Seethe Ramudi Katnam Serial Today Episode సీత అత్తలతో బట్టలు ఉతికిస్తుంది. పాపం ఇద్దరూ నడుం పట్టుకొని ఇబ్బంది పడతారు. తర్వాత వాళ్లని లోపలికి పిలుస్తుంది. ఎందుకు వచ్చారని అడుగుతుంది. దాంతో మహాలక్ష్మీ అర్చనలు భార్యభర్తలు దూరంగా ఎక్కువ కాలం ఉండకూడదు నిన్ను రామ్‌ని కలపాలని అనుకుంటున్నాం అంటారు.
సీత: మమల్ని విడదీసిందే మీరు కదా అత్తలు.మహాలక్ష్మీ: అందుకే మిమల్ని కలపాలి అనుకుంటున్నాం. అర్చన: మీ ఇద్దరిని ఒక దగ్గర ఉంచి ఒకటి చేసే ప్రయత్నం చేస్తాం.మహాలక్ష్మీ: ఎంతైనా నువ్వు మా కోడలివి అత్తాకోడళ్లు అంటే ఆ మాత్రం గిల్లికజ్జాలు ఉంటాయి కదా.అర్చన: మహా అన్నీ మర్చిపోయింది కదా నువ్వు అన్నీ మర్చిపోయి రా సీత. ఏంటి మహా ముగ్గురు గుసగుసలు ఆడుతున్నారు. వీళ్ల వాలకం చూస్తూ మనతో సీతని పంపేలా లేరు.సీత: అదీ పిన్ని మేటర్ అత్త వాళ్లు నన్ను తీసుకెళ్లాలి అంటున్నారు. నాకు వెళ్లాలి అని లేదు.రేవతి: ఏంటి సీత సాక్ష్యాత్తు మహాలక్ష్మీ వస్తే నువ్వు వెళ్లను అంటావా అంత బుద్ధి తక్కువదిలా కనిపిస్తుందా. కూరలో కరివేపాకులా తీసేస్తావా. వీధి కుక్కని తరిమేసినట్లు తరిమేస్తావా. అని రేవతి, కిరణ్ ఇద్దరూ మహాలక్ష్మీ, రేవతి ఇద్దరిని ఇన్ డైరెక్ట్‌గా తిడతారు. సీతని వెళ్లమని అంటారు.సీత: సరే పిన్ని మీరు ఇంతలా చెప్తున్నారు కదా వెళ్తాను.
సీత లగేజ్ తీసుకొచ్చి బ్యాగ్ బరువుగా ఉంది అత్తయ్య అంటుంది. మహాలక్ష్మీ సీత బ్యాగ్‌ని అర్చనకు పట్టుకోమని అంటుంది. ఇద్దరు అత్తలు సీతని తీసుకొని ఇంటికి వెళ్తారు. ఇంట్లో అందరూ వెయిట్ చేస్తుంటారు. సీత సాంబతో కొందరు నన్ను ఇంటికి రానివ్వను అన్నారు కానీ వాళ్లే నన్ను బతిమాలి తీసుకొచ్చారని చెప్తుంది. ఇక సీత బ్యాగ్ తీసుకురమ్మని అంటే అర్చన తిట్టుకుంటూ తీసుకొస్తుంది. సీత లోపలికి వెళ్లకుండా ఆగిపోతుంది. ఏమైందని అడిగితే నాకు మంగళహారతి కావాలని అంటుంది. మేళతాలాలు వద్దా అని అర్చన అంటే అర్చన అత్తయ్య నన్ను వెటకారం చేస్తుంది నేను వెళ్లిపోతా అని అంటుంది. మహాలక్ష్మీ ఆపి అర్చనకు హారతి తీసుకుమ్మని అంటుంది.
అర్చన హారతి తీసుకొస్తుంది. అర్చన హారతి ఇస్తుంటే నువ్వు కాదు మహాలక్ష్మీ అత్తయ్య ఇవ్వాలి అంటుంది. దాంతో మహాలక్ష్మీ హారతి ఇచ్చి సీతని లోపలికి ఆహ్వానిస్తుంది. అర్చన మనసులో కొడుకు పెళ్లి కోసం మహా ఏమైనా చేసేలా ఉందని అనుకుంటుంది. నాతో రాను అన్నావ్ ఎందుకు వచ్చావ్.. నువ్వు నిరపరాధి అని నిరూపించుకున్న తర్వాత వస్తా అన్నావ్ కదా అని సీతని అడుగుతాడు. దాంతో సీత చూడండి అత్తయ్య మామ ఏమంటున్నాడో అంటుంది. దాంతో మహాలక్ష్మీ రామ్‌ని సీతని ఏమనొద్దని ఇంట్లో ఎవరూ ఏం అనకూడదు అని అంటుంది. ఇక మహాలక్ష్మీ సీతని గదిలోకి వెళ్లి ఫ్రెష్ అవ్వమని అంటుంది. సీత పైకి వెళ్తూ లగేజ్ పంపమని అంటుంది. ఎంతో కష్టపడి సీతని ఇంటికి తీసుకొచ్చా ఎవరూ ఏం ఇబ్బంది పెట్టొద్దని అంటుంది. గౌతమ్ మిధునల పెళ్లి కోసం సీత ఏం అన్నా తప్పదని అంటుంది. వీలు చూసుకొని నేను సీతతో గౌతమ్ గురించి చెప్పొద్దని నేనే చెప్తానని మహాలక్ష్మీ అందరితో చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: "అత్యాచారయత్నం కేసులో సీఎం అరెస్ట్.. పదవికి రాజీనామా"!