Satyabhama Serial Today Episode సంధ్య కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు వచ్చి సంధ్య మేజర్ అని తన ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకోవచ్చని తనని వదిలేయమని చెప్తారు. దాంతో విశాలాక్షి పోలీస్‌తో సంధ్య నా కూతురు దాని జీవితం నాశనం అవ్వడానికి నేను ఒప్పుకోను వదలను అంటుంది. దాంతో సంధ్య చట్ట ప్రకారం ఏం చేయాలో అది చేయండి అంటే పోలీసులు అరెస్ట్ చేస్తామని విశాలాక్షి వాళ్లతో చెప్తారు. తల్లిదండ్రులను అరెస్ట్ చేయమని సంధ్య చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. విశాలాక్షి కూతురి చేయి వదిలేయడంతో క్రిష్‌ పోలీసుల్ని పంపేస్తాడు.


నందిని: నువ్వు అసలు కూతురివేనా. కడుపులో పెట్టుకొని పెంచిన అమ్మ మీద కేసు పెడతావా. ఇలాంటి దాన్నా చిన్నన్న నువ్వు సపోర్ట్ చేసింది.
సంధ్య: గొడవ ఇక్కడి వరకు తీసుకొచ్చింది ఎవరు మీ వదిన.
సత్య: లాగి ఒక్కటిచ్చి.. పిలవ్వే మళ్లీ పోలీసుల్ని పిలు నీకు అసలు అమ్మానాన్నల విలువ తెలుసా.  
విశాలాక్షి: ఇప్పుడు తెలీదమ్మా మేం చనిపోయిన తర్వాత తెలుస్తుంది. నా కన్న కూతురు నా పేగు తెంచుకొని పుట్టిన నా కూతురు నన్ను అరెస్ట్ చేయించడానికి పోలీసుల్ని పిలిచించిందండి. చిన్నప్పటి నుంచి కంటికి రెప్పలా కాపాడుకున్న మన నుంచి తనని కాపాడమని పోలీసుల్ని పిలిచిందండీ.
విశ్వనాథం: మనకి పిల్లల్ని పెంచడం రాదనుకుంటా విశాలాక్షి. సారీ అమ్మ నీ పెద్దరికాన్ని గుర్తించ లేకపోయాను నీ జీవితానికి సంబంధించిన నిర్ణయాలు నువ్వే తీసుకునే అంత ఎదిగిపోయావని తెలుసుకోలేకపోయానమ్మా. మా కళ్లు తెరిపించావ్ థ్యాంక్యూ కన్నా.
సంధ్య: నన్ను సరిగా అర్థం చేసుకోండి నాన్న. 
విశాలాక్షి: తల్లి ప్రేమని చూసి పిల్లలు ప్రేమ అంటే ఎలా ఉంటుందో నేర్చుకుంటారు. నిన్న కాక మొన్న పరిచయం అయిన అతని ప్రేమ ముందు తల్లి ప్రేమ ఓడిపోయింది. నాకు బతకు మీద ఆశ చచ్చిపోయిందండీ.
విశ్వనాథం: అయినా బతకాల్సిందే విశాలాక్షి. మన పిల్లలే మన మాట విననప్పుడు ఆ దేవుడు ఎందుకు వింటాడు.
సత్య: అమ్మా ఏడ్వకు ఏదో ఒక రోజు సంధ్య తన తప్పు తెలుసుకుంటుంది. రియలైజ్ అవుతుంది. 
నందిని: నువ్వేం పోగొట్టుకుంటున్నావో నీకే ఇప్పుడు తెలీదు సంధ్య.
సంధ్య: ప్రేమించిన వాడిని భర్తగా సంపాదించుకున్నా అది చాలు నాకు.
విశ్వనాథం: మహదేవయ్యతో దానికి ఈ అమ్మానాన్నల కన్నీటితో సంబంధం లేదు. కానీ ఈ కన్నీటి వెనక ఉంది దాని మీద ప్రేమే. దానికి ఏమవుతుందని భయమే. నా చిన్న కూతురు మేజర్ దాని బతుకు అది మ్యానేజ్ చేసుకోలేనంత మేజర్. ఈ గూటిలో వదిలేసి వెళ్తున్నా మీ దయ. అమ్మా అమ్మా అని సత్య చాలా ఏడుస్తుంది. 


మహదేవయ్య: తర్వాత సంజయ్‌ని పక్కకు తీసుకెళ్లి లాగిపెట్టి ఒక్కటిస్తాడు. నా ప్లాన్ అంతా నాశనం చేసేశావ్. ఎందుకురా నీకు అంత తొందర. అదేమైనా మిస్ ఇండియానా. లేక దాని వెనక కోట్ల ఆస్తి ఉందా. మీ ప్రేమని అడ్డుపెట్టుకొని సత్యని ఎలక్షన్లో తప్పిద్దామనుకున్నా. నువ్వేమో తాళి కట్టి తీసుకొచ్చావ్.
సంజయ్: సంధ్య సూసైడ్ చేసుకుంటానని బెదిరించింది బిగ్ డాడ్.
మహదేవయ్య: చేసుకోమనాల్సింది దానికే భయపడ్డావా ఏం బతుకురా నీది.
సంజయ్: సూసైడ్ లెటర్‌లో నా పేరు వాళ్ల అక్క పేరుతో పాటు నీ పేరు రాస్తానంది. నాకేదో అవుతుందని నేను భయపడలేదు కానీ మిమల్ని ఇరికిస్తుందని ఆలోచించా.
మహదేవయ్య: ఆడవాళ్లకి చేతనైంది మగాళ్ల వీక్ పాయింట్‌తో ఆడుకోవడమేరా దానికే భయపడతావా. ఆ అడుక్కున్న దాన్ని తీసుకొచ్చి నా కోడల్ని చేస్తావా.
సంజయ్: అదేంటి బిగ్ డాడ్ సంధ్య నీ సొంత కొడుకు భార్య చెల్లినే కదా. సొంత కొడుకుకి ఆ ఇంటి అమ్మాయిని ఇచ్చి నా కోసం ఎందుకు అడ్డుకుంటున్నావ్.
మహదేవయ్య: నువ్వు నా కొడుకువి అని చెప్పబోయి ఆగి నువ్వు నాకు స్పెషల్‌రా. నాకు చాలా ఇష్టంరా. ఆ క్రిష్ గాడితో నీకు పోలికేంటి. ఆ సంధ్యని అడ్డు పెట్టుకొని సత్య ఎలక్షన్‌లో పోటీ చేయకుండా చేసి తర్వాత దాన్ని తప్పించి నీకు ఓ మంచి మినిస్టర్ సంబంధం చేయాలి అనుకున్నారా నువ్వేమో ఇలా రోడ్ సైడ్‌ దాన్ని చేసుకున్నావ్. 
సంజయ్: ఇప్పుడు మించిపోయింది ఏంటి బిగ్ డాడ్ మీరు ఎమ్మెల్యే కాగానే అది మాజీ భార్య అవుతుంది. నా లెక్కలు నాకు ఉన్నాయ్ బిగ్ డాడ్. నా వల్ల ఏ హెల్ప్ కావాలి అన్నా చెప్పండి బిగ్ డాడ్ వెనక్కి తగ్గేదే లేదు.
 మహదేవయ్య: నువ్వు సత్య జోలికి పోకు తన సంగతి నేను చూసుకుంటా.


సత్య చెల్లి చేసిన గొడవ తలచుకొని బాధ పడుతూ ఉంటుంది. క్రిష్ సత్య దగ్గరకు వెళ్లి కూర్చొంటే సత్య లేచి వెళ్లిపోతుంది. క్రిష్ ఆపుతాడు. ఎవరినీ నమ్మకూడదు అని సత్య అంటుంది. పెళ్లి మీ సమక్షంలో జరగలేదని బాధ తప్ప ఇకేం లేదు అంటే సంధ్య జీవితాంతం పెళ్లి లేకపోయినా పర్లేదని అంటుంది. నువ్వే దగ్గరుండి పెళ్లి చేశావ్ అని క్రిష్ మీద నిందలు వేస్తుంది. అనవసరంగా అపార్థం చేసుకుంటున్నావని నాకు కూడా కుటుంబం విలువ తెలుసు అని క్రిష్ అంటాడు. సంధ్య చనిపోతానని బెదిరించిందని అందుకే చూస్తూ ఉండిపోయానని అంటాడు. సంజయ్ మీద నీకు అనుమానం వల్లే ఇలా అన్నీ అవుతున్నాయని అంటాడు. సంజయ్ కూడా నచ్చచెప్పినా సంధ్య వినలేదని అంటాడు. సంజయ్, సంధ్యల విషయంలో నేను ఏ తప్పు చేయలేదని క్రిష్ గట్టిగా చెప్పి వెళ్లిపోతాడు.


మరోవైపు పంకజం భైరవితో రాను రాను ఈ ఇంట్లో మీ పెత్తనం, విలువ తగ్గిపోతున్నాయని ఎక్కిస్తుంది. ఒకరితో వేగలేకపోతున్నారు ఇప్పుడు ఇద్దరు ఏకం అయితే మీ సంగతి అంతే అని అంటుంది. దాంతో భైరవి వాళ్లిద్దరూ ఒక్కటి అవ్వరని కొట్టుకు చావడానికి రెడీగా ఉన్నారని ఇప్పుడు సంధ్యని తన వైపు తిప్పుకొని ఓ ఆటాడిస్తానని అంటుంది. సంధ్య మేడ మీద ఉంటే సత్య కింద మొక్కలకు నీరు పోస్తుంది. సంధ్య కోపంగా సత్యని చూస్తుంది. సత్య కూడా సంధ్యని చూస్తుంది. ఇంతలో సంజయ్ వచ్చి సంధ్యతో మాట్లాడుతాడు. పుట్టింట్లో ఒకరు అంటే ఒకరికి ప్రాణంగా ఉన్న అక్కాచెల్లెళ్లు అత్తారింట్లో ఒకరంటే ఒకరికి పడటం లేదని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 



Also Read: సత్యభామ సీరియల్: సంధ్యని లాక్కెళ్లిన తల్లి.. నా జీవితం నా ఇష్టం అంటూ ఫైర్.. పోలీసులకు కంప్లైంట్!