Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: మిత్రకు బురిడీ కొట్టించిన సంయుక్త.. మిత్ర నోట లక్ష్మీ మాట!

chiranjeevi lakshmi sowbhagyavathi today episode సంయుక్తని కలవడానికి అర్జున్‌తో మిత్ర పోటీ పడటం మిత్రను బురిడీ కొట్టించి సంయుక్త అర్జున్‌ని కలవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Continues below advertisement

chiranjeevi lakshmi sowbhagyavathi serial today episode: మిత్ర, అర్జున్ ఇద్దరూ సంయుక్తని కలవడానికి జేఎమ్మార్ ఆఫీస్‌కి వస్తారు. మిత్ర అర్జున్‌ని చూసి ఇరిటేటింగ్‌గా ఫీలవుతాడు. జాను రావడంతో ఫస్ట్ అపాయింట్ మెంట్ తనదే అని తానే మొదట సంయుక్తని కలుస్తానని అంటాడు. అంతా నేను చూసుకుంటానని జాను చెప్పి లోపలికి వెళ్తుంది. 

Continues below advertisement

జాను: అక్క పెద్ద చిక్కు వచ్చి పడింది. బయట అర్జున్‌గారు, బావ గారు ఇద్దరూ ఉన్నారు. కానీ అర్జున్ గారి కంటే ముందు బావగారినే లోపలికి పంపించమని బావగారి డిమాండ్. ఎందుకైనా మంచిది ముందు బావగారినే పంపించేస్తాను.
సంయుక్త: ఆగు జాను అపాయింట్ మెంట్ ఎవరిది. ఎవరు ముందు తీసుకున్నారు.
జాను: అర్జున్‌గారే తీసుకున్నారు కానీ ఆయన అర్థం చేసుకుంటారు. అందువల్ల బావగారు ముందు పంపిస్తాను. 
సంయుక్త: అందరూ ఇదే తప్పు చేస్తున్నారు జాను. అర్థం చేసుకుంటారని అందరి లాగే మనం తప్పు చేస్తే ఎలా. అర్జున్ గారిని ముందు పిలిస్తే మిత్ర గారికి కోపం వస్తుంది. మిత్ర గారిని ముందు పిలిస్తే మనమే అర్జున్‌గారికి అవమానించినట్లు ఉంటుంది. ఏం చేద్దాం ఇప్పుడు.

జాను తన దగ్గర ఓ ఐడియా ఉందని వెంటనే వివేక్‌కి కాల్ చేసి మిత్రకు కాల్ చేయమని ఐడియా చెప్తుంది. మిత్రకు వివేక్ కాల్ చేసి సిగ్నల్ లేనట్లు మాట్లాడుతాడు. ఇక జాను వచ్చి అక్కడ సిగ్నల్ ఉండదని దూరం వెళ్లమని అంటుంది. దాంతో మిత్ర వెళ్తాడు. ఈలోపు అర్జున్‌ని జాను లోపలికి పంపిస్తుంది. ఇక మిత్ర వివేక్కి ఎందుకు కాల్ చేశావ్ అంటే సరదాగా కాల్ చేశానని అంటాడు. దాంతో మిత్ర ఫోన్ పెట్టేసి వెళ్లే సరికి అర్జున్ ఉండదు. దాంతో మిత్రకు హర్ట్ అయిపోతాడు. ఇంతలో జాను వచ్చి మేడం పిలిచారు అని మిమల్ని పిలవడానికి వచ్చాను. టైం వేస్ట్ ఎందుకని మేడం అంటే అర్జున్‌ని పంపానని అంటుంది. ఇక సంయుక్త అర్జున్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటారు. ప్లానింగ్ చేయమని అంతా ఓకే అయితే అర్జున్‌కే ప్రాజెక్ట్ ఇస్తానని సంయుక్త అంటుంది. దాంతో అర్జున్ మిత్రని గెలిపించమని మిత్రకు ప్రాజెక్ట్ ఇవ్వమని అంటాడు. దాంతో సంయుక్త అలా చేస్తే నేను ఓడిపోతానని జేఎమ్మార్ గారు తన మీద నమ్మకంతో ప్రాజెక్ట్ ఇచ్చారని దాన్ని నేను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎవరు అర్హులైతే వాళ్లకే ఇస్తానని అంటుంది. 

అర్జున్‌ తర్వాత మిత్ర సంయుక్త దగ్గరకు వెళ్తాడు. వెళ్లడం వెళ్లడం మిత్ర సంయుక్తతో కోపంగా ముందు అర్జున్‌ని ఎందుకు పిలిచారు. వాడి ముందు నేను అవమానపడాల్సి వచ్చింది. నాకు ఇదేం నచ్చలేదు లక్ష్మీ అని అంటాడు. సంయుక్త అలియాస్ లక్ష్మీ చాలా సంతోషిస్తుంది. ఇంతలో తేరుకొని నేను సంయుక్తని మీ భార్యని కాదు అని ఇక ఇది మీ ఇళ్లు కాదు అని నా మీద అరవొద్దని అంటుంది. లక్ష్మీ మిత్రకు చిన్నగా క్లాస్ ఇస్తుంది. తర్వాత మిత్రకు ప్రాజెక్ట్ గురించి చెప్పమని అంటుంది. మిత్ర ప్రాజెక్ట్ గురించి చెప్తుంటే లక్ష్మీ మిత్రనే చూస్తూ మైమరిచిపోతుంది. 

మరోవైపు దేవయాని పెళ్లి కార్డులు అరవింద, జయదేవ్ ముందు పెట్టి నాలుగు రోజుల్లో పెళ్లి అని అయినా మీరు పట్టించుకోవడం లేదని అంటుంది. ఏవో పనుల్లో పడి పట్టించుకోలేదని జయదేవ్ అంటే సొంత కొడుకు కాదు కాబట్టి పట్టించుకోవడం లేదని అంటుంది. ఇక అరవింద తమకు బాధ్యతలు అప్పగించలేదని కేవలం పెద్దల్లాగే ఉండమని చెప్పావని అంటుంది. ఇకనుంచి ప్రతీది మీ ఇద్దరి చేతులు మీదనే జరగాలి అని దేవయాని అంటే టైం తక్కువ ఉంది కాబట్టి కేవలం పెద్దల్లాగే ఉంటామని జయదేవ్ అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

Also Read: సత్యభామ సీరియల్: ప్రేమతో కన్నీళ్లు పెట్టించేసిన సత్య, క్రిష్‌లు.. ముసుగులో వచ్చి ధనుంజయ్‌కి అండగా నిలిచిన క్రిష్!

Continues below advertisement