Satyabhama Today Episode :సత్య తన అన్నయ్య హర్షతో హనీమూన్ గురించి మాట్లాడుతుంది. హర్ష తన తలనొప్పులు తాను పడతానని తన గురించి వదిలేయ్ మని సత్యతో చెప్తాడు. సత్య అలా కుదరదు అని అంటుంది. పెళ్లి విషయంలో తనని ఎందుకు వదిలేయలేదని నందినిని ఇచ్చి పెళ్లి చేయమని ఎందుకు పట్టుపట్టావని అడుగుతుంది.


సత్య: అన్నయ్య నువ్వు నందిని విషయంలో బాధ్యతగా ఉంటాను అని మాట ఇచ్చావు. బాధ్యత అంటే ఇదేనా. 


హర్ష: తను నన్ను వద్దు అనుకుంటుంది. నేనేం చేయను.


సత్య: బాధ్యత అంటే ఓపిక ఉండాలి. కావాలి అనుకున్నప్పుడు దొరికే వరకు వేచి ఉండాలి. తనకు ఇష్టం లేకుండా నందిని నిన్ను పెళ్లి చేసుకుంది. ఆ విషయంలో ఇప్పటికీ తన మనసుకు నచ్చచెప్పుకోలేకపోతుంది. ఇలాంటప్పుడు నువ్వు తనకి అండగా ఉండాల్సింది పోయి ఇగోకి పోతే ఎలా. జీవితాంతం కలిసి ఉండాల్సిన మనిషితో నువ్వు ప్రవర్తించే పద్ధతి ఇదేనా. 


హర్ష: తను ఇక్కడ ఇప్పుడు తప్పని పరిస్థితిలో తన వంచినా అక్కడికి వెళ్లాక నా ప్రాణం తోడేస్తుంది. భరించాల్సింది నేను. అది సరే మరి నువ్వు బావగారు ముందు ఎందుకు హనీమూన్‌కి వద్దు అన్నారు. ఎందుకు మొండికేస్తున్నారు. 


సత్య: ఎందుకు ఆ అనుమానం మేం మనస్ఫూర్తిగానే వస్తున్నాం. ఏదో ఆ టైంకి వద్దు అనిపించింది. ముందు నో అన్నాను. ఇప్పుడు సంతోషంగా వస్తున్నాను. అన్నయ్య నువ్వు వదినా ఇద్దరినీ ఒక్కర్ని ఒకరు అర్థం చేసుకొని సంతోషంగా ఉండాలి. ఈ హనీమూన్ అందుకు అవకాశం కల్పిస్తుంది. అంతా నీ చేతుల్లోనే ఉంది. పక్కనే ఉంటూ మా వంతు ప్రయత్నం మేం చేస్తాం. నువ్వు హనీమూన్‌కి బయల్దేరాల్సిందే తప్పదు.  


క్రిష్ బెదిరించడంతో ట్రావెలర్ మహదేవయ్యకు కాల్ చేసి తప్పని సరి పరిస్థితుల్లో టికెట్లు క్యాన్సిల్ చేసేశాను అని చెప్తాడు. మహదేవయ్య అతన్ని చంపేస్తా అని ఫోన్‌లో బెదిరిస్తాడు. రోడ్డు బ్లాక్ అయిందని చెప్తాడు. 


మహదేవయ్య: ఇంత కష్టపడి పిల్లల హనీమూన్‌కి ప్లాన్ చేస్తే ఇట్లా అయిందేంటి ఇప్పుడేం చేయాలి. చక్రవర్తికి కాల్ చేస్తా. నీ రిసార్ట్ ఎట్లా పని చేస్తుంది. నువ్వు నాకు ఓ పని చేసి పెట్టాలిరా. 


చక్రవర్తి: చెప్పు అన్నయ్య నువ్వేం చెప్పినా చేస్తా.


మహదేవయ్య: అది హనీమూన్‌కి ఏర్పాట్లు చేయాలిరా. చిన్నా నందినిలకు పెళ్లిళ్లు అయ్యాయిరా. ఇద్దరూ తమ వాళ్లతో సరిగా కాపురం చేయడం లేదురా. అంటూ మొత్తం చెప్తాడు. అందుకే బలవంతంగా అయినా ఈ హనీమూన్ జరిపించాలి అనుకుంటున్నానురా.


చక్రవర్తి: మంచి నిర్ణయం తీసుకున్నావ్ అన్నయ్య. మన రిసార్ట్‌కి పంపించు అన్నీ నేను చూసుకుంటా.


మహదేవయ్య: చక్రి వాళ్ల మనసులు కలిసి దగ్గర అయ్యేలా చూడురా.


చక్రి: ఆ బాధ్యత నాది అన్నయ్య. కచ్చితంగా నువ్వు తాతయ్యవి అవుతావ్. 


క్రిష్: సత్య బ్యాగ్ సర్దుతుంటే.. ఓహో.. సీరియస్‌గా బ్యాగ్ సర్దుతున్నావ్. ఏడికి పోతున్నావ్.


సత్య: హనీమూన్‌కి..


క్రిష్: ఎవరితో..


సత్య: నీతోనే.. 


క్రిష్: ఒట్టేసి చెప్పు. అంటే నీ మనసు మార్చుకొని నాతో హనీమూన్‌కి బయల్దేరుతున్నావు అంటే చిన్న ముచ్చటనా.. పండగ పండగ చేసుకోవాలి. అరే గుర్తొచ్చింది అన్నీంటికంటే ముందు ఓ పని చేయాలి. ఆ బొండం లాయర్‌కి కాల్ చేయాలి.  మన విడాకుల అగ్రిమెంట్ చింపి ముక్కలు చేయమని చెప్పాలి. 


సత్య: హలో మాస్టారు అంత సీన్ లేదు. నేను మన కోసం రావడం లేదు. కేవలం మా అన్నయ్య కాపురం నిలబెట్టాలి అనే వస్తున్నా. 


క్రిష్: ఒక్క ముక్క అర్థం కాలేదు. మీ అన్నయ్య కాపురం నిలబెట్టడం ఏంటి.


సత్య: అంతా నీ పుణ్యమే కదా. మా అన్నయ్య కుండమార్పిడి పెళ్లి చేసుకున్నాడు. నువ్వు నాకు నరకం చూపిస్తుంటే అక్కడ మీ చెల్లి కూడా మా అన్నయ్యకు నరకం చూపిస్తుంది. దగ్గర అవ్వకుండా ఏడిపిస్తుంది.


క్రిష్: అదా ముచ్చట. నీకు నీ అన్న బాధ అర్ధమైంది కానీ నా మాట అర్థం కాలేదు. మీ అన్నని చూస్తే జాలేస్తుంది కానీ నన్ను చూస్తే జాలి వేయడం లేదా. ఎవరన్నారో కానీ మస్త్ రీసెర్చ్ చేసి కనిపెట్టారు. మొగుడు తప్పు చేసినా మొగుడిదే తప్పు. పెళ్లాం తప్పు చేసినా మొగుడుదే తప్పు. ఏం ఆడోలురా నాయనా..  


సత్య: చూడు ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది నీ గురించో నా గురించో కాదు కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న నీ చెల్లి కాపురం గురించి. మనం వాళ్లని దగ్గర చేయాలి. కలవడానికి దగ్గర అవ్వడానికి మా అన్నయ్య సిద్ధంగా ఉన్నాడు. మీ చెల్లినే మార్చాలి. నన్ను ఏడిపించడానికే నువ్వు డిసైడ్ అయితే మనం హనీమూన్‌కి వెళ్లొద్దు మానేద్దాం. 


క్రిష్: నువ్వు అనుకున్నట్లు నేను రాక్షసుడిని కాదు. నా చెల్లి కాపురం కూలిపోతే నేను చూస్తూ ఉండలేను. 


ఇంతలో రేణుక సత్య గదిలోకి వస్తుంది. హనీమూన్‌ కోసం తొందరగా రెడీ అయి రమ్మన్నారు అని చెప్తుంది. ఇక నందిని చిరాకుగా ఉంటే భైరవి పాలు తీసుకొని వస్తుంది. క్రిష్, సత్యల ఫస్ట్ నైట్ కోసం ఎందుకు చెప్పావని తిడుతుంది. హనీమూన్‌కి వెళ్లడం ఇష్టం లేదని అక్కడ వాడు తన జోలికి వస్తే ఏంటని అంటుంది. ఫోన్‌లో అన్నీ చెప్తుంటా ఏం కాదు అని భైరవి ధైర్యం చెప్తుంది.  


సత్య, క్రిష్‌లు బట్టల బ్యాగుతో బయటకు వస్తారు. మహదేవయ్య తన తల్లి ఆశీర్వాదం తీసుకోమని చెప్తాడు. నందిని, హర్ష కూడా బామ్మ ఆశీర్వాదం తీసుకుంటారు. నందిని కస్సుబుస్సులాడుతుంది. ఇక రెండు జంటలు హనీమూన్‌కి బయల్దేరుతాయి. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.  


Also Read: కృష్ణ ముకుంద మురారి సీరియల్ : కృష్ణ, మురారిల కొంప ముంచేసిన ముకుంద.. నిజంగానే గర్భం తీయించుకుందా? ఆదర్శ్‌తో పెళ్లి కోసమే ఈ నాటకమా?