Seethe Ramudi Katnam Serial Today Episode యాడ్ డైరెక్షన్ అంటూ సీత విద్యాదేవి అలియాస్ సుమతి, జనార్థన్‌లను భార్యభర్తలుగా నటించేలా చేస్తుంది. విద్యాదేవి అలకలో ఉంటే జనార్థన్ చీర తీసుకొని వచ్చి ఇచ్చి అలక తీర్చినట్లు నటించేలా చేస్తుంది. జనార్థన్, విద్యాదేవిలను పక్కపక్కన చూసి మహాలక్ష్మీ రగిలిపోతుంది. ఆ సీన్ తలచుకొని కోపంతో ఉంటుంది. ఇంతలో సీత మహా దగ్గరకు వస్తుంది.
సీత: ఏంటి అత్త ఏదో సీరియస్‌గా ఆలోచిస్తున్నావ్. జనార్థన్ మామ సుమతి అత్తమ్మ భార్యభర్తలుగా నటించడంతో షాక్ అయ్యారా. అది నిజమైన సీన్ అని మీ బాధ గొంతులోకి వచ్చిందా.
మహాలక్ష్మీ: నేను మరీ అంత వీక్ కాదే నా బలాన్ని నువ్వు అంచనా వేయలేవు.
సీత: నేను చూశాను అత్త కవరింగ్ వద్దు ఐదు నిమిషాలు వాళ్లు అలా నటిస్తేనే తట్టుకోలేకపోయావ్ ప్రపంచం అంతా తల్లకిందులైనట్లు ఫీలయ్యారు అలాంటిది తన స్థానం కొట్టేసి ఇన్నేళ్లు చలామణి అయిన మిమల్ని చూస్తే ఆవిడకు ఎలా ఉంటుంది. తన భర్తాపిల్లల్ని ఇంటిని ఆఫీస్‌ని తీసుకుంటే ఆమెకు ఎలా ఉంటుంది.
మహాలక్ష్మీ: ఇదంతా నాకు దక్కాలి అని ఉన్ను అందుకే దక్కాయి. ఎవరు బాధ పడినా నాకు అనవసరం.
సీత: మా అత్తయ్య పడిన బాధ మీకు తెలియాలి అనే ఇలా యాడ్ షూట్ చేశా. రేపు ఈ యాడ్ అన్ని టీవీల్లో మీడియాల్లో వస్తుంది. సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేస్తా అప్పుడు అత్తయ్య, మామయ్యలు భార్యాభర్తల్లా ట్రెండ్ అవుతారు. ఆఖరి ట్విస్ట్ ఇవ్వనా. ఈ వీడియో తీసింది జనార్థన్ మామయ్యని, అత్తమ్మని కలపడానికి కూడా. టీవీలో యాడ్ వస్తే మామయ్య మనసు మారిపోతుంది. ఏమాటకి ఆ మాట అత్తయ్య మీ కంటే సుమతి అత్తమ్మే జనార్థన్ మామయ్య పక్కన బాగున్నారు.
మహాలక్ష్మీ: సీతా...
సీత: ఇది ఇప్పుడు నేను అంటున్నా తర్వాత అందరూ అంటారు.
మహాలక్ష్మీ సీత మాటలు తలచుకొని కోపంగా ఉంటుంది. ఇంతలో అర్చన వచ్చి ఈ చైర్‌లో కూర్చొని బిల్డప్ ఇవ్వడం తప్ప ఇంకేం చేయలేవని అంటుంది. మహాలక్ష్మీ అర్చన మీద కోపంతో అరుస్తుంది. నీలాంటి పరిస్థితి నాకు వస్తే చస్తాను అంటుంది. సీత మీద నీ ప్రతాపం చూపించు అని అంటుంది. మహాలక్ష్మీ అర్చన మీద కోప్పడుతుంది. అప్పుడప్పుడు నా సలహాలు కూడా తీసుకో అని అర్చన మహాలక్ష్మీతో చెప్పి మహాలక్ష్మీ ఛైర్‌లో కూర్చొంటుంది. మహాలక్ష్మీ రగిలిపోతుంది నీ టైం నడుస్తుందని అంటుంది. వెంటనే సుమంగళి వ్రతం చేయమని ఆ వ్రతంలో బావగారితో పక్కపక్కన కూర్చొంటే బావగారు నీకే సొంతమని అత్తాకోడళ్లకి తెలుస్తుందని చుట్టాలని పిలిచి విషయం చెప్తే నీకు పబ్లిసిటీ పెరుగుతుందని అంటుంది. మహాలక్ష్మీ అర్చనను పైకి లేపి అర్చనను పొగిడేస్తుంది.
అందరూ డిన్నర్‌కి కూర్చొంటారు. ఇంతలో మహాలక్ష్మీ వచ్చి సుమంగళి వ్రతం గురించి చెప్తుంది. గుడికి వెళ్లడానికే ఇష్టమపడి మీరు వ్రతం చేయడం ఏంటి అని అడుగుతుంది. దానికి మహాలక్ష్మీ నేను భర్తతోనే కలిసున్నాను నా వాళ్ల కోసం ఏమైనా చేస్తానని అంటుంది. జనార్థన్ కూడా వ్రతం చేయమని నీ పక్కన కూర్చొని వ్రతం చేయడం నాకు ఆనందమే అంటాడు. మహాలక్ష్మీ సీత దగ్గరకు వెళ్లి నేను ఇచ్చిన ట్విస్ట్‌కి షాక్ అయ్యావా నాతో జనార్థన్ వ్రతం చేస్తే మీ అత్త కుళ్లి కుళ్లి చస్తుంది కదా అంటుంది. సీత మహాలక్ష్మీతో సుమతి అత్తమ్మ, మామయ్యలది ప్రేమ బంధం వాళ్లని దేవుడు కలిపారు మీరుఅత్తమ్మని దూరం చేసి ఆ బంధంలోకి వచ్చారు కాబట్టి మీరు ఎలా వ్రతంలో కూర్చొంటారో నేను చూస్తానని అంటుంది. అంతా నా ఇష్ట ప్రకారమే జరుగుతుందని మహాలక్ష్మీ అంటుంది. ఇక విద్యాదేవి వ్రతం గురించి తలచుకొని ఏడుస్తుంది. సీత టీచర్ దగ్గరకు వెళ్లి ఓదర్చే ప్రయత్నం చేస్తుంది. వ్రతంలో కూర్చొనే అర్హత మీకే ఉందని మిమల్ని నేను మామయ్య పక్కన కూర్చొపెడతా అని సీత అంటుంది. ఆ మాటలు అర్చన వింటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: రాజీనామాని తాత ముఖం మీద విసిరి కొట్టిన కార్తీక్.. దీపే సర్వస్వం అని తేల్చేశాడుగా!