Seethe Ramudi Katnam Serial Today Episode మహాలక్ష్మీ వాళ్లంతా కింద కూర్చొని సీతకి ఎలా గౌతమ్ గురించి చెప్పాలా అనుకుంటారు. ఇంతలో సీత, రామ్ ఇద్దరూ పరుగులు పెడుతూ కిందకి వస్తారు. అందరూ చూస్తుండగానే రామ్, సీత ఇద్దరూ గోదారి గట్టు మీద రామ చిలుకవే అని డ్యాన్స్‌లు వేస్తారు. రామ్ సీతకు తెలీకుండా అంతా వీడియో తీయాలని చెట్టు దగ్గర ఫోన్ పెడతాడు. సీత వెళ్లిపోయిన తర్వాత ఆ వీడియో చూస్తూ ఆ మిధున సంగతి చెప్తానని అనుకుంటాడు.
మహాలక్ష్మీతో అర్చన, గిరిలు మనం ఒక పని మీద సీతని తీసుకొస్తే సీత రామ్‌లు కలిసిపోయేలా ఉన్నారు. ఇదే అవకాశంగా తీసుకొని సీత ఇక్కడే సెటిల్ అయిపోయేలా ఉందని చెప్తారు. వాళ్ల లవ్‌కి నేను రెడ్ లైట్ వేస్తానని మహా అంటుంది. రామ్ మిధున అలియాస్ సీతకే ఆ వీడియో పంపిస్తాడు. సీత ఆ వీడియో చూసి నవ్వుకుంటుంది. తర్వాత రామ్ మిధునకు కాల్ చేస్తాడు. వీడియో చూశావా అని అడుగుతాడు. వీడియో ఎలా ఉందని రామ్ అడిగితే మీ కంటే సీత చాలా బాగా డ్యాన్స్ చేసిందని మిధున అంటుంది. సీత మా ఇంట్లోనే ఉంది అని అంటాడు. నీ గదిలో లేదు కదా అని మిధున అంటే రామ్ నా మనసులో ఉందని అంటాడు. సీత నా సొంతం నన్ను సీతని ఎవరూ విడదీయలేరని రామ్ అంటాడు. రామ్ ఫోన్ పెట్టగానే సీత తెగ సంతోషపడిపోతుంది.
ఉదయం గౌతమ్ హాల్‌లో కూర్చొని ఏంటి మిధునకు కాల్ చేస్తుంటే స్విఛ్ ఆఫ్ వస్తుంది అని టెన్షన్ పడుతుంటాడు. ఇంతలో సీత వచ్చి ఎవరికి తెగ ఫోన్ చేస్తున్నావ్ అని అంటుంది. దాంతో గౌతమ్ తనకు కాబోయే భార్య అని మిధున గురించి చెప్తుంది. నువ్వో పెద్ద రోగ్‌వి నిన్ను ఎలా పెళ్లి చేసుకుంటుంది ఆ పట్నం పిల్ల అని సీత అంటుంది. దానికి గౌతమ్ నువ్వు ఓ వేస్ట్ సీతవి నిన్ను రామే దూరం పెట్టాడు అయినా నీలాంటి దాంతో ఎవడు కాపురం చేస్తాడు అని అంటాడు. ఇద్దరూ ఒకర్ని ఒకరు తిట్టుకుంటుంటే మహాలక్ష్మీ వాళ్లు వస్తారు. ఏమైందని అడిగితే ఇద్దరూ మహాకు కంప్లైంట్ ఇస్తారు. ఈ గొడవ పెద్దదైతే సీతని తీసుకొచ్చి వేస్ట్ అని మహాలక్ష్మీ అనుకుంటుంది. ఇద్దరూ కొట్టకుంటే మహా ఆపి గౌతమ్ని పంపేస్తుంది.
సీత సర్దిచెప్పాలని ప్రయత్నిస్తుంది. ఇంతలో కిరణ్, రేవతిలు ఇంటికి వస్తారు. మీరు ఎందుకు వచ్చారు అని మహా అడిగితే నా కోసం వచ్చారని సీత అంటుంది. మీరు సరిగా చూసుకుంటున్నారో లేదో అని వచ్చారని మహాలక్ష్మీ అంటుంది. దాంతో మహా కంగారు పడి వాళ్లతో మాట్లాడి పంపేయమని అంటుంది. మహా ప్లాన్‌తో తీసుకొచ్చిందని జాగ్రత్తలు చెప్తారు. చలపతి వచ్చి నాకు విషయం తెలుసు అని గౌతమ్ మిధునలకు పెళ్లి చేయాలి అనుకుంటున్నారని అందుకే నీతో గౌతమ్ మంచోడు అని చెప్పించడానికి పిలిచారని అంటాడు. మహాలక్ష్మీ, అర్చనలు మొత్తం వింటారు. సీత నోరెళ్ల బెడుతుంది. సీత ఇక గౌతమ్ గురించి మంచిగా చెప్పదని అర్చన అంటుంది.
మహాలక్ష్మీ సీతకి నిజం చెప్తానని చెప్పి పాలు వేడి చేస్తుంది. అర్చన తన చేయి కాల్చేస్తుందేమో అని కంగారు పడుతుంది. అయితే మహా ఆ పాలలో పౌడర్ కలుపుతుంది. అవి తాగితే మనం ఏం చెప్తే అది చేస్తుందని అంటుంది. సీత రాగానే మహాలక్ష్మీ పాలు ఇస్తుంది. సీత తాగేస్తుంది. ఓ పేపర్ మీద గౌతమ్ గురించి మంచిగా రాస్తుంది దాంతో సీతతో సంతకం పెట్టిస్తానని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: "అత్యాచారయత్నం కేసులో సీఎం అరెస్ట్.. పదవికి రాజీనామా"!