Seethe Ramudi Katnam Serial Today Episode రామ్ మహాలక్ష్మీకి కాల్ చేస్తాడు ఫోన్ స్విఛ్ ఆఫ్ వస్తుంది. సీత ఇంట్లో వాళ్లతో మహాలక్ష్మీ అత్తయ్య కావాలనే అలా ఫోన్ ఆపేస్తుందని అంటుంది. మహా వెళ్లడం ఇష్టం లేక సీత ఇలా మాట్లాడుతుందని గిరి, అర్చనలు అంటారు. ఇక రామ్ సీతని అక్కడి నుంచి పంపేస్తాడు. మరోవైపు మహాలక్ష్మీ కారు రిపేర్‌కి ఇవ్వడం కారు బ్రేకులు పోయింటాయి. ఆ విషయం తెలియక మెనానిక్ కారు డెలివరీ ఇచ్చేస్తాడు. రామ్ వాళ్లు కూడా కంటిన్యూగా ఫోన్ చేస్తుంటారు. మెకానిక్ కూడా మహాలక్ష్మీకి విషయం చెప్పాలని ఫోన్ చేస్తే ఫోన్ స్విఛ్ ఆఫ్ వస్తుంది. ఇంట్లో అందరూ ఏమైనా జరిగి ఉంటుందా అని టెన్షన్ పడతారు.
సీత రామ్ వాళ్లతో కంపెనీ వాళ్లకి కాల్ చేసి అడమని చెప్తుంది. రామ్ కాల్ చేస్తాడు. మహాలక్ష్మీ గారు టచ్‌లో లేరని చెప్తాడు. ఆఫీస్ అతను మీటింగ్ లేదని చెప్తాడు. మహాలక్ష్మీ గారు ఫోన్ చేయలేదని చెప్తాడు. రామ్ షాక్ అయి బెంగుళూరులో మీటింగ్స్ ఏం లేవని చెప్తాడు. పిన్ని ఇంకెక్కడికి వెళ్లిందని అనుకుంటారు. దానికి సీత నాకు మొదటి నుంచి ఈ ట్రీప్ గురించి అనుమానంగా ఉందని అంటుంది. ఏదో జరిగిందని అందరూ అనుకుంటారు. మహాలక్ష్మీకి ఏదో ప్రాబ్లమ్ ఉండటం వల్లే అలా చెప్పిందేమో అని అనుకుంటారు. సీత మాత్రం అత్తయ్య ఇబ్బంది పెడుతుంది కానీ తాను ఇబ్బంది పడదు అని చెప్తాడు. ఇక మహాలక్ష్మీ అనుకున్న లోయ దగ్గరకు వచ్చి కారు ఆపాలని బ్రేక్ నొక్కుతుంది. కానీ బ్రేక్ పట్టదు. మహాలక్ష్మీ చాలా టెన్షన్ పడుతుంది. సర్వీసింగ్‌కి నిన్నే ఇచ్చా కదా ఇలా అయిందేంటి అనుకుంటుంది. డోర్ తీసి దూకేయాలని అనుకుంటుంది కానీ డోర్ రాదు.
ఇక మహాలక్ష్మీ కారు బ్రేకులు పడక రోడ్డు మీద వెళ్లడం కోర్టు పని మీద వెళ్తున్న సీత తండ్రి చూస్తాడు. అది మహాలక్ష్మీ కారే మహాలక్ష్మీనే ఉందని శివకృష్ణ మహాలక్ష్మీని ఫాలో అవుతాడు. కారు అదుపు తప్పి బ్రేక్స్ ఫెయిల్ అయినట్లున్నాయిని వెనకాలే వెళ్తాడు. ఇంతలో శివకృష్ణ వచ్చే సరికి మహాలక్ష్మీ కారు లోయలో పడి కాలి బూడిదైపోతుంది. శివకృష్ణ షాక్ అయిపోతాడు. ఆ ఘటన చూసిన తర్వాత శివకృష్ణ వెళ్లిపోతాడు. ఇక ఎస్ ఐ త్రిలోక్‌కి మరో పోలీస్ ఆయన ఫోన్ చేసి మహాలక్ష్మీ కారు కాలిపోయిందని చెప్తాడు. త్రిలోక్ మహాలక్ష్మీ కూడా చనిపోయిందని తెలుసుకోకుండా ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని అనుకొని మహాలక్ష్మీ గారు చనిపోయారని న్యూస్ మార్మోగిపోవాలని చెప్తాడు. ఈ నెపంతో విద్యాదేవిని అరెస్ట్ చేయాలని అంటాడు. రామ్ వాళ్లు కూడా చెలా టెన్షన్ పడుతుంటారు. ఇంతలో రామ్‌కి ఓ కాల్ వస్తుంది. రామ్ షాక్ అయిపోతాడు. ఏడుస్తూ పిన్ని గురించి టీవీలో వస్తుందని టీవీ ఆన్ చేస్తాడు. టీవీలో రోడ్డు ప్రమాదంలో మహాలక్ష్మీ మృతి అని చూపిస్తారు. ఇంటిళ్ల పాది షాక్ అయిపోతారు.
జనార్థన్ మహా అని పెద్దగా అరిచి ఏడుస్తూ కుప్పకూలిపోతాడు. అందరూ జనాని ఓదార్చే ప్రయత్నం చేస్తారు. ఇక పోలీస్ త్రిలోక్ మహాలక్ష్మీ ఇంటికి వస్తాడు. విషయం ఇందాకే తెలిసిందని చెప్తాడు. మహాలక్ష్మీ తనకు ఒకరితో ప్రాణహాని ఉందని కంప్లైంట్ ఇచ్చారని కావాలనే ఇది చేసిన హత్యాప్రయత్నం అని అంటాడు. అందరూ షాక్ అయిపోతారు. జనార్థన్ ఏడుస్తూ నా మహాని కావాలనే చంపేశారా అంటాడు. ఆ హంతకురాలు విద్యాదేవినే అని పోలీస్ చేప్తారు. నేనేం చేయలేదు అని విద్యాదేవి చెప్తుంది. అందరూ షాక్ అయిపోతారు. ఇక అర్చన రికార్ట్ చేసిన వీడియో అందరికీ చూపిస్తుంది. కావాలనే మహాని చంపేసిందని విద్యాదేవిని గిరిధర్, అర్చన ఏడుస్తారు. పోలీసులు విద్యాదేవిని అరెస్ట్ చేస్తామంటే సీత అడ్డుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: సత్యభామ సీరియల్ డిసెంబరు 30వ తేదీ: తొండ ముదిరి ఊసరవెల్లి అవుతుందా.. మరో బేబీ కథేనా ఇది?