Nindu Noorella Saavasam Serial Today February 3rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్రగుప్తుడిని ట్రాప్‌ చేసిన ఆరు – రణవీర్‌కు వార్నింగ్‌ ఇచ్చిన భాగీ  

Nindu Noorella Saavasam Today Episode:  తాను భూలోకం వెళ్లడానికి చిత్రగుప్తుడిని ట్రాప్‌ చేయాలనుకుంటుంది ఆరు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.  

Continues below advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:   రణవీర్‌, మనోహరి కలిసి మాట్లాడుకుంటూ అంజును కిడ్నాప్‌ చేయాలనుకుంటారు. వాళ్లిద్దరూ సీక్రెట్‌గా మాట్లాడుకోవడం భాగీ చూస్తుంది. భాగీని చూసిన మను, రణవీర్‌ షాక్‌ అవుతారు.

Continues below advertisement

భాగీ: ఎందుకు అంత షాక్‌ అవుతున్నారు. మీ కళ్లల్లో  భయం కనిపిస్తుంది. అసలు ఏం చేస్తున్నారు. ఏం చేద్దామనుకుంటున్నారు. మీ ఇద్దరికీ ముందే పరిచయం ఉందా..? లేదా..? అన్నది నాకు అనవసరం. కానీ మీరు నా కుటుంబం జోలికి వస్తే మాత్రం నేను చూస్తూ ఊరుకోను.

మనోహరి:  ఏయ్‌ నీకేమైనా పిచ్చి పట్టిందా..? ఏదేదో మాట్లాడుతున్నావేంటి..? ఈయనేదో అడిగితే చెప్తున్నాను. దానికెందుకు ఇంత రాదాంతం చేస్తున్నావు.

భాగీ: మీరు అంజును హాస్పిటల్‌ కు తీసుకెళ్లారని తెలిస్తే ఆయన నాలా వచ్చి మాట్లాడరు. చంపేస్తారు. ఏంటలా చూస్తున్నారు. రణవీర్‌ అంజును బ్లడ్ టెస్ట్‌ కోసం హాస్పిటల్‌కు తీసుకెళ్లాడని నాకు తెలుసు. వెనక నువ్వు వెళ్లావని కూడా తెలుసు

రణవీర్‌: అయ్యో మిస్సమ్మ గారు మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు.

భాగీ: నేను తప్పుగా అర్తం చేసుకోవడం లేదు రణవీర్‌. మీరే ఈ మనోహరితో కలిసి చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. మీ ప్లానేంటో తెలియదు. ఏం చేస్తున్నారో కూడా తెలియదు. కానీ పిల్లల దగ్గరకు వెళ్లాలంటే ముందు నన్ను దాటుకుని వెళ్లాలి. అన్ని ఇక్కడితో ఆపి వెనక్కి వెళితే మంచిది. లేదంటే మీ ప్రతి పనిలో నేనే అడ్డంకిగా ఉంటాను. మీకు నా గురించి మళ్లీ స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా..?

అంటూ  భాగీ కోపంగా వార్నింగ్‌ ఇస్తూ వెళ్లిపోతుంది. యమలోకంలో ఉన్న ఎలాగైనా చిత్రగుప్తుడిని ట్రాప్‌ చేసి తనను భూలోకం తీసుకెళ్లాలనుకుంటుంది. అందుకోసం గుప్తతో కలిసి చిన్న నాటకం ఆడాలనుకుంటుంది. అందుకోసం చిత్రగుప్తుడు చూస్తుండగానే ఆరు, గుప్త కలిసి పక్కకు వెళ్తారు. వారిని ఫాలో అవుతూ వెనకాలే వెళ్తాడు చిత్రగుప్తుడు. కొద్ది దూరం వెళ్లాక తన దగ్గర నాగమణి ఉందని అది ఎవరి దగ్గర ఉంటే వాళ్లకు ఎన్నో శక్తులు వస్తాయని.. నన్ను భూలోకం తీసుకెళ్లిన వారికే ఆ మణి ఇస్తానని ఆరు గట్టిగా చెప్తుంది. చాటు నుంచి అంతా విన్న చిత్రగుప్తుడు ఆరును ఎలాగైనా భూలోకం తీసుకెళ్లి ఆ మణి తీసుకోవాలని అనుకుంటాడు. అమర్‌ చైన్‌ తీసుకుని భాగీ దగ్గరకు వస్తాడు.

అమర్‌: మిస్సమ్మ ఈ చైన్‌ అంజు వచ్చాక అంజు మెడలో వేయ్‌..

శివరాం: ఈ చైన్‌ అంజు పుట్టిన రోజు నాడు కానీ ఏదైనా స్పెషల్‌ అకేషన్‌ రోజు వేస్తావు కానీ ఈరోజు ఎందుకు వేస్తున్నావు.

అమర్‌: ఈ చైన్‌ ఇంకెప్పటికీ అంజలి మెడలో వేద్దామనుకుంటున్నాను.

నిర్మల: ఇన్ని రోజుల లేనిది ఇప్పుడెందుకు కొత్తగా వేస్తున్నావు నాన్నా

అమర్‌: ఇది అంజు మెడలోనే ఉండాలి అమ్మా అది తన హక్కు.. ఇది తనతో ఉంటేనైనా తన ప్రయాణంలో తన కన్నవాళ్లు ఉంటారని..

భాగీ: ఏంటండి మీరు విచిత్రంగా మాట్లాడుతున్నారు తన కన్నవాళ్లు అంటూ పరాయిదానిలా మాట్లాడుతున్నారు

రాథోడ్‌:  మిస్సమ్మ ఇది మేడం చేయించిన చైన్‌ అది అంజు మెడలో వేస్తే.. మేడం తనతో ఉంటుందని సార్‌ అభిప్రాయం

ఇంతలో అంజు లోపలికి రాగానే.. అమర్‌ చైన్‌ తీసి అంజు మెడలో వేస్తాడు. పై నుంచి అంజు మెడలో చైన్‌ చూసిన రణవీర్‌, మనోహరి షాక్‌ అవుతారు. పక్కు వెళ్లి ఆ చైన్‌ గురించి మాట్లాడుకుంటారు. అసలు నిజం కళ్ల ముందే పెట్టుకుని దేశం మొత్తం వెతికాను ఇక ఎలాగైనా అంజలిని తీసుకెళ్లిపోవాలని రణవీర్‌ అంటాడు. రణవీర్‌ మాటలు విన్న అంజు నన్ను ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నారు అంకుల్‌ అని అడుగుతుంది. రణవీర్‌, మనోహరి షాక్‌ అవుతారు.  మరోవైపు చిత్రగుప్తుడు.. ఆరును భూలోకం ఎలా తీసుకెళ్లాలో ఆలోచిస్తుంటాడు. విషయం తెలిసి ఆరు హ్యాపీగా ఫీలవుతుంది.  ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

Continues below advertisement