Seethe Ramudi Katnam Serial Today Episode గౌతమ్‌, మిధునల నిశ్చితార్థం దగ్గరకు రేఖ వచ్చి గౌతమ్ తనని ప్రేమించాడని చాలా దూరం ట్రావెల్ చేశాడని చెప్తుంది. మహాలక్ష్మీ గౌతమ్‌కి పబ్‌కి వెళ్లే అలవాటు ఉందని అక్కడే ఈ అమ్మాయి పరిచయం అయిందని డబ్బు కోసం ఇలా చేస్తుందని అంటుంది. సీన్ లోకి శివకృష్ణ కూడా వస్తాడు. సీత ఇదంతా చేయించుంటుందని నిశ్చితార్థం ఆపాలని ప్రయత్నిస్తుందని అంటారు. సీత మీద నిందలు వేయొద్దని రామ్ అంటాడు.

గౌతమ్ లవర్ ఎంట్రీ..

సీత గురించి మహాలక్ష్మీ బ్యాచ్ మాట్లాడితే అర్చన, కిరణ్ వాళ్లు సీతని అనవసరంగా బ్యాడ్ చేస్తున్నారని అంటారు. సీతకి ఏం సంబంధం లేదని శివకృష్ణ అంటాడు. ఇక అక్కడే ఉన్న మిధునలా నటిస్తున్న సీత మొత్తం గమనిస్తూ ఉంటుంది. రేఖ తనకి సీత ఎవరో తెలీదు అని గౌతమ్ తప్ప తనకు ఎవరూ తెలీదని అంటుంది. మహాలక్ష్మీ రేఖతో నీకు ఎంత డబ్బు కావాలి అంటే అంత ఇస్తా అంటుంది. తను తప్పు చేయకపోతే తనకు డబ్బు ఇవ్వడం ఎందుకు అని అంటుంది  మిధున తనకు నిజం తెలియాలి అని పట్టు పడుతుంది. 

పెళ్లి తప్ప అన్నీ జరిగిపోయాయ్..

రేఖ గౌతమ్‌తో డబ్బున్న అమ్మాయి దొరికింది అని నన్ను మోసం చేస్తున్నావా మన మధ్య పెళ్లి తప్ప అన్నీ జరిగిపోయాయి అప్పుడే మర్చిపోయావా అని ప్రశ్నిస్తుంది. రేఖ సీత మనిషే అని అందుకే ఇలాంటి నిందలు వేస్తుందని మహాలక్ష్మీ అంటే నా భార్య కోసం తప్పుగా మాట్లాడొద్దు అని రామ్ అంటాడు. శివకృష్ణ అందరితో రేఖ చూపించిన ఫొటోలు వీడియోల ఆధారంగా గౌతమ్‌ని అరెస్ట్ చేసి గౌతమ్ నిజం తెలుసుకుంటామని చెప్తాడు. మహాలక్ష్మీ వద్దని అంటుంది. గౌతమ్‌ని అరెస్ట్‌ చేస్తేనే అసలు గౌతమ్ ఎవరు ఎక్కడి నుంచి వస్తాడో మొత్తం పుట్టు పుర్వోత్తరాలు తెలుసుకుంటామని అంటారు. గౌతమ్ గతం బయటకు రాకూడదని మహాలక్ష్మీ అనుకుంటుంది. రామ్ కూడా గౌతమ్‌ని అరెస్ట్ చేయమని అంటాడు. 

రేఖ, గౌతమ్‌లకు పెళ్లి చేస్తానన్న మహాలక్ష్మీ..

మహాలక్ష్మీ గౌతమ్‌ని రేఖతో రిలేషన్ ఉందని ఒప్పుకోమని లేదంటే అరెస్ట్ చేసి తీసుకెళ్తారని అప్పుడు మొత్తం బండారం బయట పడిపోతుందని చెప్తుంది. దాంతో గౌతమ్ అయిష్టంగానే రేఖతో సంబంధం ఉందని ఒప్పుకుంటాడు. రేఖని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని గౌతమ్ అంటే రామ్ గౌతమ్ అరెస్ట్ చేసి తీసుకెళ్లమని అంటాడు. మహాలక్ష్మీ గౌతమ్‌ రేఖని పెళ్లి చేసుకుంటాడని అంటుంది. నేను చేసుకోను అవసరం అయితే జైలుకి వెళ్తాను అంటే మహాలక్ష్మీ గౌతమ్‌ని కొట్టి రేఖని వాడు పెళ్లి చేసుకుంటాడని మాటిచ్చేస్తుంది.

మాకు టైం కావాలి..

మహాలక్ష్మీ రేఖతో మీ ఇద్దరికీ నేను పెళ్లి చేస్తా కానీ నాకు అప్పటి వరకు టైం కావాలి అంటుంది. శివకృష్ణ రేఖతో మహాలక్ష్మీ గారు మాటిస్తే అస్సలు తప్పరు అని చెప్పి రేఖని తీసుకెళ్లిపోతాడు. రేవతి, కిరణ్‌లు వెటకారంగా మాట్లాడి వెళ్లిపోతారు. ఆ అమ్మాయికి న్యాయం జరిగింది మరి నా జీవితం ఏంటి అని మిధున అడుగుతుంది. మిమల్ని ఊరికే వదలను అని చెప్పి వెళ్లిపోతుంది.  

గౌతమే నన్ను కిడ్నాప్ చేశాడు..

గౌతమ్ తనను కిడ్నాప్ చేశాడని సీత ముఖర్జీ వాళ్లకి చెప్తుంది. గౌతమ్ తన అత్తమ్మని చంపాడని అది రుజువు చేయాలని సీత అంటుంది. ఇక రామ్‌కి దగ్గరవ్వడానికి సీత ప్లాన్ చేస్తుంది. ఇక గౌతమ్ జరిగింది అంతా తలచుకొని శివకృష్ణ, సీతల అంతు చూడాలి అనుకుంటాడు. ఇక రౌడీలకు కాల్ చేస్తాడు. సీత గురించి అడుగుతాడు. లేదని సీత కొట్టి పారిపోయిందని రౌడీలు చెప్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: దేవా తెచ్చిన బట్టలు వేసుకొన్నసత్యమూర్తి.. తండ్రి సంతోషం దేవాలో మార్పు తీసుకొస్తుందా!