Satyabhama Today Episode లాయర్ ధనుంజయ్‌ని మహదేవయ్య రౌడీలు చంపేయాలని ప్రయత్నిస్తే ముసుగు వేసుకొని క్రిష్ వచ్చి రౌడీలను చితక్కొడతాడు. ఇక ధనుంజయ్ థ్యాంక్స్ చెప్తే క్రిష్ అవసరం లేదు అనేస్తాడు. ఎవరు నువ్వు ముఖం చూపించని ధనుంజయ్ అంటే టైం వచ్చినప్పుడు చూపిస్తా ఇప్పుడు వెళ్లి కేసు గెలువు అని అంటాడు. ఇక ధనుంజయ్ వెళ్లిపోతాడు. క్రిష్ ముసుగు తీసి సత్య నువ్వు నన్ను అసహ్యించుకున్నా నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. నీ వెనకే ఉండి నిన్ను గెలిపించడానికే ప్రయత్నిస్తాను. 
 
కోర్ట్ సీన్ ప్రారంభమవుతుంది. విశ్వనాథాన్ని బోనులో నిల్చొపెట్టి పీపీ లాయర్ విశ్వనాథానికి శిక్ష పడాలని అంటాడు. ఇక ధనుంజయ్ లాయర్ ముద్దాయిని హంతకుడు అని అనడం కరెక్ట్ కాదు అని అంటాడు. ఓ మనిషిని హంతకుడు అని చెప్పడం ఎంత తప్పో నిర్దోశికి శిక్ష పడటం కూడా తప్పని అంటాడు. 


ధనుంజయ్: కాళీ ఓ రౌడీషీటర్ ఆడపిల్లల వెంటపడటం ఏడిపించడం అతని ప్రవృత్తి. నా క్లైంట్‌ని కాళీ ఎంతలా వేధించాడో ఎంత మంది ఆడపిల్లల్నిఇబ్బంది పెట్టాడు. చాలా సార్లు జైలుకి వెళ్లాడు. శారీరకంగా చంపడమే హత్య కాదు యువరానర్. మానసికంగా చంపడం కూడా హత్యనే. ఏ ఆడపిల్లకైనా ప్రాణం కంటే ముఖ్యమైనది పరువు, మానం దాన్ని వీక్ పాయింట్ గా తీసుకొని కాళీ లాంటి రాక్షసులు ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటారు. బయట పడి ఎదురిస్తే మళ్లీ రెచ్చిపోతారు. కాళీ విషయంలో కూడా అదే జరిగింది. కాళీ విషయంలో తన వల్ల పొరపాటు జరిగిందని లొంగిపోయారు. కాళీ హర్ష మీద దాడి చేయడంతో తండ్రి ఆపడానికి వెళ్లిన టైంలో ఇలా జరిగిందని అంటాడు.


ఇక హర్ష వచ్చి జరిగిందంతా చెప్తాడు. ఇక కాళీ నిజంగానే ఇలా ప్రర్తించుంటాడని కోర్టు నమ్ముతుందని అంటారు. అయితే ఆ సంఘటన చూసిన ప్రత్యక్ష సాక్షి ఎవరైనా ఉన్నారా అని అడుగుతారు. దాంతో ధనుంజయ్ జడ్జికి గడువు అడుగుతారు. ఇక ధనుంజయ్ జడ్జి చెప్పినట్లు ఎవరైనా ప్రత్యక్ష సాక్షి ఉంటే మీ నాన్న బయటకు వచ్చినట్లే అని అంటారు. దొంగ సాక్ష్యం చెప్దామని సంధ్య అడిగితే ధనుంజయ్ ఒప్పుకోడు. ఇక విశ్వనాథం వస్తే సత్య, సంధ్యలు ఎమోషనల్ అవుతారు. విశ్వనాథం లాయర్ ధనుంజయ్‌తో మీరు కేసు ఓడిపోతారని అంటాడు. ఇక ప్రత్యక్ష సాక్షి దొరకకపోతే కష్టమని లాయర్ అంటాడు. 


మహదేవయ్య లాయర్‌ని చంపలేకపొయినందుకు కొడుకుని తిడతాడు. ఎవరో ముఖం కనిపించకుండా వచ్చి కొట్టాడని అంటాడు. ఇక మహదేవయ్య ఎవరో తెలిసినోడినే ఇలా చేశాడని మహదేవయ్య రగిలిపోతాడు. ఇక ప్రొఫెసర్‌ని వదల్లేదని ప్రత్యక్ష సాక్షి కావాలని అంటాడు. దాంతో మహదేవయ్య విశ్వనాథానికి శిక్షి ఖాయం అని తాను ఎమ్మెల్యే అవ్వడం ఖాయమని అంటాడు. మరోవైపు సత్య ఇంటికి వచ్చి ఏడుస్తుంటుంది. ఏమైందని క్రిష్ అడిగితే జరిగింది సత్య  చెప్తుంది. ప్రత్యక్ష సాక్షి గురించి చెప్తుంది. సత్య ఏడుస్తుంటే క్రిష్ ఓదార్చుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.


Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: మిత్రకు బురిడీ కొట్టించిన సంయుక్త.. మిత్ర నోట లక్ష్మీ మాట!