Seethe Ramudi Katnam Today Episode:

  ఆఫీస్‌కు చలపతి కూడా వచ్చాడని ఆడిటర్, లాయర్ వచ్చిన విషయం సీతకు చెప్తేస్తాడేమో అని మహాలక్ష్మితో తన భర్త చెప్తాడు. దానికి మహా.. సీత పల్లెటూరి నుంచి వచ్చిందని దానికి కంపెనీ గురించి లాయర్, ఆడిటర్‌ల గురించి ఏం తెలుస్తుంది. ఇక గిరధర్, అర్చనలు కూడా సీతతో జాగ్రత్తగా ఉండాలి అని పోలీస్‌ కూతురని కూపీ లాగుతుంది అని అంటారు.


మహాలక్ష్మి: ఎవర్ని అడుగుతుంది. మన నలుగురినా దానికి అంత ధైర్యం లేదు. లాయర్‌ని ఆడిటర్‌ని అడుగుతుందా దానికి అంత తెలివి లేదా.. దాని గురించి అంత ఆలోచించకండి.. దాన్ని మన కాలికింద తొక్కి నలిపేద్దాం. నాతో పెట్టుకుంటే ఏ గతి పడుతుందో దానికి అర్థమయ్యేలా చేస్తా.. 
సీత: తిను మామ కమ్మటి భోజనం నీకోసం స్పెషల్‌గా చేసి తీసుకొచ్చాను. 
రామ్: నువ్వు చెప్పినట్లు ఐటెమ్స్ అన్నీ గుమగుమలాడిపోతున్నాయి. ఇద్దరం కలిసి తిందాం. 
సీత: మీతో కలిసి తినాలి అని నాకు ఎప్పటి నుంచో ఉంది.. అని ఇద్దరూ ఒకరికి ఒకరు తినిపించుకుంటారు. ఇంతలో మహాలక్ష్మి వాళ్లు వస్తారు. కాలింగ్ బెల్ కొట్టడంతో సీత కావాలి అనే డోర్ తీయదు. కాసేపు గుమ్మం దగ్గరే నిల్చొపెడతా అని మళ్లీ తమ గదికి వెళ్లిపోతుంది. 
రామ్: ఎవరు సీత..
సీత: ఎవరో సేల్స్ వాళ్లు మామ.. 
మహాలక్ష్మి: ఆ సీత ఇంట్లోనే ఉంటుంది  కదా ఎక్కడ చచ్చింది.
అర్చన: ఎక్కడికి వెళ్తుందో మనకు చెప్పి వెళ్తుందా.. సీతకు ఫోన్ చేస్తుంది. సీత ఫోన్ ఎత్తదు. 
గిరిధర్: కావాలనే మనల్ని సీత అవైడ్ చేస్తుంది. 
చలపతి: ఆఫీస్ నుంచి మా కంటే ముందే వచ్చారు ఇంకా బయట ఏం చేస్తున్నారు. 
రేవతి: ఇంట్లో ఎవరూ లేరేమో..
మహాలక్ష్మి: కచ్చితంగా ఆ సీత ఇంట్లోనే ఉంది కానీ కావాలనే డోర్ తీయడం లేదు.
అర్చన: నేను కూడా అదే అనకుంటున్నాను మహా..
మహాలక్ష్మి: అది ఇంట్లో ఉందో లేదో ఇప్పుడే తేల్చేస్తా.. అన్నయ్య నువ్వు పైపు ఎక్కి అది ఇంట్లో ఉందో లేదో చూడు.. చలపతి పైకి వచ్చి చూసి సీతా, రామ్‌లు ఒకరికి ఒకరు తినిపించుకోవడం చూసి వాళ్లు ఎప్పుడూ ఇలా సంతోషంగా ఉండాలి అని అంటాడు. కిందకి వచ్చి సీత ఉంది అని చెప్తాడు. 
మహాలక్ష్మి: చెప్పానా అది లోపలే ఉండి మనతో ఆడుకుంటుంది అని.. 


ఈసారి గిరిధర్ పైపు ఎక్కి పైకి వెళ్లి బాల్యానీ నుంచి ఇంట్లోకి దూరి తలుపు తీస్తాడు. మరోవైపు రామ్‌ సీతకు ముద్దు పెట్టుకునేటప్పుడు మహాలక్ష్మి సీతను పిలుస్తుంది. అందరూ వచ్చారు అని రామ్ కంగారు పడతాడు. రామ్‌ని ఉండమని సీత కిందకి వస్తుంది. అందరూ సీతకు చీవాట్లు పెడతారు. రూమ్‌లో ఒక్కదానివే ఉండి ఏం చేస్తున్నావ్ అని మహా అడిగితే నేను ఒక్కదాన్నే లేను రామ్‌ కూడా ఉన్నాడని సీత చెప్తుంది. అందరూ షాక్ అవుతారు. ఇంతలో రామ్ కిందకి వస్తాడు. మహాలక్ష్మి రామ్‌ని ప్రశ్నిస్తుంది. బెల్‌ కొట్టినా ఎందుకు తీయలేదు అని అడుగుతుంది. సేల్స్ వారు వచ్చారని సీత చెప్పిందని రామ్ అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: ‘బ్రహ్మముడి’ సీరియల్‌ ఫిబ్రవరి 1st : శ్వేత గురించి రాజ్ ను నిలదీసిన కావ్య - విడిపోదామని బాంబ్ పేల్చిన రాజ్