Satyabhama Today Episode లాయర్ ధనుంజయ్ సత్య వాళ్లని వెళ్లిపోమని చెప్పడంతో సత్య వాళ్లు బయటకు వస్తారు. మామయ్య డైరెక్ట్‌గా ఇన్ డైరెక్ట్‌గా అడ్డుకుంటున్నారని సత్య అంటుంది. ఇక క్రిష్ తాను మహదేవయ్య కొడుకు అయితే లాయర్‌కి ఏంటి సమస్య కేసు ఎందుకు తీసుకోలేదని అంటాడు. ఇంతలో సంధ్య వచ్చి లాయర్ ధనుంజయ్‌తో మాట్లాడితే ఆయన కేసు ఒప్పుకున్నారని చెప్తుంది. అందరూ సంతోషిస్తారు. ఇక క్రిష్‌ లాయర్‌ని నిలదీస్తానని క్రిష్ వెళ్లబోతే సత్య క్రిష్‌ని ఒప్పిస్తుంది.


హర్ష: బావ ఒక రిక్వెస్ట్ మీరు ఈసారి నుంచి లాయర్ దగ్గరకు రావొద్దు. మిమల్ని చూస్తే ఆయన చిరాకు పడతాడు.
క్రిష్: ఏంటి సత్య ఇది మీ ఫ్యామిలీ మొత్తం ఇంతేనా. నేను మా బాపుని ఎదురించి మిమల్ని సపోర్ట్ చేస్తే మీరు ఇలా చేస్తారా. మా బాపు వద్దన్నా నేను నీకోసం వచ్చాను కదా అయినా మీరు నాకు ఇచ్చే మర్యాద ఇదేనా. 


క్రిష్‌, హర్షలు గొడవపడబోతే సంధ్య హర్షని ఆపుతుంది. బావగారు మనతో పాటు సమానంగా కష్టపడుతున్నారని అంటుంది. దానికి క్రిష్ మీ ఇంట్లో అందరూ నన్ను అపార్థం చేసుకోవడం కామనే సంధ్య ఏదో రోజు మీరే అర్థం చేసుకుంటారని అంటాడు. సత్య కూడా అపార్థం చేసుకొని తర్వాత అర్థం చేసుకుందని అంటాడు. ఇక హర్ష సత్యకి సారీ చెప్తాడు. లేట్ అయిందని ఇంటికి వెళ్దామని క్రిష్ సత్యని తీసుకెళ్తాడు. ఇంట్లో మహదేవయ్య కోపంగా కూర్చొని ఉంటాడు. పార్టీ ప్రెసిడెంట్ మాటలు తలచుకొని రగిలిపోతాడు.  ఇంతలో సత్య క్రిష్‌లు వస్తే కోపంగా చూస్తాడు. క్రిష్‌ సత్యని లోపలికి వెళ్లిపోమంటే ఆగు అని మహదేవయ్య గట్టిగా అరుస్తాడు. తేల్చుకోవాల్సినవి చాలా ఉన్నాయని అరుస్తాడు.


మహదేవయ్య: నువ్వు ఒక వేస్ట్ గాడివిరా. పెళ్లాం కొంగు పట్టుకొని తిరిగేవాడివి. నీతో నాకు మాటలు ఏంటిరా. పోరా పోయి చీరకట్టుకొని మూల కూర్చొ.
సత్య: మామయ్య జరిగిన దాంట్లో క్రిష్ తప్పు ఏం లేదు తనని ఏం అనొద్దు.
మహదేవయ్య: అబ్బబ్బా ఎంత అన్యోన్యమైన జంటరా. ఒకరి మీద ఒకరు ఈగ కూడా వాలనిచ్చేలా లేరురా. కథలు చెప్పకురి. ఒళ్లు మండిపోతుంది. పార్టీ ప్రెసిడెంట్ వస్తాడని చెప్పా అయినా లెక్క చేయలే. చేతకానివాడిని చేసేశావ్. రెండో సారి నన్ను వెధవని చేశావ్. నన్ను పిచ్చోడిలా చూశాడు. ఇంత చేతకాని వాడివా అని నవ్వాడు. ఇంతలో అడ్డు వచ్చిన భార్య భైరవిని తోసేస్తాడు. నా పరువు పోయిందని అంటాడు. రేయ్ నీకు నీ పెళ్లాం పెళ్లాం బాధ తప్పితే మరేం అవసరం లేదు.
క్రిష్: బాపు
మహదేవయ్య: నన్ను ఇంక బాపు అని పిలవకు. చచ్చిపోయాడు అనుకో. కాదు చంపేశావ్ రా. 
సత్య: మామయ్య మీకు చెప్పకుండా వెళ్లిపోవడం తప్పే కానీ ఏం చేస్తాను పరిస్థితి అలాంటిది. మా నాన్నని కాపాడుకోవాలి.
మహదేవయ్య: అంటే మీ నాన్నని కాపాడుకోవడానికి నా పరువు పోగొడతావా. చిన్న కోడలు చదువుకున్న కోడలు తెలివైన కోడలు అని నెత్తిన ఎక్కించుకున్నా.
క్రిష్: సత్య ఎలాంటి పరిస్థితుల్లో వెళ్తుందో మీకు తెలుసు. సాయం చేయకపోయినా అడ్డుకోవద్దు బాపు.
మహదేవయ్య: శభాష్‌రా కొడకా, ఏడాది కూడా కానీ బంధం కోసం  28 ఏళ్ల బంధాన్ని ఎదురిస్తున్నావ్. ఏయ్ నీ చిన్న కొడుకికి చెప్పు వాడితో నాకు ఇక మాటల్లేవు. ఏయ్ మీ అయ్యని కాపాడు కోవడానికే కదా ఇలా చేశావ్ ఇప్పుడు అందరి ముందు చెప్తున్నా మీ అయ్యని ఎలా కాపాడుకుంటావో చూస్తాను. ఈ మహదేవయ్య తలకాయ అంటే ఏంటో చూపిస్తా.  


హర్ష, సంధ్యల ఇంటికి వస్తారు. హర్ష తల్లి చాటుకి వెళ్లి భార్యకి థ్యాంక్స్ చెప్తాడు. థ్యాంక్స్ చెప్పడానికి అమ్మ చాటుకి ఎందుకు అని సంధ్య అడిగితే మీ వదిన చేతిలో ఏముంటే  అవి  విసిరేస్తుందని అంటాడు. ఇక ఇంట్లో వాళ్ల ముందు భార్య సలహా పనిచేసిందని థ్యాంక్స్ చెప్తాడు. నందిని కూడా సంతోషంగా లోపలికి వెళ్లిపోతుంది. ఇక కేసు గురించి మొత్తం చెప్పాకానీ కిడ్నాప్ గురించి చెప్పలేదని అంటుంది. మరోవైపు సత్య క్రిష్‌లు బయట మాట్లాడుకుంటారు. కష్టంలో ఉన్న నాన్నని కాపాడుకోవాలి అనుకోవడం తప్పా అని సత్య క్రిష్‌ని అడుగుతుంది. క్రిష్‌ తండ్రి వైపు మాట్లాడుతాడు. లాయర్తో నేను మాట్లాడుతా నేను చూసుకుంటా అని చెప్తే నువ్వు ఎందుకు వచ్చావ్ అని క్రిష్‌ అంటాడు. మీ తండ్రి అడ్డుకుంటే నీకు ఎవరు సపోర్ట్ చేస్తారని నువ్వు మీ నాన్నకి శత్రువు అవుతున్నావని సత్య అంటే నా చావు నేను చస్తా కానీ నిన్ను ఎవరు ఎమన్నా తట్టుకోలేనని అంటాడు. మీ ఇంట్లో వాళ్లని ఎదురించి మా నాన్నని తీసుకొస్తానని సత్య అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: మహాలక్ష్మికి గన్ గురిపెట్టిన రామ్.. తల్లిని చంపాలని ప్రయత్నించింది ఎవరైనా వదిలిపెట్టనని సవాల్!