Satyabhama Today Episode సంధ్య సత్య దగ్గరకు వచ్చి కాళీ మళ్లీ బెదిరిస్తున్నాడు అని అందుకే విశ్వనాథం ఇళ్లు అమ్మేస్తున్నారు అని విషయం చెప్తుంది. సత్య షాక్ అయిపోతుంది. క్రిష్‌తో చెప్పి విషయం చెప్పి సాల్వ్ చేయించమని సంధ్య అంటుంది. దాంతో సత్య ముందు ఇంటికి వెళ్దామని సంధ్యని తీసుకొని ఇంటికి వెళ్తుంది.
రుద్ర: ఎందుకిలా జరుగుతుంది. రేణుక బిడ్డను కన్నది అంటే నేను జీవితాంతం దానితోనే బతికి చావాలి. కుదరదు. అది కుదరదు. ఏదో ఒకటి చేయాలి. పంకజం మినుములు మేడ మీద ఆరపెట్టడానికి తీసుకెళ్తే వాటిని చూసిన రుద్రకు వాటిని మెట్ల మీద పడేసి రేణుక పడేలా చేయాలి అనుకుంటాడు.
రుద్ర వాటిని మెట్ల మీద చల్లి తల నొప్పి అని టీ తీసుకురమ్మని రేణుకని పిలుస్తాడు. రుద్ర మాటలు విన్న మహదేవయ్య భైరవిని సీరియస్‌గా చూడగా భైరవి తనకుఇ అర్థమైంది అని రేణుక టీ తీసుకొస్తుంటే అడ్డంగా వెళ్లి రేణుకని ఆపి తాను టీ తీసుకొని వెళ్లి రుద్రకి ఇవ్వడానికి మెట్లు ఎక్కి మినుముల మీద కాలు వేసి జారి పడిపోతుంది. మహదేవయ్య అందరిని తిడతాడు. రేణుకకి ఏమైనా అయింటే ఏంటి పరిస్థితి అని సీరియస్ అవుతాడు. రేణుక మాత్రం భర్తని అనుమానంగా చూస్తుంది.
విశాలాక్షి: ఈ ఇళ్లు వదులుకుంటే మన పరిస్థితి ఏంటి అండి.
విశ్వనాథం: ఇళ్లు వదులుకుంటే అద్దె ఇంట్లో ఉంటాం. కానీ మన పరువు పోతే ఏంటి పరిస్థితి. ఈ సమస్య నుంచి బయట పడటానికి ఇంత కంటే వేరే దారి లేదు విశాలాక్షి. ఈ ఇంట్లో ఏం జరుగుతుందో సత్యకి అస్సలు తెలీకూడదు.
సత్య: ఏం జరుగుతుంది ఈ ఇంట్లో. ఎందుకు నా నుంచి నిజాలు దాస్తున్నారు. ఎందుకు నన్ను పరాయివాళ్లలా చూస్తున్నారు. ఈ ఇంటి సమస్యల నుంచి నన్ను దూరంగా ఉంచుతున్నారు.
విశ్వనాథం: సంధ్య అక్కకి మొత్తం చెప్పేశావా. ఎందుకు చెప్పావ్. నిన్నే.. ఈ ఇంటి విషయాలు గుమ్మం దాటి వెళ్లాల్సిన అవసరం ఏముంది. మీ నాన్న చేతకాని వాడు ఏం చేయలేడు అని డిసైడ్ అయిపోయావా. వెళ్లు ఈ విషయం ఊరు అంతా చెప్పు.
సత్య: ఎందుకు నాన్న సంధ్య మీద అరుస్తున్నారు. ఈ ఇంటి విషయం నాతో చెప్పడం తప్పా.
విశ్వనాథం: తప్పే అమ్మ. ఈ ఇంటికి యజమాని నేను. ప్రాబ్లమ్ వస్తే నేనే చూసుకుంటా. నువ్వు నెత్తిన పెట్టుకోవాల్సిన పని లేదు.
సత్య: మా నాన్న ఎప్పుడూ నాతో ఇలా మాట్లాడరు. నా నుంచి ఏదో దాయాలని చూస్తున్నారు. నాన్న సమస్య ఏంటో చెప్పండి. ఏంటి నాన్న ఇది. పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్లిపోతే కూతురు పరాయి అయిపోతుందా..
విశ్వనాథం: అత్తారింటికి వెళ్లిన కూతురు ఇక చుట్టమే. అవసరం అయితే మీ అత్తింటిని అడుగు.
సత్య: సరే అయితే మీ కూతురు ఇక లేదు అనుకోండి.
విశాలాక్షి: తప్పు సత్య అలా మాట్లాడకు.
సత్య: నాన్న కనీసం నా ముఖం కూడా చూడటం లేదు. అంత తప్పు నేను ఏం చేశాను. కాళ్లు కడిగి కన్యాదానం చేశారు కానీ నన్ను ఆ ఇంటికి అమ్మేయలేదు కదా అమ్మ. పెళ్లి వల్ల దూరం అయ్యాను అంటే చెప్పమను బంధాలను వదులు కొని ఈ ఇంటికి వచ్చేస్తా.
శాంతమ్మ: ఇక చాలు అమ్మ ఇప్పటికే వీడు కష్టాలు భరించలేక సగం చచ్చి భరిస్తున్నాడు. గుండెల్లో చాలా కష్టం భరిస్తున్నాడు. గుండెలు బిగ పట్టుకొని బాధ పడుతున్నాడు. చస్తూ బతుకుతున్నాడు.
విశాలాక్షి: మన ఇంట్లో ఈ అల్లకల్లోలాలకు కారణం ఆ కాళీ కారణం. వాడు ఈ ఇంటి వైపు చూడడు అనుకున్నాం. కానీ పగ పట్టిన పాములా వాడు ఈ ఇంటి మీద పగ పట్టికూర్చొన్నాడు. సంధ్య జోలికి రాకుండా ఉండాలి అంటే వాడికి ఇరవై లక్షలు ఇవ్వాలి అంట లేదంటే సంధ్యని ఇచ్చి పెళ్లి చేయాలి అంట.
సత్య: వాడి బెదిరింపులకు ఎందుకు భయపడుతున్నారు. ఇవ్వకపోతే ఏం చేస్తాడంట. ఓ నాతో చెప్పకూడదు అనా..
విశాలాక్షి: చెప్పకూడదు అని కాదు అమ్మ ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాం. చెప్తే నువ్వు ఏం అయిపోతావా అని ఆలోచిస్తున్నాం.
సత్య: ఏం పర్లేదు నేను తట్టుకుంటా చెప్పమ్మ.
విశాలాక్షి: వాడు నిన్ను కిడ్నాప్ చేసినప్పుడు నీ మీద జరిగిన అఘాయిత్యం తాలూకు వీడియో వాడి దగ్గర ఉంది అంట. వాడి మాట వినకపోతే ఆ వీడియో నెట్‌లో అప్ లోడ్ చేస్తాడంట.
విశ్వనాథం: ఇరవై లక్షలు ఇస్తే ఆ వీడియో డిలీట్ చేస్తానన్నాడు.
సత్య: నాన్న మీరు ఆ కాళీకి ఒక్క పైసా ఇవ్వకండి. వాడు మిమల్ని బెదిరిస్తున్నాడు. నన్ను కిడ్నాప్ చేసింది కాళీ కాదు క్రిష్. పైగా ఆ రోజు నా మీద ఎలాంటి అఘాయిత్యం జరగలేదు. నన్ను నమ్మండి. వాడు మీకు వీడియో చూపించాడా. లేదు కదా మరి ఎలా నమ్ముతున్నారు. నాకు ఆ రోజు అన్నం పెట్టడానికి చేయి లోపల పెట్టగానే సత్య అన్న ట్యాటూ చూశాను.
విశ్వనాథం: కాళీనే నిన్ను మాయ చేయడానికి అలా ట్యాటూ వేయించుకోవచ్చు కదా. కిడ్నాప్ చేసింది క్రిష్ అని నువ్వు అనుకునేలా తప్పు దోవ పట్టించుకోవాలి అనుకునుండొచ్చు కదా.
సత్య: వాడికి ఆ అవసరం ఏంటి.
విశ్వనాథం: నిన్ను క్రిష్‌కి దూరం చేయడం. అది వర్క్‌ట్ కాలేదు కాబట్టే ఇప్పుడు ఇలా మన వెంట పడుతున్నాడు. నిజంగా నిన్ను క్రిష్ కిడ్నాప్ చేసి ఉంటే నీతో నీచంగా ప్రవర్తించి ఉంటే నీ కళ్లలోకి చూసే ధైర్యమే ఉండేది కాదు. నిన్ను ఇంతలా ప్రేమించే వాడే కాదు.
సత్య: నాకు అంతా అయోమయంగా ఉంది నాన్న. నేను క్రిష్‌నే అడుగుతాను.
విశ్వనాథం: వద్దు. మనకి కాళీ ఒక్కడే శత్రువు. అల్లుడిని కూడా చేర్చుకోవద్దు. కాళీ నిన్ను కిడ్నాప్ చేశాడని అల్లుడికి తెలిస్తే ఎలాంటి అనుమానాలు అయినా రావొచ్చు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.