Seethe Ramudi Katnam Today Episode మత్తు మందు కలిపిన డ్రింక్స్‌ను మహాలక్ష్మి చెప్పినట్లు వెయిటర్ మధుమిత, రామ్‌లకు ఇస్తాడు. ఇద్దరూ తీసుకుంటారు. మరోవైపు సీత తెగ టెన్షన్ పడుతుంది. అది మహాలక్ష్మి చూస్తుంది. పార్టీలో రామ్, మధులు ఒక్కటైతే సీత గుండె పగిలిపోతుందని అనుకుంటుంది. సీత రాముడికి దండం పెట్టుకుంటుంది. తన మామని తన నుంచి దూరం చేయొద్దని కోరుకుంటుంది.
రామ్, మధుమితలకు కిక్ ఎక్కడంతో రామ్, మధులు ఇద్దరూ చేతులు పట్టుకొని ప్రేమగా డ్యాన్స్ చేస్తారు. ఇద్దరూ లిప్ లాక్ పెట్టుకుంటారు. అయితే పార్టీలో ఇలాగే జరుగుతుందని మహా ఊహించుకుంటుంది. రామ్, మధులు మత్తులో ఒక్కటైపోయింటారని మహా అనుకుంటుంది. ఇంతలో రామ్, మధుమితలు హడావుడిగా ఇంటికి వస్తారు.
రామ్: పిన్ని మీకు ఓకేనా.. ఏమైంది. మీకు హాస్పిటల్‌కి వెళ్దాం రండి పిన్ని..
మహాలక్ష్మి: మీరు ఎందుకు వచ్చారు. పార్టీ అయిపోయిందా..
రామ్: లేదు పిన్ని. పార్టీ మధ్యలోనే వచ్చాం.
మహాలక్ష్మి: ఎందుకు.
రామ్: మీకు హార్ట్ ఎటాక్ వచ్చిందని సీత చెప్పడంతో వచ్చాం. పదండి పిన్ని త్వరగా వెళ్దాం.
జనార్థన్: హాస్పిటల్‌కి ఎందుకు రామ్.
రామ్: పిన్నికి స్ట్రోక్ వచ్చిందని సీత కాల్ చేసి చెప్పింది.
మహాలక్ష్మి: సీత నీతో అబద్ధం చెప్పింది రామ్. నాకు ఏ స్ట్రోక్ రాలేదు. మిమల్ని కావాలనే పార్టీ నుంచి రప్పించడానికి అలా చెప్పింది.
జనార్థన్: అసలు ఏం జరిగింది రామ్..
రామ్: నేను మధు గారు పార్టీలో ఉన్నాం. అప్పుడు మధుమిత, రామ్‌లు తమ ఫోన్‌లు స్విఛ్ ఆఫ్ అవ్వడం చూసి ఆన్ చేస్తారు. అప్పుడు సీత చాలా సార్లు ఫోన్ చేయడంతో రామ్ కంగారుగా కాల్ చేస్తాడు. సీత మహాకి గుండె పోటు అని చెప్పి అర్జెంటుగా రమ్మని చెప్తుంది. దీంతో రామ్, మధుమితలు కంగారుగా ఇంటికి వచ్చామని మహాతో చెప్తారు.
మహాలక్ష్మి అదంతా జోక్ మిమల్ని పార్టీనుంచి ఇంటికి రప్పించడానికి మీతో అలా చెప్పి రప్పించిందని మహా అంటుంది. దీంతో రామ్ సీతని తిట్టి కొట్టబోతాడు. సీత రామ్ చేతిని పట్టుకొని ఆపి నేనే గెలిచాను అని గెంతుతుంది. అందరూ షాక్ అయిపోతారు. చలపతి బాబాయ్‌తో పందెం కాశామని నీకు మీ పిన్ని అంటే ప్రాణం అని ఆమెకు ఏమైనా జరిగితే తొందరగా వచ్చేస్తావ్ అంటే బాబాయ్ అంత లేదు అన్నాడు. నువ్వు తొందరగా రావడంతో నేను గెలిచాను మామ అంటే రామ్ ఇంకోసారి ఇలా చేయకు అని సీతతో అంటాడు.
మహాలక్ష్మి: సీత.. సీత.. సీత... ఆ పళ్లెటూరి దానికి ఇన్ని తెలివి తేటలు ఎలా వచ్చాయి. మనం ఇంకా గొప్పగా ప్లాన్ చేయాలి. ఆ సీతని దెబ్బతీయాలి.
సీత: అక్కా.. నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా.. చదువుకున్నావ్. ఆ మాత్రం గ్రహించలేవా.. తన భర్తను అక్క వలలో పడకుండా కాపాడుకునే దుస్థితి ఏ చెల్లికి రాకూడదు.
మధు: అంటే ఏంటే నీ ఉద్దేశం. రామ్‌ని నేను ట్రాప్ చేస్తున్నాను అనా..
సీత: అర్థరాత్రుల వరకు నా భర్తతో తిరిగి రావడంలో నీ ఉద్దేశం ఏంటి. దీన్ని నేను ఎలా అర్థం చేసుకోవాలి.
మధు: నేను కావాలని వెళ్లలేదు. కంపెనీ పని మీద మహాలక్ష్మి గారు పంపితే వెళ్లాను.
సీత: ఆవిడ చెప్తే నువ్వు చేసేస్తావా.
మధు: ఆవిడ కంపెనీకి బాస్. ఆవిడ చెప్తే నేను అది చేయాలి.
సీత: ఆవిడ చెప్తే నువ్వు నా కాపురంలో నిప్పులు పోస్తావా..
మధు: నేను కంపెనీ గురించి చెప్తే నువ్వు కాపురం అంటావ్ ఏంటి. అయినా ఇప్పుడు ఏం కొంపలు అంటుకున్నావ్ అని అంతలా అయిపోతున్నావ్. రామ్ గారికి ఒక లేడీ పీఐ ఉంటే ఆవిడ అతనితో పాటు తిరగదా.. అన్నీ పనిలో భాగం అని అనుకోవా..
సీత: నీలా నా మామ వెనక ఇంకో ఆడది తిరిగితే దాని చెంప పగలగొడతా నువ్వు కాబట్టి వదిలేస్తున్నా.
మధు: నువ్వు నన్ను క్షమించడం ఏంటే నేను ఏం చేశాను. నువ్వు ఇలా ఊరికే నా మీదకు గొడవకు వస్తే నువ్వు అన్న పని చేయగలను. అనవసరంగా నా జోలికి వచ్చి నీ చెంప పగలగొట్టే పరిస్థితి తెచ్చుకోకు.
సీత: వద్దు అక్క వద్దు మన మధ్య అంత పెద్ద యుద్ధం వద్దు. నన్ను నీ చెల్లిగానే ఉండనివ్వు. శత్రువుని చేసుకోకు. ప్రేమగా చెప్తున్నా నా మాట విను.
మహాలక్ష్మి: అక్కా చెల్లెళ్లు చాలా ప్రేమగా మాట్లాడుకుంటున్నారు.
సీత: మేం గొడవ పడుతుంటే మీరు చూస్తున్నారా.. మీకు నా మీద కోపం ఉంటే నాతో యుద్ధం చేయండి. చాటు మాటు పనులు చేస్తే చాలా అసహ్యంగా ఉంటుంది. నేను చెప్తుంది పార్టీలో మీరు చేయాలి అనుకున్న పాడు పని గురించి.. మీటింగ్ పేరుతో మా అక్కని, మామని పంపి డ్రింక్‌లో మత్తు మందు కలపడం అని ప్లాన్ చేయడం అన్నీ నాకు తెలుసు. మీరు మాట్లాడింది అంతా నేను విన్నాను.
మహాలక్ష్మి: ఎక్కువ మాట్లాడుతున్నావ్.. సాక్ష్యం ఉందా..
సీత: సాక్ష్యం ఎలా అయినా పుట్టించగలను. కానీ నేను నిజం బయట పెడితే మీ పరువు ఏమవుతుందో అని ఆగాను. అదే జరిగితే నేను బయట పెడితే నాతో పాటు మిమల్ని అభిమానించే మీ పెంపుడు కొడుకే మిమల్ని బయటకు నెట్టేస్తాడు. మహాకి వార్నింగ్ ఇచ్చి సీత రామ్ దగ్గరకు వెళ్లి రామ్‌ని హత్తుకొని గట్టిగా ఏడుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.