Seethe Ramudi Katnam Today Episode మధుమిత తన కన్నవారి ఇంటికి వస్తుంది. అనుమానంతో మధుమిత బయటే నిల్చొని ఉంటే తన తల్లి లలిత వెళ్లి తీసుకొని వస్తుంది. మధుతో తన పన్ని నానమ్మ ప్రేమగా మాట్లాడుతారు. తన జీవితంలో ఇలాంటి రోజు వస్తుంది అని ఊహించలేదు అని మధు అంటుంది. అమ్మా నాన్నలు పిలవగానే వచ్చేశాను అని అంటుంది.
లలిత: ఒక్కదానివే వచ్చావ్ అల్లుడు గారు రాలేదు ఏంటి..
మధు: సూర్య ఈ మధ్యనే కదా అమ్మ జాబ్‌లో జాయిన్ అయ్యాడు వెంటనే లీవ్ దొరకడం కష్టం. మీరు మా ఇంటికి రావడంతో సూర్య చాలా హ్యాపీగా ఫీలయ్యాడు నాన్న. నిన్ను అమ్మని ఎంతో మెచ్చుకున్నాడు. మీకు దూరం అయినందుకు చాలా ఏడ్చాను. మళ్లీ ఇప్పుడు ఇలా కలవడంతో చాలా సంతోషంగా ఉంది. ఇంకెప్పుడూ ఈ ఇంటికి దూరం అవ్వను.
మధుపిన్ని: మేం కూడా నిన్ను మిస్ చేసుకొని చాలా ఫీలయ్యాం. ఇప్పుడు మేం కూడా హ్యాపీ..
లలిత: ఏంటండి మధుతో మేం మాత్రమే మాట్లాడుతున్నాం మీరు మాట్లాడరా..
శివకృష్ణ: భోజనం చేసి వెళ్లమ్మా.. నేను స్టేషన్‌కి వెళ్లొస్తా.
లలిత: అదేంటండి రాకరాక మధు ఇంటికి వస్తే మీరు డ్యూటీకి వెళ్తా అంటున్నారు.
మధుపిన్ని: ఇది మాత్రం నీకు పునర్జన్మ. ఇప్పటి వరకు మీ నాన్న కోపాన్నే చూశావ్. ఇప్పుడు ప్రేమని చూస్తావ్.
జనార్థన్: రామ్‌ని సీత ఎక్కడికి తీసుకెళ్లింది. మనతో చెప్పకుండా తీసుకెళ్లిపోయింది.
అర్చన: ఇది వరకు తను ఒక్కర్తే వెళ్లేది. ఇప్పుడు రామ్‌ని కూడా తీసుకెళ్లిపోయింది.
రేవతి: ఆస్తిని మాత్రం రాయించుకోవడానికి కాదులే.. సీత ఏం చేసినా చెప్పే చేస్తుంది. ఇంతలో సీత రామ్ ఇంటికి వస్తారు.
మహాలక్ష్మి: ఎక్కడికి వెళ్లి వస్తున్నావ్ రామ్.. ఆ నాలుగు లెక్కలకు సీత లెక్క చెప్పిందా.. ఆ డబ్బుని సీత ఏం చేసింది.
అర్చన: ఇంకేం ఉంటుంది మహా ఆ నాలుగు లక్షలతో దుబారా చేసేసుంటుంది. ఇప్పుడు ఎవరూ చూడకుండా రామ్ కాళ్లు పట్టుకోవడానికి తీసుకెళ్లుంటుంది.
రామ్: లేదు పిన్ని సీత ఆ డబ్బుని వేస్ట్ చేయలేదు. ఆ డబ్బుతో సీత మంచి పనే చేసింది.
మహాలక్ష్మి: ఏంటి రామ్ తను చేసిన మంచి పని.
రామ్: అమ్మ కోసం ఖర్చు చేసింది.
మహాలక్ష్మి: అమ్మ కోసం ఆ డబ్బు ఖర్చు పెట్టడం ఏంటి.
రామ్: సారీ పెద్దమ్మ సీత ఖర్చు పెట్టిన డబ్బు వాళ్ల అమ్మ కోసం కాదు మా అమ్మ కోసం. ఈ రోజు అమ్మ పుట్టిన రోజు అని మన అందరికీ గుర్తు లేదు. కానీ గుర్తు పెట్టుకుంది.
సీత రామ్‌ని తీసుకొని అనాథాశ్రమాని తీసుకెళ్తుంది. అక్కడ తన అత్త పుట్టిన రోజు అని రామ్‌కి సర్‌ఫ్రైజ్ ఇస్తుంది. దీంతో రామ్ సీతని హగ్ చేసుకుంటాడు. ఆ విషయాలు చెప్పడంతో మహాలక్ష్మి షాక్ అయిపోతుంది.
రామ్: సీత చేసిన గొప్ప పనికి మనందరం తనని పొగిడి తీరాలి. నిన్ను ఎంత పొగిడినా తక్కువే నిజంగా సీతే రాముడి కట్నం. నిజంగా నువ్వే నా అదృష్టం. అందర్ని సీతని మెచ్చుకోమని చెప్తాడు రామ్ దీంతో అందరూ షాక్ అవుతారు. తప్పక అర్చన, గిరిధర్, ఉష, ప్రీతి వాళ్లు సీతకి థ్యాంక్స్ చెప్తారు. మహాలక్ష్మిని కూడా థ్యాంక్స్ చెప్పమని రేవతి అంటుంది.
రామ్: ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను పిన్ని అనాథాశ్రమంలో మీ పేరు చెప్పి డొనేషన్ చేసింది. ఆ నాలుగు లక్షలు అమ్మ పేరుతో మీరు డొనేషన్ చేసినట్లు చెప్పింది. అక్కడ అందరూ అమ్మతో పాటు నిన్ను కూడా పొగిడారు పిన్ని. సీతకి థ్యాంక్స్ చెప్పు పిన్ని.
రేవతి: సీత గ్రేట్ అని చెప్పు వదినా..
మహాలక్ష్మి: గుడ్ సీత.. చాలా మంచి పని చేశావ్. కీప్ ఇట్ అప్.
ఇక సీత సుమతి ఫొటో దగ్గరకు మహాలక్ష్మిని తీసుకెళ్లి దీపం పెట్టి దండం పెట్టేలా చేస్తుంది. మహాతో పాటు అందరూ సుమతి ఫొటోకు దండం పెడతారు. తర్వాత కేక్ కట్ చేయాలి అని సీత అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.