Seethe Ramudi Katnam Today Episode:  ముంబయిలో సరిగి తినలేదు అని తనకు ఇష్టమైన ఫుడ్ వండించుకుంటే సీత తినకుండా చేసిందని మహా తన బ్యాచ్‌తో చెప్తుంది. ఇంతలో ప్రీతి బయట నుంచి ఆర్డర్ చేసుకుందా అని అంటుంది. సీత వచ్చి గేటు దగ్గర వెయిట్ చేసి డెలివరీ బాయ్‌ని వెనక్కి పంపేస్తాను అని లేదంటే లోపలికి రానిచ్చి మీరు దొంగచాటుగా ఫుడ్ తెప్పించుకున్నారు అని మా అక్కకి చెప్తాను అని అప్పుడు మీరు ఆడిన నాటకాలు అన్నీ మా అక్కకి తెలుస్తాయి అని అంటుంది.  


మహాలక్ష్మి: మేం నాటకాలు ఆడటం ఏంటే నువ్వే అన్నీ నాటకాలు ఆడుతున్నావ్. 
అర్చన: నువ్వు చేసిన పనికి ఒళ్లు మండిపోతుంది.  
జనార్దన్: మమల్ని పస్తులు ఉంచితే మీ అక్క నీ మాట వింటుంది అనుకోకు.
సీత: మా అక్క నా మాట వింటుందో లేదో పక్కన పెడితే మా అక్క మా అమ్మానాన్నలతో వెళ్లకుండా ఆపారు. అందుకు ఈ శిక్ష మీకు పడాలి.
మహాలక్ష్మి: మధుకి మా పై మరింత నమ్మకం, ప్రేమ పెరిగింది అది చాలు..  
సీత: మా అక్కకు మీ గురించి నిజం తెలిస్తే అప్పుడు మీకు ఉంటుంది. ఇక సీత రామ్, మధు వాళ్ల దగ్గరకు వచ్చి అక్క కోసం లోపల భజన చేస్తున్నారు అని చెప్తుంది. మధు మహా వాళ్లు తన కోసం చాలా చేస్తున్నారు అని వాళ్ల రుణం తీర్చుకోలేనని అంటుంది. ఇక రామ్ వెళ్లిపోయిన తర్వాత చలపతి, రేవతిలకు జరిగింది చెప్తుంది సీత. 


మరోవైపు సీత మాటలు తలచుకొని మహాలక్ష్మి చిరాకు పడుతుంది. ఆఫ్ట్రాల్ సీత ఎంత తన బతుకు ఎంత అని అనుకుంటుంది. ఇంతలో మహాకు తన అంతరాత్మ నవ్వుతూ కనపడుతుంది. 


మహా అంతరాత్మ: నువ్వు ఆఫ్ట్రాల్ అన్న సీత నీ చెంప పగలగొట్టిన సీత నీ కోడలిగా నీ ఇంట్లో అడుగుపెట్టింది. రామ్ ఆస్తి నువ్వు రాయించుకోవాలి అనుకుంటే ఆ పేపర్స్ చింపేసింది. రామ్ గదిలో నుంచి నువ్వు సీతని బయటకు పంపిస్తే తను మళ్లీ ఆ గదిలోకే వెళ్లింది. ఇప్పుడు నిన్ను పస్తులు పెట్టింది. వంద గుడ్లను తిన్ని రాబందు ఒక్క గాలి వానకు చచ్చింది అన్నట్లు ఉంది నీ పరిస్థితి. ఇన్నాళ్లు నీ రాజ్యంలో నీకు తిరుగు  లేదు అన్నట్లు బతికావ్. ఇప్పుడు నీ తలరాతే మారింది. నిన్ను ఢీ కొట్టే సీత నీకు ఎదురు పడిండి. నువ్వేం చేసినా నీకు తిరగబడుతుంది. నీకు ఓటమి తప్పదు నీ ఆధిపత్యం అన్నీ తుడుచుకుపోతాయి. 
మహాలక్ష్మి: ఆపు .. ఆ పరిస్థితే వస్తే సీతని చంపేస్తా..
మహాఅంతరాత్మ: ఇక నీ పని అయిపోయింది. సీత చేతిలో నీకు ఓటమి ఉంది. 
మహాలక్ష్మి: నా ఆత్మ నన్నే వెక్కిరిస్తుందా.. నేను తలచుకుంటే ఆ సీత ఎంత. ఒకప్పుడు ఈ ఇంటి యజమానురాలు నా స్నేహితురాలు అయిన సుమతినే నమ్మించి చంపేశా.. నేను ప్రమాదం అని తెలియక సుమతి నాతో ప్రయాణం చేసింది. 


ఫ్లాష్‌బ్యాక్..


కారులో వెళ్తున్న సుమతి.. రోడ్డుమీద నడుచుకొని వెళ్తున్న మహాలక్ష్మిని కలుస్తుంది. ఏం చేస్తున్నావ్ అని సుమతి మహాను అడిగితే బిజినెస్‌లో లాస్ వచ్చి తల్లిదండ్రులు చనిపోయారు అని ఇళ్లు అప్పుల వాళ్లు తీసుకున్నారు అని దిక్కలేని దానిలా రోడ్డున పడ్డాను అని చెప్తుంది. ఇక తనకి పెళ్లి అయిందని ఇద్దరు పిల్లలని తన భర్త పెద్ద బిజినెస్ మాన్ అని సుమతి చెప్తుంది. ఇక మహాని తన ఇంటికి తీసుకెళ్తుంది. 
మహాలక్ష్మి: ఇళ్లు.. సౌందర్యం చూసి.. మనసులో.. కాలేజ్‌లో అన్నింట్లో నా కంటే తక్కువగా ఉన్న సుమతికి ఇంత వైభోగమా.. ఇది నక్క తోక తొక్కినట్లు ఉంది. నువ్వు ఇంత పెద్ద ఇంటికి కోడలివి అయినందుకు సంతోషంగా ఉంది సుమతి.
సుమతి: నేను ఈ ఇంటి కోడలిని కాదు ఆడపడచుని కాదు. ఈ ఇంటి యజమానురాలిని. 
మహాలక్ష్మి: ఒకప్పుడు పనికి మాలిన దానిలా ఉండేది ఇప్పుడు యజమానురాలు అయిందా.. 


ప్రస్తుతం


మహాలక్ష్మి: ఈ ఇంట్లో అలా అడుగుపెట్టాను. ఆ క్షణం నాకు అనిపించింది ఇది నాది అని. ఇక్కడ ఉండాల్సింది నేను అని సుమతి కాదు అని అలా అనిపించిన తర్వాత నా టాలెంట్ చూపించా.. 


సుమతి తన భర్త జనార్ధన్‌కి మహాకి పరిచయం చేస్తుంది. సుమతి మహా పరిస్థితి భర్తకు చెప్తుంది. ఇక తనకి మేం ఉన్నామని ఈ ఇళ్లు నీదే అనుకో అని సుమతి మహాతో చెప్తుంది దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: కృష్ణ ముకుంద మురారి సీరియల్: ఆదర్శ్‌ - సంగీతల పెళ్లి గురించి భవానితో మాట్లాడిన ముకుంద.. గిఫ్ట్ ఇచ్చి సర్‌ఫ్రైజ్ చేసిన కృష్ణ!