Seethe ramudi katnam Serial Today Episode:   సీత, రామ్ కోసం గది మొత్తం వెతుకుతుంది. రామ్ చాటుగా వచ్చి తలుపు గడియ పెడతాడు. సీతని వెనక నుంచి హగ్ చేసుకుంటాడు. సీత అరుస్తుంది. రామ్ సీత నోరు నొక్కుతాడు. నాకు ఈ ముద్దులు, హగ్గులు తప్పా ఇంకేం ఇస్తావు నీవు అని అడుగుతుంది సీత. అయితే ఇస్తాను. నువ్వు అడిగి చూడు అంటాడు రామ్‌. అయితే అడిగాక తప్పకుండా ఇస్తావా? అని సీత అంటే ఈ రామ్‌  అంటే ఆ రాముడితో సమానం ఆడిన మాట తప్పను అంటాడు. దీంతో విద్యాదేవి చెప్పినట్లు సీత ఇంటి పెత్తనం అడుగుతుంది. ఇంటి తాళాలు బాధ్యతలు నాకు అప్పజెప్పాలని అడగుతుంది సీత. మీ పిన్నికి నేను కోడలు అవడం ఇష్టం లేనట్లుంది. అందుకే నాకు ఇంటి తాళాలు ఇవ్వలేదని చెప్తుంది సీత. అదేం లేదని నేను వెళ్లి తాళాలు అడిగితే మా పిన్ని వెంటనే ఇస్తుంది అని రామ్‌ చెప్తాడు. నువ్వు చూస్తూ ఉండు తాళాలతో తిరిగి వస్తానని చెప్పి వెళ్లిపోతాడు.  రామ్‌ వెళ్తుంటే మహాలక్ష్మీ, జనార్ధన్‌ మాట్లాడుకుంటారు.


జన: ఏంటి మహా ఇంటి బాధ్యతలు సీతకు అప్పగించాలనుకుంటున్నావా?


మహా: అవును జనా ఎంతైనా సీత ఈ ఇంటి కోడలు. నా తర్వాత ఈ ఇంటి బాధ్యత, పెత్తనం అంతా సీతదే కదా?


జన: కావొచ్చు మహా కానీ ఇప్పుడే సీతకు ఇంటి పెత్తనం అప్పగించాల్సిన అవసరం ఏమోచ్చింది.


మహా: ఎప్పటికైనా ఈ ఇంటి బాధ్యతలు సీతవే కదా జనా..


జన: తాళాలు కావాలని సీత నిన్ను అడిగిందా?


మహా: అడక్కపోవచ్చు కానీ రేపనై అడగదన్నా గ్యారంటీ ఏముంది. సీతే అడుగుతుందో లేక రామ్‌‌త ోఅడిగిస్తుందో ఎవరికి తెలుసు?


జన: రామ్‌ సీతలు అలా తొందర పడరని నేను అనుకుంటున్నాను.


మహా: వాళ్ళు అడగకముందే మనమే ఇచ్చేస్తే గౌరవంగా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను.  


  అని ఇద్దరూ మాట్లాడుకోవడం డోర్‌ చాటు నుంచి రామ్‌ వింటాడు. జనార్థన్‌ అప్పుడే సీతకు బాధ్యతలు ఇస్తే మేనేజ్‌ చేయగలదా? అని డౌట్‌ క్రియేట్‌ చేస్తాడు. చేయలేదు కానీ సీతకు బాధ్యతలు ఇవ్వాల్సిందేనని మహా చెప్తుంది. అయితే ఇప్పుడే ఇవ్వనని సుమతి వచ్చాకే ఇస్తానని మహా చెప్పడంతో జనార్ధన్‌ మెచ్చుకుంటాడు. రామ్‌ హ్యాపీగా వెళ్లిపోతాడు. నువ్వు బయట నుంచి చాటుగా వింటున్నావని నాకు తెలుసు రామ్‌ అందుకే జనాతో అలా మాట్లాడాను అని మనసులో అనుకుంటుంది మహాలక్ష్మీ. మరోవైపు బెడ్‌ రూంలోకి వెళ్లిన రామ్‌.. హ్యాపీగా సీతను హగ్‌ చేసుకుంటాడు.


సీత: ఏయ్‌ మామ ఏమైంది. మీ పిన్ని ఏమంది. కాయా..? పండా?


రామ్‌: ఆ.. ప్రూట్‌ జ్యూస్‌ మా పిన్ని సూపర్‌ జీనియస్‌..


సీత: ఏమంటున్నావు మామ.. తాళాలు ఇచ్చిందా? లేదా?


రామ్‌: ఇవ్వలేదు..


సీత: ఏ.. ఏమైంది?


రామ్‌: నేను అడగలేదు.


సీత: అడగడానికే కదా వెళ్లావు.


రామ్‌: అంతకంటే ముందే మంచి విషయం విని వచ్చేశాను సీత. ఏం జరిగిందో చెప్తే నువ్వు షాక్‌ అవుతావు.


సీత: ఏం జరిగిందో..


రామ్‌: నాన్నతో మా పిన్ని ఏం చెప్పిందంటే…


 అంటూ రూంలో మహా, జన మాట్లాడుకున్న అన్ని విషయాలు రామ్‌, సీతకు చెప్తాడు. దీంతో సీత డిసప్పాయింట్‌ అవుతుంది. రామ్‌ మాత్రం పిన్ని ఎంత గొప్పగా ఆలోచించి కదా అంటూ మహాను మెచ్చుకుంటాడు. నీ మాటలు విని నేను అనవసరంగా వెళ్లాను. నువ్వు ఇంకెప్పుడు అలా ఆలోచించొద్దు. నాకు అలా ఎప్పుడూ చెప్పొద్దు. మనం అడగక ముందే మనకు అన్ని చేయాలనుకుంటుంది. అని రామ్‌.. మహాను పొగడ్తలతో ముంచేస్తాడు. ఇంతలో సీత అక్కడి మూడ్‌ను మార్చేస్తుంది. రొమాంటిక్‌ గా మాట్లాడుతుంది. మరోవైపు రేవతి, కిరణ్‌ వెళ్లిపోతుంటారు.


కిరణ్‌: ఇలా ఎంత కాలం రేవతి ఎన్నాళ్లు మనం విడిగా ఉండాలి.


రేవతి: మన పెళ్లి జరిపిస్తానని సీత చెప్పింది కదా కిరణ్‌.


కిరణ్‌: అలా చెప్పిందే కానీ మళ్లీ మన పెళ్లి ఊసే లేదు.


రేవతి: అంటే ఈ నెల రోజులు ఆషాడం అని సీత ఇంట్లో లేదు కదా?


కిరణ్‌: ఇప్పుడు ఆషాడం అయిపోయింది కదా? పెళ్లి ముహూర్తాలు పెట్టుకోవచ్చు.


 అని మాట్లాడుకుంటుంటే ప్రకాష్‌ రేవతిని చూసి.. మహాలక్ష్మీకి ఫోన్‌ చేసి మీ ఆడపడచు వేరే అబ్బాయితో తిరుగుతుందని సంబంధం చూడమని నాకు ఎలా చెప్పారు. తనకు నేను సంబంధాలు చూడలేనని చెప్తాడు. దీంతో మహాలక్ష్మీ కోపంగా రేవతిని తిడుతుంది. మనం చూసిన సంబంధం చేసుకునే వరకు రేవతి ఇంటి గడప దాటకూడదు. అని జనార్ధన్‌కు చెప్తుంది. ఇంతలో కిరణ్‌, రేవతి ఇంట్లోకి వస్తారు. సెక్యూరిటీ సాంబ వచ్చి కిరణ్‌ ను ఆపుతాడు. మిమ్మల్ని లోపలికి రానివ్వొద్దని మహాలక్ష్మీ మేడం ఆర్డర్‌ వేసిందని చెప్పడంతో కిరణ్‌, రేవతి షాక్‌ అవుతారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పిల్ల ల్ని బంధీలుగా చేసకున్న ఉగ్రవాదులు – రంగంలోకి దిగిన జేడీ