Seethe Ramudi Katnam Serial Today February 3rd: 'సీతే రాముడి కట్నం' సీరియల్: మహా, అర్చన మాటలు వినేసిన సీత.. ఎంక్వైరీ మొదలు పెట్టిన శివకృష్ణ.. మహా ఇంట్లోనే ఇకపై!

Seethe Ramudi Katnam Today Episode మహాలక్ష్మీ, అర్చనలు నాగుతో ఫోన్‌లో మాట్లాడటం సీత ఆ మాటలు విని అత్తల్ని ప్రశ్నించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Continues below advertisement

Seethe Ramudi Katnam Serial Today Episode రాత్రి అందరూ నిద్ర పోయి ఉంటే అర్చన ఫోన్‌కి నాగు కాల్ చేస్తాడు. నిద్రలో ఉన్న అర్చన కాల్ కట్ చేస్తుంది. నా ఫోనే కట్ చేస్తావా అనుకొని నాగు మళ్లీ కాల్ చేస్తాడు. దాంతో అర్చన లేచి ఈ టైంలో ఎవరు అని అనుకొని మాట్లాడుతుంది. దాంతో నాగు ఇంకోసారి కాల్ కట్ చేస్తే డైరెక్ట్‌గా ఇంటికి వస్తానని అంటాడు. డబ్బు కోసం కాల్ చేశానని మహాలక్ష్మీకి ఫోన్ ఇవ్వమని అంటాడు. అర్చన మహాలక్ష్మీ గదికి వెళ్తుంది. నిద్ర పోతున్న మహాని లేపుతుంది. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే సీత వాటర్ బాటిల్ తీసుకొని కిందకి వస్తుంది.

Continues below advertisement

మహాలక్ష్మీ: ఏంటి నాగు ఫోన్ చేయడానికి వేలా పాలా లేదా టైం కాని టైంలో ఫోన్ ఏంటి?
నాగు: డబ్బులు కోసం చేశాను మీరు సీతని కిడ్నాప్ చేయమన్నారు నేను చేశాను మరి డబ్బులు ఇవ్వాలి కదా.
మహాలక్ష్మీ: సీతని కిడ్నాప్ చేసి చంపమన్నాను మీరు చేశారా మొత్తం ప్లానే వేస్ట్ చేశారు. మీరు ఎక్కడికైనా చావండి కానీ నేను చెప్పిన పని చేసుంటే డబ్బు ఇచ్చేవాళ్లం కానీ చేయలేదు కాబట్టి ఇవ్వను. మళ్లీ డబ్బు కోసం నాకు ఫోన్ చేయొద్దు.
నాగు: మేడం మాతో పెట్టుకోవద్దు.
మహాలక్ష్మీ: ఏంట్రా బెదిరిస్తున్నావా ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు ఉన్నప్పుడు ఎంతో కొంత ఇస్తాను. అప్పటి వరకు నాకు ఫోన్ చేయొద్దు.
అర్చన: మహా ఇప్పుడు వాడితో గొడవ పెట్టుకుంటే మనకే రిస్క్ కదా. సీత కిడ్నాప్ వెనక ఉంది మనమే అని ఎవరికీ తెలీదు కదా. 
సీత: ఏంటి అత్తలు.. మీ ఇద్దరూ పడుకోకుండా ఈ టైంలో ఏం మాట్లాడుకుంటున్నారు. పైగా సీత అని నా గురించి మాట్లాడుకుంటున్నారు.
 మహాలక్ష్మీ: ఏం లేదు సీత నీ విషయంలో బాధ పడుతున్నాం.
సీత: మీరు ఎప్పుడు ఇంత మంచిగా మారిపోయారు అత్తలు. చాలా ఆశ్చర్యంగా ఉంది.
మహాలక్ష్మీ: మనలో మనకి వంద ఉంటాయి కానీ నీ కోసం ఆలోచించకుండా ఉంటామా.
 అర్చన: మనం మనం ఎన్ని పడినా నిన్ను బయట వాళ్లు కిడ్నాప్ చేస్తే మాకు బాధగా ఉండదా చెప్పు.
సీత: నన్ను కిడ్నాప్ చేసింది బయటి వాళ్లో ఇంట్లో వాళ్లో తొందరిలోనే తెలుస్తుంది. ఆ కిడ్నాపర్ల ముఖాలు నాకు బాగా గుర్తున్నాయి. ఎప్పుడైనా వాళ్లు నా కంట పడితే అప్పుడు తేల్చుతా వాళ్ల సంగతి.
అర్చన: మహా నాగు వాళ్లు సీతకి కనిపిస్తే ఇక అంతే సంగతి. మనం డబ్బు ఇవ్వమని చెప్పాం కదా ఆ నాగు ఏమైనా చేస్తే
మహాలక్ష్మీ: చేసినప్పుడు చూద్దాంలే.

ఉదయం సీత పూజ చేస్తుంది. విద్యాదేవి సీత దగ్గరకు వచ్చి అఖండ దీపం ఆరిపోయిన గండం పోయిందని నీకు ఇది పునర్జన్మ అని నిన్ను రామ్ని ఇక ఎవరూ విడదీయలేరని అంటుంది. నిన్ను కిడ్నాప్ చేయించింది ఎవరో తెలుసుకోవాలని ఇద్దరూ అనుకుంటారు. ఇంతలో సీత తండ్రి ఇంటికి వస్తాడు. సీత తండ్రిని చూసి హగ్ చేసుకుంటుంది. రామ్ మామ తనని కాపాడారని చెప్తుంది. ఇక శివకృష్ణ తాను సీత కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తానని అంటాడు మహాలక్ష్మీ, అర్చనలు ఈయనో పెద్ద ఆఫీసర్ అని సెటర్లు వేసుకుంటారు. ఇక సీత తాను ఎలా కిడ్నాప్ అయిందో చెప్తుంది. అందరూ హాల్‌లోకి చేరుకుంటారు. సీతని మాత్రమే ఎందుకు పంపారు అని అడుగుతాడు. ఇలా అవుతుందని ఎవరికి తెలుసు అని మహాలక్ష్మీ అంటుంది. సీత దొరికినప్పుడు పరిస్థితి రామ్ మామతో చెప్తాడు. కిడ్నాపర్ల గురించి త్వరలోనే తెలుసుకుంటానని అప్పటి వరకు ఈ ఇంట్లోనే ఉంటానని శివకృష్ణ చెప్తాడు. మామకు రామ్ సపోర్ట్ చేస్తానని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: సత్యభామ సీరియల్: తల్లిదండ్రుల్ని దారుణంగా అవమానించిన సంధ్య.. సంజయ్, బిగ్‌డాడీల కొత్త ఆట షురూ!

Continues below advertisement