Brahmamudi Serial Today Episode: నేను తలుచుకుంటే ఇప్పటికైనా కళ్యాణ్‌ను పెళ్లి చేసుకోగలను అంటూ అప్పు గట్టిగా అనామికకు వార్నింగ్ ఇస్తుంది. దీంతో అనామిక షాక్ అవుతుంది. కారులో కూర్చున్న కళ్యాణ్, అనామికను పిలుస్తాడు అనామిక వెళ్లడంతో ఇద్దరూ కారులో వెళ్లిపోతారు. అప్పు కూడా వెళ్లిపోతుంది. మరోవైపు రాజ్ ఆఫీసులో కావ్య చాంబర్ దగ్గరకు వచ్చి చూస్తాడు. కావ్య అక్కడ కనిపించకపోవడంతో కోపంగా శ్వేతతో...
రాజ్: చూశావా? చూశావా?
శ్వేత: ఏంటి?
రాజ్: తను ఇంకా రాలేదు.
శ్వేత: తనతో నీకు ఇప్పుడేమైనా ఆర్జెంట్ పని ఉందా?
రాజ్: ఏయ్ తనతో నాకేం పని ఉంటుంది.
శ్వేత: మరి ఎందుకు ఎదురుచూస్తున్నావు.
రాజ్: ఇప్పుడు టైం ఎంత అయ్యింది. పొద్దున్న తొమ్మిదింటికి వెళ్లింది. ఫ్లైట్ పదింటికి ఇప్పుడు పదకొండున్నర అయ్యింది. అంటే ఇంతసేపు ఏం చేస్తున్నట్లు..
అంటూ రాజ్ ఇరిటేటింగ్‌గా మాట్లాడతాడు. ఇంతలో కారు సౌండ్ విని కారు వచ్చినట్లు ఉంది అని బయటకు పరుగెడతాడు రాజ్. బయట కారు వచ్చి ఆగుతుంది. కారులోంచి కావ్య, వాళ్ల బావ దిగి నడుచుకుంటూ వస్తుంటారు.
శ్వేత: జంట చూడముచ్చటగా ఉంది కదా?
రాజ్: అప్పలమ్మకు బావ అంటే చిప్ప ముఖం వేసుకుని చీదరగా ఉంటాడనుకున్నాను. వీడేంటి హండ్సమ్ గా ఉండి చచ్చాడు.
శ్వేత: ఎంటీ జెలసా?
రాజ్: ఎయ్ చీచీ ఏం లేదు. నాకు జెలసీ ఎంటి?
అనగానే ఇంతలో కావ్య వాళ్ల బావను తీసుకుని లోపలికి వచ్చి అందరినీ పరిచయం చేస్తుంది. రాజ్‌ను పరిచయం చేయగానే రాజ్ జెలసీగా ఫీలవుతాడు. దీంతో అదేంటి బుజ్జి నేను రావడం మీ ఆయనకు ఇష్టం లేనట్టుంది అని కావ్యను వాళ్ల బావ అడగుతాడు.
రాజ్: అబ్బే అదేం లేదు నాది బ్రాడ్ మైండ్ అబ్రాడ్‌లో చదువుకుని వచ్చాను కదా?
కావ్య బావ: ఏది ఏమైనా మీరు చాలా లక్కీ అన్నయ్య
రాజ్: ఎందుకు నీలాంటి తమ్ముడు పుట్టుకొచ్చినందుకా?
అనగానే కాదు అన్నయ్యా బుట్టబొమ్మ లాంటి మా బుజ్జిని పెళ్లి చేసుకున్నందుకు అని చెప్పగానే రాజ్ షాక్ అవుతాడు. కావ్య వాళ్ల బావ క్లోజ్ గా ఉండటం చూసిన రాజ్ తన ఇరిటేషన్ మొత్తం స్టాఫ్ మీద చూపిస్తాడు. ఇంతలో కావ్య వాళ్ల బావను తీసుకుని తన క్యాబిన్‌లోకి వెళ్తుంది. రాజ్ కూడా శ్వేతను తీసుకుని తన క్యాబిన్‌లోకి వెళ్తాడు.
కావ్య బావ: ఎంటి కావ్య నీ ఆలోచన వర్కవుట్ అవుతుందంటావా? మనం వెళ్లే పద్దతి సరైనదేనా?
కావ్య: బావ నా ఆలోచన కరెక్టే.. నా పద్దతి కరెక్టే.. చూశావుగా బావ నీతో నేను చనువుగా ఉంటే ఎలా మండిపోతున్నాడో.. అది మనకు పనికొచ్చే విషయం. మన పని మరింత సులువు చేసే విషయం.
కావ్య బావ: కానీ దీనివల్ల నీకు చెడ్డపేరు వస్తుందేమోనని భయంగా ఉంది కావ్య.
కావ్య: అదంతా నేను చూసుకుంటాను నువ్వేం భయపడకు బావ.
అనగానే మీ ఆయన చూడటానికి బాగానే ఉన్నారు కానీ నిన్ను ఎందుకు వదిలించుకోవాలనుకుంటున్నాడో అర్థం కావడం లేదని వాళ్ల బావ అడగ్గానే ఆయనకు తిక్క అందుకే ఇలా చేస్తున్నారు అని కావ్య చెప్తుంది. మరోవైపు బయట కావ్య చాంబర్ దగ్గర నిలబడి దొంగచాటుగా వాళ్లు ఏం మాట్లాడుకుంటున్నారో వింటుంటాడు రాజ్. ఇంతలో శృతి వచ్చి పిలుస్తుంది. రాజ్ దొంగచాటుగా వినటాన్ని కావ్య గమనించి వాళ్ల బావకు చెప్తుంది. దీంతో ఇద్దరు తమ నాటకాన్ని మరింత పెంచుతారు. ఇంతలో కావ్య వెళ్లి డోర్ ఓపెన్ చేస్తుంది. రాజ్ కింద పడబోతుంటే కావ్య పట్టుకుంటుంది. శ్వేత వచ్చి చూస్తుంది. రాజ్ గిల్టీగా ఫీలవుతూ తన చాంబర్‌లోకి వెళ్తాడు. తర్వాత రాజ్ కేక్ తెప్పించి కట్ చేయబోతుంటే కేక్ ఇప్పుడెందుక కట్ చేస్తున్నారు సార్ అని శృతి అడుగుతుంది.
రాజ్: శ్వేతకు తన భర్త నుంచి విడాకులు వచ్చాయి. ఈరోజు నుంచి నా ఫ్రెండ్ శ్వేతకు పూర్తి స్వేచ్చ వచ్చింది.
కావ్య: ఇప్పుడు ఇక్కడ అందరూ చప్పట్లు కొట్టాలా? సంతోషంతో.. విచారణతో మౌనం పాటించాలా? మాకేమీ అర్థం కావడం లేదు.
రాజ్: ఇది నేను బాగా సంతోషించే విషయం. శ్వేతకు ఎప్పుడు విడాకులు వస్తాయా? అని నేను వెయ్యి కళ్లతో ఎదురుచూశాను.
అనగానే కావ్య ఎవరి జీవితాలను వాళ్లు ఎవరి సంతోషాలను వాళ్లు చూసుకోవడంలో తప్పు లేదు అనగానే వాళ్ల బావ బుజ్జి ఈ అభ్యుదయ భావాలు ఇంకా నీలోన ఉన్నాయి అంటే చాలా గ్రేట్ ఇంత విశాలంగా ఆలోచిస్తున్నావు అంటే నీది ఎంత గొప్ప మనసు బుజ్జి అనగానే రాజ్ షాక్ అవుతాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
Also Read: పద్మవిభూషణుడికి అమెరికాలో 'మెగా' సత్కారం!