Brahmamudi Serial Today Episode:  అనామిక మీడియాకు ఎక్కి దుగ్గిరాల ఫ్యామిలి గురించి కళ్యాణ్‌ గురించి, అప్పు గురించి చాలా బాడ్‌గా చెప్తుంది. తనను చాలా టార్చర్‌ పెట్టారని, కళ్యాణ్‌  అసలు ఏ పని చేయడని.. తినడం అప్పుతో తిరగడం పైగా పీకలదాకా తాగొచ్చి తనను టార్చర్‌ పెడతాడని చెప్తుంది. ఇక ఫ్యామిలి పైకి ఎంతో మంచిగా కనిపిస్తుంది కానీ నన్ను విడాకులు ఇవ్వమని నాపై ఒత్తిడి చేస్తున్నారని డివోర్స్‌ పేపర్స్‌ చూపిస్తుంది. ఇదంతా టీవీలో చూస్తున్న దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం షాక్‌ అవుతుంది. మరోవైపు అప్పు, కనకం మూర్తి కూడా టీవీలో చూసి షాక్‌ అవుతారు. అయితే టీవీలో జడ్జిగా వచ్చిన ఝాన్సీ టీవీ చానెల్‌ వాళ్లను తిట్టి అనామికను  కూడా తిడుతుంది.


ఝాన్సీ: మీ భర్తని ప్రేమించి పెళ్లి చేసుకున్నారా? లేక అరేంజ్డ్‌ మ్యారేజా?


అనామిక: ముందు ప్రేమించుకున్నాం. తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాం.


ఝాన్సీ: మరి ప్రేమించుకున్నప్పుడు తెలియదా? కళ్యాణ్‌ ఏ పని చేయడని..


అనామిక: అంటే అతడు కవిత్వం రాస్తాడు. అది చూసే నేను కూడా ప్రేమించాను.


ఝాన్సి: పెళ్లాయ్యాక కవిత్వం నచ్చలేదా? కవిత్వం రాసే మనిషి నచ్చలేదా? కవిత్వం రాయడం కళ మాత్రమే కాదు. అది కూడా ఒక విద్యేనని నీకు తెలియదా?


    అనగానే అనామిక అదేమి కాదు కానీ అతను ఏ పని చేయడని అందుకే ఇంత గొడవ జరుగుతుందని అనామిక చెప్తుంది. అప్పుతో తిరగడం వల్లే  విడాకులు కావాలని అడుగుతున్నాడు. అని చెప్తుంది. అప్పు, కళ్యాణ్‌ హోటల్‌ గదిలోంచి బయటకు వచ్చిన వీడియో చూపిస్తుంది. దీంతో ఝాన్సీ ఇది తప్పేనని అనామిక తరపున మేము పోరాడతామని చెప్తుంది. తర్వాత అనామిక తల్లిదండ్రులు వచ్చి తామే తప్పు చేశామని ఇంత వరకు జరిగింది చాలు ఇకనైనా ఆపమని చెప్తారు. ఇంతదాకా వచ్చాకా ఎలా అపుతానని మనం అనుకున్నట్లు ఆస్థి మొత్తం మన చేతికి వచ్చే రోజు దగ్గరలోనే ఉందని చెప్తుంది అనామిక. మరోవైపు దుగ్గిరాల ఇట్లో అందరూ తలా ఓ దిక్కున కూర్చుని బాధపడుతుంటారు. రాహుల్‌, రుద్రాణి హ్యాపీగా ఫీలవుతారు.


రాజ్: కళ్యాణ్‌ ఇన్ని రోజులు నువ్వు చెప్తుంటే నమ్మలేకపోయాను. మూర్ఖంగా నువ్వు ప్రవర్తిస్తున్నావనుకున్నాను. కానీ ఇంత జరిగాకే నాకు అర్థం అవుతుంది.


ALSO READ:  వెకేషన్‌ మోడ్ లో 'సలార్'‌ నటి శ్రియా రెడ్డి - వైట్‌ షర్ట్‌లో హాట్‌ట్రీట్‌ ఇచ్చిన 'డస్కీ' బ్యూటీ


ఇందిరాదేవి: ఏమంటున్నావ్‌ రాజ్‌ ఇంతకీ నువ్వు ఏం నిర్ణయం తీసుకున్నావు.


రాజ్: కళ్యాణ్‌ కోరుకుంటున్నట్లుగా అనామికతో తనకు విడాకులు ఇప్పించాలని నిర్ణయించుకున్నాను.


కావ్య: ఏవండి తొందరపడి నిర్ణయం తీసుకోకండి. అనామిక తప్పు చేసి ఉండొచ్చు కానీ తను ఆవేవంలో చేసింది.


సుభాష్‌: ఆవేషంలో చేసింది కాదమ్మా.. అన్నీ ఆలోచించే చేసింది. కావాలనే మన ఇంటి పరువు తీసి మనల్ని భయపెట్టి కళ్యాణ్‌ను తన గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తుంది.


ఇందిరాదేవి: అది నిజమే కావచ్చురా కానీ ఇప్పుడు మనం విడాకులు అడిగితే అనామిక అన్న మాటలన్నీ నిజమే అనుకుంటారు. అప్పుడు మన ఇంటి పరువు ఏమౌతుందో ఆలోచించు.


రాజ్‌: జరగాల్సిన నష్టం జరిగిపోయింది నాన్నమ్మ ఇప్పుడు దాన్ని ఎలా సరిదిద్దుకోవాలో ఆలోచించాలి.


రుద్రాణి: మనం అడగ్గానే సరిపోతుందా? అనామిక కూడా విడాకులు ఇవ్వాలిగా


రాజ్: ఇస్తుంది. ఇచ్చేలా నేను చేస్తాను. కానీ పిన్ని, బాబాయ్‌కి ఇష్టమైతేనే చేస్తాను.


   అని సుభాష్‌, ధాన్యలక్ష్మీలను అడుగుతాడు రాజ్, దీంతో ఇద్దరూ కోపంగా అది ఈ ఇంటి కోడలే కాదని తిడతారు. ఇంతలో పోలీసులు వచ్చి అనామిక కేసు పెట్టిందని కళ్యాణ్‌ ను అరెస్ట్‌ చేస్తున్నామని చెప్పడంతో అందరూ షాక్‌ అవుతారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.