ్లావు. డాక్టర్ అందుబాటులో లేడు అని చెప్పి ఆ ఇంటికి వెళ్లావ్. సీతలా రెడీ అయి రామ్ పక్కన నిలబడి ఫొటోలు దిగావ్. అది మోసం కాదా..
మధు: మీ వదిన బతిమాలితే మీ అన్నయ్య చెప్తే తోడుగా సిటీకి వెళ్లాను. ఆ టైంలో అందుబాటులో లేకపోవడం నా తప్పు ఎలా అవుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో సీత వాళ్ల ఇంటికి వెళ్లానే కానీ కావాలని వెళ్తానా.. అక్కడికి వెళ్లాక మహాలక్ష్మి గారు మన రిసెప్షన్‌ కూడా జరిపిస్తాను అన్నారు. నువ్వు కూడా వస్తాను అన్నావు. అందుకే అలా రెడీ అయ్యాను. నువ్వు రాకపోవడం నా తప్పు. ఇందులో నేను ఆడిన అబద్ధాలు ఏంటి. నేను చేసిన మోసం ఏంటి.
సూర్య: నువ్వు నన్ను కన్విన్స్ చేయడానికి చూడకు. రిసెప్షన్‌కు నేను రాకపోతే నువ్వు పక్కన ఉండాలి కానీ రామ్ పక్కన ఎందుకు ఉన్నావు. అందులోనూ అంత దగ్గరగా.. 
మధు: నేను నీకు ఫోన్ చేశాను నువ్వు దగ్గరే ఉన్నాను వచ్చేస్తున్నా అన్నావు. అందుకే బలవంతంగా అక్కడ ఉన్నాను. 
సూర్య: బలవంతంగా ఉన్నావా లేక ఇష్టంతోనే ఉన్నావా. ఈరోజు పేపర్‌లో మీఇద్దరి ఫొటోలు చూసిన వాళ్లు నీ భార్యకు అతనికి ఏంటి సంబంధం అని అడుగుతారు నేను ఏమని సమాధానం చెప్పాలి. తను నీ భార్య లేక అతని భార్య అని ప్రశ్నిస్తే ఏంటి సమాధానం చెప్పాలి. నా దరిద్రం, అవిటి తనం చూసి ఇలాంటి వాడిని ఎందుకు పెళ్లి చేసుకున్నాను అన్న ఫీలింగ్ నీకు వచ్చింది కదా.. రామ్‌ని పెళ్లి చేసుకొని ఉంటే బాగున్న అనుకున్నావ్ కదా.. 
మధు: ఆపు సూర్యా చాలా అసహ్యంగా మాట్లాడుతున్నావ్. చాలా తప్పుగా మాట్లాడుతున్నావ్.. 
సూర్య: ఈ మాటలు మీ నాన్న అన్నాడు. నేను అనడం తప్పు ఉందా.. నాకు అసహ్యంగానే ఉంది. మీ ఇద్దరిని అలా చూడటం నాకు అసహ్యంగానే ఉంది. అది చాలదు అన్నట్లు మీ నాన్న వచ్చి డబ్బుకోసం ఇదంతా నేనే చేశాను అన్నాడు కదా అది ఇంకా ఇబ్బందిగా బాధగా ఉంది.
మధు: మా నాన్న అలా మాట్లాడినందుకు నేను కూడా బాధ పడుతున్నాను సూర్య.
సూర్య: నీకు ఎందుకు బాధ నువ్వు అనుకున్నదే జరిగింది కదా.. 
మధు: ఏం మాట్లాడుతున్నావ్ సూర్య నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా.. 
సూర్య: అది నిజం కాకూడదు అనుకుంటున్నాను. నీ మీద కాస్తో కూస్తో నమ్మకం ఉంది కనుక ఏం అనడం లేదు. ఇది ఒకవేళ నిజమైతే నేను ఏం చేస్తానో నాకే తెలీదు. నీకు మనసు ఇచ్చిన వాడిని ప్రాణం తీయడానికి కూడా వెనకాడను. 


సీత: హాయ్ అక్క.. అక్క ఏమైంది. ఎందుకు ఏడుస్తున్నావ్. ఎక్కడ ఉన్నావ్. 
మధు: నువ్వు ఈరోజు పేపర్ చూడలేదా.. తప్పు జరిగిపోయింది సీత చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. రిసెప్షన్‌లో నేను రామ్‌గారి పక్కపక్కన ఉన్న ఫొటో న్యూస్ పేపర్‌లో పడింది. అది చూసి నాన్న మా ఇంటికి వచ్చి పెద్ద గొడవ చేశారు. సూర్య కూడా నన్ను తిట్టాడు. అనకూడని మాటలు అన్నాడు. అందర్ని నన్ను బాధ పెడుతున్నారు. నాకు రిసెప్షన్ వద్దు నేను రెడీ అవ్వను అన్నాను నువ్వే బలవంతంగా ఒప్పించావ్. నువ్వు లేని టైంలో రామ్‌గారి పక్కన నిల్చొన్న నన్ను ఎవరో ఫొటోలు తీశారు. మేమిద్దరం జంట అనుకొని పేపర్లో అభినందనలు తెలిపారు. జరిగిన దాంట్లో నా తప్పు ఏం ఉంది సీత. నేను ఏమైనా కావాలి అనిచేశానా..
సీత: నీ తప్పు ఏం లేదు అక్క ఏడ్వకు. 
మధు: నాన్న సూర్య అన్న మాటలకు నాకు చచ్చిపోవాలి అనిపిస్తోంది సీత. 
సీత: అంత పని చేయకు అక్క. చేయని తప్పునకు నువ్వు బలి అవ్వడం ఏంటి. నిన్ను నేను నమ్ముతున్నాను అక్క నీ తప్పు ఏం లేదు. తొందర పడి ఎలాంటి అఘాయిత్యం చేసుకోకు. ఆ రోజు సూర్య బావ వచ్చి ఉంటే అసలు ఇదంతా జరిగేదే కాదు. రామ్ పక్కన నేను. సూర్య బావ పక్కన నువ్వు జంటగా ఫొటోలు దిగేవాళ్లం. అంతా నా దురదృష్టం అని మధు ఫీలవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: 'సత్యభామ' సీరియల్ జనవరి 24th: తన మనసులో మాట సత్యకు చెప్పేసిన మురళి.. క్రిష్‌కు సంపంగి నుంచి లవ్ లెటర్