Brahmamudi Serial Today Episode: కిచెన్‌లో పనులు చేస్తున్న కావ్య దగ్గరకు స్వప్న వస్తుంది. ఈ పనులు చేయడానికి నువ్వేమైనా పనిమనిషివా? అంటూ అడుగుతుంది. నువ్వు నోరు మూసుకుని ఉన్నన్ని రోజులు వీళ్లంతా నీమీద ఇలాగే అరుస్తుంటారు. నేను ఈ ఇంటి కోడలునేగా నామీద ఎవరైనా అరిచే ధైర్యం చేస్తారా? అంటూ కడిగిపారేస్తుంది. దీంతో మనం చేసేది వ్యాపారం కాదు అక్క సంసారం అటుంది కావ్య.


స్వప్న: ఎవరి మెప్పు కోసం ఇదంతా చేస్తున్నావే.. అమ్మమ్మ తాతయ్య తప్ప నీకెవరు గౌరవం ఇస్తున్నారు. నిన్నెవరు గుర్తిస్తున్నారు. ఒక్కసారి తిరగబడి చూడు దెబ్బకు తోక ముడుస్తారు.


కావ్య: తిరగడబటం ఎంత సేపు అక్కా నిమిషం పట్టదు. ఆ నిమిషం తర్వాత మనం ఉండాల్సింది ఇక్కడే..మాట్లాడాల్సింది వీళ్లతోనే ఈరోజు ఉండి రేపు వెళ్లిపోయేటోళ్లం కాదు. ఎప్పటికీ మన జీవితం ఇక్కడే గడిచిపోవాలి. మనం సర్దుకుపోవాలి.


   నీ ముఖమే నీ ముఖం అంటూ కావ్యను తిడుతూ..ఎదురు తిరుగు మీ అత్తనే కాదు చిన్నత్త కూడా ఇంక ఆమె చాలదన్నట్లు కొత్త కోడలు చిత్రాంగిలా తయారైంది అంటుంది. వాళ్లంతా పరాయివాళ్లు కాదు మన వాళ్లే కదా అంటుంది కావ్య. నీఖర్మ అంటూ వెల్లిపోతుంది స్వప్న. మరోవైపు మూర్తి ఇంట్లో అందరు భోజనం చేసి కూర్చుని ఉండగా పక్కింటి శాంత వచ్చి తన కూతురు పెళ్లి పెట్టుకున్నామని పెళ్లి కార్డు ఇచ్చి వెళ్తుంటే.. అబ్బాయి గురించి ఆరా తీస్తుంది కనకం. దీంతో ఏదో చిన్న సాఫ్ట్‌ వేర్‌ జాబ్‌ లే అంటుంది శాంతం.  ఎందుకంత దీనంగా చెప్తున్నావు అని కనకం అడగ్గానే. నేను నీలా కాదు కద అక్క నువ్వుంటే కష్టపడి నీ కూతుళ్లకు పెద్దింటి సంబంధాలు తెచ్చావు. అంటూ అప్పు విషయంలో జరిగిన విషయాలు మొత్తం చెప్తుండగానే కనకం ఏడుస్తూ వెళ్లిపోతుంది. మరోవైపు రాజ్  రూంలో పడుకుని నిద్రపోతుంటాడు. కావ్య వచ్చి ఎన్నడూ లేనిది ఇంత త్వరగా పడుకున్నారేంటి? అని మనసులో అనుకుని పడుకుంటుంది. మరోవైపు అప్పుకు భోజనం తీసుకువెళ్తుంది వాళ్ళ పెద్దమ్మ అన్నపూర్ణ. అప్పు తినని అంటుంది.


అన్నపూర్ణ: ఎందుకు తినవు..?


అప్పు: ఏమో


అన్నపూర్ణ: ఏమో ఏంటే అంటే వాళ్ల మాటలు నిజమని నువ్వు ఒప్పుకుంటున్నట్లేగా..


అప్పు : నీకు తెలియదా?


అన్నపూర్ణ: వాళ్లకు అలా మాట్లాడే అవకాశం మనమే ఇచ్చాం కనుక.


అప్పు: అంటే


అన్నపూర్ణ: మీ అమ్మా ఆ కుటుంబం దగ్గర నమ్మకం పోగొట్టుకుంది. అందులో కనకం స్వార్థం ఏం లేదనుకో..


అప్పు: మనలాంటి మధ్యతరగతి వాళ్లకు ప్రేమించే హక్కులేదా పెద్దమ్మ..


అన్నపూర్ణ: ప్రేమకు అర్థమే మారిపోయింది అప్పు. అయినా చిన్నప్పుడు నువ్వు ఏది పట్టించుకునే దానికి కాదు.  అప్పు అప్పులా ఉండాలి ఎవరిలా ఉండటమెందుకు


అంటూ అన్నపూర్ణ అప్పు చేత భోజనం చేయిస్తుంది. మరోవైపు రాజ్‌ రూంలో అల్లారం మోగుతుంది. నిద్రమత్తులో ఫోన్‌ తీసుకుని హలో అంటుంది కావ్య. ఏయ్‌ అది ఫోన్‌ కాదు అల్లారం అదీ నా ఫోన్‌లో అనగానే ఈ టైంలో అల్లారం ఏంటండి అని అడుగుతుంది కావ్య. నేనే పెట్టుకున్నాను ఆఫీసులో పనుంది అందుకే వెళ్తున్నాను అని రాజ్‌ చెప్పగానే కావ్య అనుమానంగా మీరు ఒక్కరే వెళ్తున్నారా? అంటుంది. ఇది టీమ్‌ వర్క్‌ అందరూ వస్తారు అని రాజ్‌ చెప్పి వెళ్లిపోతాడు. మరోవైపు శ్వేత రూంలో పడుకుని ఉండగానే కొత్త  క్యారెక్టర్‌ ఎంటర్‌ అవుతుంది. శ్వేత ఇంట్లో కత్తి తీసుకుని వెళ్తాడు. ఎవరని శ్వేత చూస్తుంది ఎవ్వరూ కనిపించరు. ఇంతలో రాజ్‌ ఫోన్‌ చేస్తాడు.


శ్వేత: చెప్పు రాజ్‌


రాజ్‌: ఈవెనింగ్‌  కాల్‌ మీ అని మెసెజ్‌ పెట్టావుగా ఇప్పుడే చూశాను. అందుకే కాల్‌ చేశా


శ్వేత: అది ఎప్పుడో పెట్టానులే..


రాజ్‌: ఏయ్‌ ఏంటి టెన్షన్‌ పడుతూ మాట్లాడుతున్నావు.


అని రాజ్‌ అడగ్గానే ఇంట్లో ఎవరో ఉన్నారన్నట్లుగా ఉంది అని శ్వేత చెప్పగానే. అయితే నేను వస్తాను అని రాజ్‌ చెప్పగానే ఏమీ వద్దులే అని ఫోన్‌ కట్‌ చేసి పడుకుంటుంది శ్వేత. ఇంతలో హాల్లో టీవీ ఆన్‌ అవుతుంది. దీంతో ఉలిక్కి పడి లేసిన శ్వేత భయంగా హాల్లోకి వెళ్లి టీవీ ఆఫ్‌ చేస్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.