Seethe Ramudi Katnam Serial Today Episode మహాలక్ష్మీ విద్యాదేవిని ఇంటికి తీసుకొస్తుంది. ఇంట్లోనే ఉంటుందని చెప్తుంది. మహాలక్ష్మీని అర్చన చాటుగా తీసుకెళ్లి వెడ్డింగ్ డే నుంచి నీకేమైంది ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావని అడుగుతుంది. చరిత్ర హీనురాలిని అవ్వకూడదని ఇలా చేశానని మహాలక్ష్మీ అర్చన చెప్తుంది. 


మహాలక్ష్మీ: జరిగింది నీకు చెప్తే పిచ్చెక్కిపోతావ్ అర్చన. సీఐ త్రిలోక్ నాకు కాల్ చేసి కలిశాడు. ( ముఖర్జీ సీఐని కలిసి మహాలక్ష్మీ అక్రమాలు తెలుసని చెప్పాడని అతనికి చాలా నెట్‌వర్క్ ఉందని అతనితో కాంప్లికేట్స్ వద్దని బతిమాలితే విద్యాదేవి అలియాస్ సుమతిని బయటకు తీసుకురాకపోతే మహాలక్ష్మీని జైలుకి పంపిస్తానని చెప్పాడని అందుకే సుమతిని విడిపించి తీసుకొచ్చానని మహాలక్ష్మీ చెప్తుంది.
అర్చన: సుమతికి ముఖర్జీకి ఏంటి సంబంధం తన కోసం ఆయన ఎందుకు ఇదంతా చేశాడు.
మహాలక్ష్మీ: సుమతి కోసం చేయలేదు. సీత కోసం సీత ముఖర్జీ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇదంతా చేయించింది. సీతని ముఖర్జీ కన్న కూతురిలా చూస్తున్నాడు అందుకే సీత చెప్పినట్లు చేస్తున్నాడు. ఇప్పుడు నేను ఇలా చేయకపోయి ఉంటే సీత ఆ అక్రమాలు బయట పెట్టేది. అప్పుడు అందరిలో నా విలువ పడిపోయేది.
అర్చన: సీత ఇంత ఫవర్ ఫుల్లా ఇప్పుడు మేనత్త మేనకోడలు నీతో ఒక ఆట ఆడుకుంటారు మహా.
మహాలక్ష్మీ: విద్యాదేవినే సుమతి అని తెలియనంత వరకు నాకు ఏం ప్రాబ్లమ్ రాదు ఆ విషయం బయట పడకుండా జాగ్రత్త పడాలి.


సీత ముఖర్జీని కలిసి థ్యాంక్స్ చెప్తుంది. ఇంట్లో విద్యాదేవి అలియాస్ సుమతి మహాలక్ష్మీ గదిలో కుర్చీలో కూర్చొని  ఉండటం మహాలక్ష్మీ చూసి షాక్ అయిపోతుంది. విద్యాదేవి మహాలక్ష్మీని చూసి ఏంటి మహాలక్ష్మీ షాక్ అయ్యావా అని అడుగుతుంది.  నా కుర్చీలో ఎందుకు కూర్చొన్నావ్ అని మహాలక్ష్మీ అడిగితే నువ్వు నా అన్న అన్నీ తీసుకున్నావ్ నేను ఎంత ఫీలవ్వాలి అని అంటుంది. స్నేహానికి ద్రోహం చేశావని సుమతి మహాలక్ష్మీతో అంటుంది. సీతే నీ నోటితో నేను సుమతి అని చెప్పిస్తుందని విద్యాదేవి మహాలక్ష్మీతో అంటుంది. నేను నా స్థానాన్ని తీసుకొని నిన్ను సైడ్ చేస్తానని ఇదంతా సీత ప్లాన్ అని రెడీగా ఉండని విద్యాదేవి చెప్తుంది.


మరోవైపు సీత తన తల్లిదండ్రులకు కాల్ చేసి సుమతి అత్తమ్మ ఇంటికి వచ్చేసిందని చెప్తుంది. శివకృష్ణ, లలిత చాలా సంతోషిస్తారు. సీతని మెచ్చుకుంటారు. ఇంతలో రామ్ కోపంతో సీత ఫోన్ తీసుకొని శివకృష్ణ వాళ్లతో మీ కూతురు చేసిన వెధవ పనికి మీరు మెచ్చుకుంటున్నారా అని ప్రశ్నిస్తాడు. పోలీస్ ఉండి హంతకురాలు బయటకు రావడాన్ని హర్షిస్తున్నారా అని అంటాడు. సీతకి బుద్ధి లేదు అనుకుంటే మీరు అలా మాట్లాడుతారేంటి అని అంటాడు. మా పిన్న అబద్ధం చెప్పదని మా నాన్న కూడా అమ్మని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని మా నాన్న అమ్మని గుర్తు పట్టలేడా అని ప్రశ్నిస్తాడు. సీత చెప్పింది గుడ్డిగా నమ్మొద్దని చెప్తాడు. రామ్‌ని ఎక్కువ హర్ట్ చేయొద్దని తల్లిదండ్రులు సీతతో చెప్తారు. 


సీత అత్తమ్మా అని విద్యాదేవిని గిరగిరా తిప్పేస్తుంది. ఇద్దరూ ఇది మన ఇద్దరి గెలుపు అని మాట్లాడుకుంటారు. రామ్ టీచర్‌తో మాట్లాడటం చూసిన రామ్ కోపంగా ఆవిడ మీద నాకు గౌరవం పోయిందని ఈవిడ నాకు ఏ రకంగా అమ్మ అవుతుంది. నన్ను కన్నదా పెంచిదా నా తల్లిని నాకు దూరం చేసిన ఈమె ఇప్పుడు మమల్ని చంపడానికి వచ్చారా అని అంటాడు. కన్న కొడుకే కన్న తల్లిని నమ్మను అంటున్నాడు నా పరిస్థితి ఎవరికీ రాకూడదని విద్యాదేవి చాలా ఫీలవుతుంది. ఏడుస్తుంది. సీత విద్యాదేవికి ధైర్యం చెప్తుంది. ఉదయం సీత అందరికీ టిఫెన్ పెడుతుంది. విద్యాదేవి కూడా అక్కడికి వస్తుంది. సీత టిఫెన్ పెడతా అని విద్యాదేవిని కూర్చొపెడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: కార్తీకదీపం 2 సీరియల్: పాపం జ్యోత్స్న.. మనవరాలి కోసం కూతురి ఇంటికి తాత.. ఘోరంగా అవమానించిన కార్తీక్!