Satyabhama Today Episode: గుడిలో చిలక జోస్యం చెప్పడం చూసిన శాంతమ్మ సత్య గురించి తెలుసుకుందాం అంటుంది. దానికి సత్య అడ్డు చెప్తుంది. అలా వింటే లేనిపోని టెన్షన్లు వస్తాయని అంటుంది. ఇక విశాలాక్షి సత్యను బతిమాలుతుంది. మరోవైపు సత్యవాళ్లను దూరం నుంచి చూస్తున్న క్రిష్ అత్తమ్మ ఏంట్రా సత్య గడ్డం పట్టుకొని బతిమాలుతుంది అని బాబీని అడుగుతాడు. 


క్రిష్‌: సత్య అంటే ఇంట్లో వాళ్లకు గారాభం ఎక్కువ అనుకుంటా. పెళ్లి అయ్యాక నేను ఇంకా గారాభం చేస్తా.
బాబీ: అన్న నీ స్టయిలే వేరు అన్న. 
సత్య: సరే మీ మాట మీదే కానీ నా మాట పట్టించుకోరా. మీ అందరికీ ఇప్పుడు నా జాతకం తెలియాలి అంతే కదా. పదండి.. ఇదిగో తర్వాత దాని గురించి ఎవరైనా కామెంట్ చేస్తే మాత్రం మర్యాదగా ఉండదు. 
కాళీ: పాప నేను నీకు చాలా చాక్లెట్స్ ఇస్తా నేను చెప్పిన పని నువ్వు చేయాలి. ఇదిగో ఈ పొట్లాం ఆ అక్కకి ఇచ్చి క్రిష్‌ని చూపిస్తూ ఆ అన్న ఇమ్మన్నాడు అని చెప్పి ఇది ఇవ్వు. 
క్రిష్‌: వీడేంట్రా నా వైపు చూస్తున్నాడు. నన్ను బుక్ చేస్తాడా ఏంటి.
బాబీ: వాడికి అంత సీన్ లేదులే అన్న.


పాప సత్యకు కుంకుమ ఇచ్చి పెట్టుకుంటే మంచిది అని అంటుంది. ఎవరు ఇచ్చారు అని సత్య అడిగితే పాప క్రిష్ వైపు చూపిస్తుంది. అయితే సత్య అక్కడే ఉన్న పూజారిని చూసి ఆయనే అనుకొని కుంకుమ తీసుకుంటుంది. 


క్రిష్: ఇప్పుడు ఆ పొట్లంపై నేను రాసింది చూస్తుంది. కోపంతో అరుస్తుందో.. ఇష్టంతో బొట్టు పెట్టుకుంటుందో.. అసలేం అవుతుందో.. సత్య పొట్లాం తీసి అందులో ఏముందో చదవకుండా పూజారి ఇచ్చాడని భావించి కుంకుమ పెట్టుకుంటుంది. అది చూసి క్రిష్ ఎగిరి గంతేస్తాడు.
బాబీ: అన్న నీ పంట పండిందే.. 
క్రిష్: రేయ్ నా సంపంగి నన్ను చూసి నవ్వుతుందిరా.. 
కాళీ ఫ్రెండ్: ఏంటి అన్నా స్లిప్‌లో ఉన్న రాతలు చూసి ఫైర్ అవుతుంది అనుకుంటే కుంకుమ పెట్టుకుంది. 
కాళీ: క్రిష్‌ రాసిన లెటర్ కాకుండా వేరే పేపర్‌లో కుంకుమ ఇస్తాడు. తెల్లకాగితంలో ఆ కుంకుమ ఇచ్చి పాపతో ఇప్పించా. చెప్పా కదరా వాడిని ఇలాగే పిచ్చొడిని చేసి నాశనం చేస్తా. వాడిని అస్సలు విడిచిపెట్టను. నా మీదే పెత్తనం చేస్తాడా.. అయిపోయాడు. 
క్రిష్: రేయ్ తమ్మి థ్యాంక్స్‌రా.. ఇన్ని రోజులు నా మనసులో ఉన్న కన్ఫూజన్ క్లియర్ అయిపోయింది. మీ వదిన మనసు నాదే అని తెలిసిపోయిందిరా.. రేయ్ ఇవాళ ప్రపంచాన్ని జయించిన అంత ఖుషీగా ఉందిరా.. 


క్రిష్: రేయ్ నా సంపంగి జాతకం చెప్పించుకుంటుంది. నన్ను ఇష్టపడ్డ తర్వాత తన జాతకానికి తిరుగేముంటుందిరా. 
సంధ్య: మా అక్క జాతకంలో కాబోయే భర్త గురించి చెప్పండి.
క్రిష్: రేయ్ బాబీ నా ఫొటో ఆ కార్డ్స్‌లో ఉంటుందారా.. మరి మొగుడుని చూపిస్తా అని చెప్తున్నాడు. 
బాబీ: అన్నా నీకు ఎలాగూ జాతకాలు అంటే నచ్చవు కదే.. ఊరికే తమాషాకి చూడు. ఎందుకు టెన్షన్ పడతావు.
క్రిష్: అంతే అంటావా.. మరోవైపు సత్యకు జోతిష్కుడు ఓ కార్డు తీయమని చెప్తాడు. సత్య కృష్ణుడి కార్డు తీస్తుంది. రేయ్ బాబీ నా సంపంగికి కాబోయే భర్త కృష్ణుడు అంటరా. అంటే నేనేరా.. 
శాంతమ్మ: కృష్ణుడికి సత్యభామ అంటే చచ్చేంత ఇష్టం. మాకు తెలీదా ఏంటి.
సంధ్య: అంటే మా బావగారు అక్క గీసిన గీత దాటరు అనేగా అర్థం. 
క్రిష్‌: అస్సలు దాటను. నా సంపంగి ఎంత చెప్తే అంతే. నేను ఇచ్చిన కుంకుమ బొట్టు పెట్టుకుంది. జాతకంలో ఈ కృష్ణుడిని మొగుడిని చేసుకుంది. రేయ్ ఇంతకన్నా ఏం కావాలిరా. రేయ్ బాబీ పండగ చేసుకుందాం పద.. 


సత్య ప్రసాదం తీసుకోవడానికి వెళ్తే అక్కడికి కాళీ వస్తాడు. సత్య కంగారు పడుతుంది. నిద్రలో కూడా నీ జోలికి రాను అని కాళీ అంటాడు. 
కాళీ: వదినా మా అన్న నీకు థ్యాంక్స్ చెప్పమన్నాడు అందుకే వచ్చాను. 
సత్య: థ్యాంక్స్ ఎందుకు ..
కాళీ: ఎందుకు ఏంటి. అన్నా ప్రాణం నిలబెట్టావు కదా.. 
సత్య: నువ్వు మాట్లాడేది ఒక్క ముక్క కూడా అర్థం కావడం లేదు.
కాళీ: సరే మొత్తం చెప్తా. ఇంతకు ముందు ఒక పాప నీకు అమ్మవారి కుంకుమ తెచ్చి ఇచ్చింది కదా అది ఎవరు పంపారో తెలుసా.. 
సత్య: అక్కడున్న పూజారి.
కాళీ: రామా పూజారి ఎందుకు పంపుతాడు వదినా.. సాక్ష్యాత్తు మా అన్న.. నీ అజ్ఞాత ప్రేమికుడు.
సత్య: అబద్ధం చెప్పకు. అయినా నాకు కుంకుమ ఎందుకు పంపాడు. తనకు పనీ పాట లేదా..
కాళీ:  తప్పు వదినా కాబోయే మొగుడిని అలా అంటారా. నీకు తెలీకుండానే నువ్వు మా అన్నని సగం పెళ్లి చేసుకున్నావు. ఇక్కడ అమ్మవారి కుంకుమకు ఓ ప్రత్యేకత ఉంది తెలుసా..
సత్య: తెలుసు.
కాళీ: మరి మా అన్న పంపిన కుంకుమ పెట్టుకున్నావు అంటే అర్థమేంటి మా అన్న నీకు నచ్చినట్లే కదా.. మీ పెళ్లి సగం అయిపోయినట్లే కదా..
సత్య: నో అది నేను తెలిసి చేయలేదు. ఆ కుంకుమ మీ అన్న పంపిందని నేను అస్సలు ఊహించలేదు.
కాళీ: మా అన్న మాత్రం మస్త్ ఖుషీగా ఉన్నాడు. నిన్నే తలచుకుంటూ పండగ చేసుకుంటున్నాడు. ఒకవేళ నువ్వు గానీ ఆ కుంకుమ పెట్టుకోకుండా ఉండుంటే మా అన్న విషం తాగి చచ్చిపోదాం అనుకున్నాడు. లక్కీగా బతికించావు. ఇప్పటి వరకు వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నా మా అన్నకు బెర్త్ కన్ఫ్మమ్ చేశావు. ఇక నీకు చచ్చినా వదలడులే అని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: కృష్ణ ముకుంద మురారి సీరియల్ జనవరి 19th: ఆదర్శ్‌ రావడం ఇష్టమేనా? ముకుందని ప్రశ్నించిన నందూ