Seethe Ramudi Katnam Serial Today Episode గౌతమ్, మిధున నిశ్చితార్థం ఏర్పాట్లు మహాలక్ష్మీ ఇంట్లో ఘనంగా జరుగుతాయి. గౌతమ్ రెడీ అయి రావడంతో చలపతి చూసి బ్యాండ్ మేళం డ్రస్‌లో భలే ఉన్నావ్‌రా అని వెటకారం చేస్తాడు. డ్రస్ ఎక్కడో కొట్టుకొచ్చినట్లు ఉన్నాడు అని చలపతి రామ్‌తో గుసగుసలు ఆడితే రామ్ మెల్లగా పిన్ని షాపింగ్ చేసిందని అంటాడు. అందరూ మిధున ఫ్యామిలీ రాక కోసం ఎదురు చూస్తారు. గిరి అందరితో సీత ఏ క్షణం వచ్చి గొడవ చేస్తుందా అని అందరూ టెన్షన్ పడుతుంది. జనార్థన్ రామ్‌తో సీతకి కాల్ చేసి రావొద్దని చెప్పమని అంటాడు. దానికి రామ్ తను ముఖర్జీ తరఫున వస్తే మనం ఏం చేయలేం కదా అంటాడు. మహాలక్ష్మీ కూడా అదే అంటుంది. ఇక గౌతమ్ మహాలక్ష్మీని చాటుగా తీసుకెళ్లి సీత ఇక్కడికి రాదు అని చెప్తాడు. సీతని నా మనసులతో కిడ్నాప్ చేయించానని చెప్తాడు. మహాలక్ష్మీ రిలాక్స్ అయిపోతుంది. ఇక గౌతమ్ సీతని చూస్తావా అని అడిగి రౌడీకి కాల్ చేసి సీతకి తెలీకుండా సీతని చూపించమని అంటాడు. మహాలక్ష్మీ చూసి హ్యాపీగా ఫీలవుతుంది. సాయంత్రం వరకు సీత అక్కడే ఉండాలి అంటుంది. దానికి గౌతమ్ దాన్ని ఏం చేయాలో నేను చేస్తా అంటాడు.
ముఖర్జీ ఫ్యామిలీ సీత ఇంకా రాలేదేంటి అని షాక్ అవుతారు. సీత ఫోన్ కలవడం లేదని ముఖర్జీ వాళ్లు భయపడతారు. ఇక రేవతి, కిరణ్‌లు కూడా టెన్షన్ పడతారు. ఇంతలో ముఖర్జీ కిరణ్‌కి కాల్ చేసి సీత ఇంకా రాలేదని అంటాడు. మహాలక్ష్మీ ఏమైనా చేసుంటుందేమో అని రేవతి అంటే సీత మీ ఇంట్లో ఉంటే మహాలక్ష్మీ ఏం చేస్తుందని ఒక సారి మహాలక్ష్మీ ఇంటికి వెళ్లి సీత ఉందో లేదో తెలుసుకోమని అంటాడు. మిధున కోసం గౌతమ్ ఎదురు చూస్తూ ఉంటాడు. చలపతి, రామ్‌లు గౌతమ్‌ని చూసి కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు దొరికింది కదా అందుకే అలా అయిపోతున్నాడు అనుకుంటారు. పంతులు మహాలక్ష్మీకి ఆడ పెళ్లి వాళ్ల గురించి అడుగుతారు.
మహాలక్ష్మీ అర్చనతో సీత కిడ్నాప్ చేశాడని చెప్తుంది. ఇంతలో రేవతి, కిరణ్‌లు అక్కడికి వస్తారు. పిలవని పేరంటానికి వీళ్లు వచ్చారేంటి అని సెటైర్లు వేస్తారు మహాలక్ష్మీ వాళ్లు. రేవతి రామ్‌తో సీత ఇక్కడికి వచ్చిందా అని అడుగుతుంది. సీత కనిపించడం లేదని తన ఫోన్ నాట్ రీచ్ అవుతుందని అంటారు. కొత్త డ్రామా మొదలు పెట్టారా సీత కనిపించడంలేదని చెప్పి నిశ్చితార్థం ఆపాలి అని ప్రయత్నిస్తున్నారా అని అడుగుతుంది. సీత మీ ఇంట్లో మిస్ అయితే మా ఇంటికి వచ్చారేంటి వెళ్లి వెతుక్కోండి అని మహాలక్ష్మీ అంటుంది.
సీత ఈ ఇంటి కోడలు కాదు అని అర్చన అంటే దానికి రామ్ మేం విడిగా ఉన్నాం విడిపోలేదు అని అంటాడు. సీత మీద మర్డర్ కేసు ఉందని గిరి అంటే చలపతి కేసు ఇంకా క్లీయర్ అవ్వలేదు అంటాడు. ఇక గౌతమ్ సీత ఏమైపోతే మనకు ఎందుకు నా నిశ్చితార్థం అవుతుంది కదా అపశకునం ఎందుకు అంటాడు. నా భార్య అపశకునమా అని రామ్ అరుస్తాడు. దాంతో కిరణ్ సీతని మీరే కిడ్నాప్ చేసుంటారని అంటాడు. దాంతో జనార్థన్ కిరణ్ మీద అరుస్తాడు. వాళ్లని వెళ్లిపోమని అందరూ అంటారు. రామ్‌ని రేవతి కిరణ్‌లు పక్కకి తీసుకెళ్తారు. రామ్ తన మీద ఒట్టేసి సీత నిజంగా కనిపించడం లేదా అని అడుగుతాడు. రేవతి ఒట్టేసి చెప్తుంది. మహాలక్ష్మీ ఏమైనా చేసుంటుందని అని రేవతి అంటే ఆధారాలు లేకుండా మా పిన్నిని అనుమానించను అని అంటాడు.
ముఖర్జీకి రేవతి కాల్ చేసి జరిగింది చెప్తుంది. మహాలక్ష్మీ మీద కంప్లైంట్ ఇవ్వమని సుశీల భర్తతో చెప్తే మన లాగే మహాలక్ష్మీ కూడా పలుకుబడి ఉన్నది తన మీద ఆధారాలు లేకుండా ఏం చేయలేం అని అంటారు. ఇంతలో మహాలక్ష్మీ కాల్ చేసి టైం అవుతుంది ఇంకా రాలేదు అని అంటుంది. ప్రాబ్లమ్ ఏమైనా ఉందా అని అడుగుతుంది. ఏం లేదు అని ముఖర్జీ కవర్ చేస్తాడు. సీత ఏమైందని అనుకుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: "మీరంతా కలిసి నా భర్తకి ఈ పరిస్థితి తీసుకొచ్చారు.. జీవితంలో నీ ముఖం చూపించకు"