Satyabhama Today Episode: సత్యభామ జీవితాన్ని అందాన్ని నాశనం చేయాలి అని కాళీ ఓ ఇంజక్షన్‌ని తీసుకొని సత్య వెనుక తిరుగుతాడు. అప్పడే అక్కడికి క్రిష్ వస్తాడు. క్రిష్‌ని చూసి కాళీ షాక్ అయి ఇంజక్షన్‌ని క్రిష్ చూడకుండా తన ఫ్రెండ్‌కి ఇచ్చేస్తాడు. ఇక క్రిష్ కాళీని వెళ్లిపోమని చెప్తాడు. క్రిష్ సత్యభామను ఫాలో అవ్వాలి అనుకుంటాడు. అప్పుడే క్రిష్‌ని భైరవి పిలుస్తుంది. 


భైరవి: ఏంట్రా నువ్వు ఎప్పుడు లేనిది కొత్తగా గుడికి వచ్చావు. 
క్రిష్: బాబీకి మొక్కు ఉందంటే తోడు రమ్మంటే వచ్చాను అమ్మ. బాబీ చెప్పురా సిగ్గు ఎందుకురా.. అమ్మా తొందరగా పెళ్లి కావాలని మొక్కుకున్నాడు. 
భైరవి: పది సార్లు పొర్లు దండాలు పెట్టు వారం తిరిగే సరికి పెళ్లి అవుతుంది. 
కాళీ: అన్నా నువ్వు అమ్మని మేనేజ్ చేస్తుండు నేను వదినని మేనేజ్ చేస్తా..
క్రిష్:  రేయ్.. రేయ్.. మీరు ఏంటి అమ్మా గుడికి వచ్చారు. 
నందూ: నువ్వు గుడికి వచ్చావంటే అనుమానంగా ఉందిరా.. పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు దొరక్క గుడిల వెంట తిరుగుతున్నారు. నువ్వు కూడా అదే పనిలో ఉన్నావా.. సిగ్గు పడకురా వదిన ఇక్కడెక్కడైనా ఉంటే చెప్పు చూసేస్తాం. ఒక పని అయిపోతుంది. 
క్రిష్: చూడు అమ్మా ఇది.. 
భైరవి: ఊరుకోవే.. వాడు బలాదూర్ తిరుగుతాడు కానీ పోరిల వెంట తిరగడు నాకు తెలుసు. ఈడు నేను మీ బాపూ చూసిన పిల్లనే ఖాయం చేస్తాడు. మీ వదినని మొక్కు కోసం తీసుకొచ్చినా గుడిలో ఉంది. నేను పోతా.. మీరు తొందరగా ఇంటికి వచ్చేయండి.
బాబీ: అన్నా పెద్దమ్మకి నీ మీద చాలా నమ్మకం ఉన్నట్లుంది. చూసుకో..
క్రిష్: రేయ్ బాబీ ఒక మాట చెప్తా రాసుకోరా.. కన్నోళ్లకి పిల్లల మీద నమ్మకం ఉండటం కామన్. పిల్లలు కన్నోళ్ల కళ్లు కప్పి తిరగడం అంత కన్నా కామనే. 


సత్య: నానమ్మ అబ్బాయికి నేను నచ్చితే చాలా.. నాకు అబ్బాయి నచ్చక్కర్లేదా.. 
శాంతమ్మ: ఇదే వితండవాదం అంటే నేను మా పెద్దవాళ్లు చెప్పినట్లు విన్నాను. ఏమే విశాలా నువ్వు మీ పెద్దవాళ్లు చెప్పినట్లే విన్నావు కదా.. నీ పెద్దకూతరుకి చెప్పు అబ్బయి మనకు నచ్చితే తను ఒప్పుకోవాల్సిందే.. నీ కూతురు మనసు మారి బుద్ధిగా నీ మాట వినాలి అని నువ్వు ఆ దేవుడికి దండం పెట్టుకో. 
విశాలాక్షి: అలాగే అత్తయ్య.
శాంతమ్మ: తెలిసిన సంబంధం అమెరికా సంబంధం అంతకన్నా ఏం కావాలే..
సంధ్య: నానమ్మ అక్క సంబంధం ఒప్పుకోను అనలేదు. అబ్బాయి నాకు నచ్చాలి అన్నది అంతే. 
సత్య: ఎందుకు నానమ్మ నీకు ఊరికే కోపం వస్తుంది.
శాంతమ్మ: ఇది కోపం కాదే.. నీ పెళ్లి తొందరగా జరగాలి అని.. మళ్లీ నువ్వు ఏ చిక్కుల్లో పడకూడదు అని బెంగ అంతే.. 
సత్య: నాకేం కాదు. మీరు నిశ్చింతగా ఉండడి.. 
కాళీ: ఏంటి ఆ క్రిష్ గాడి సంపంగికి పెళ్లా.. పెళ్లి షాకింగ్ న్యూస్.. బ్రేకింగ్ న్యూస్.. ఈ న్యూస్ గనుక ఆ క్రిష్ గాడి చెవిలో పడితే.. ప్రపంచాన్నే తలకిందుల చేస్తాడు. రావణాసుడు సీతని కిడ్నాప్ చేసినట్లు లేపుకెళ్లి పెళ్లి చేసుకుంటాడు. నేను కోరుకున్నది సత్యభామ క్రిష్‌లు ఒక్కటి అవ్వడం కాదు. వాళ్లిద్దరూ కుళ్లికుళ్లి చావడం.  


క్రిష్: రేయ్ ఆ పిచ్చోడు ఏడ్రా కనిపించడం లేదు.
బాబీ: ఎవరన్నా..
క్రిష్:  అదేరా కాళీ గాడు. ఏరా వదినతో నా ముచ్చట చెప్పావా.. నాకు పచ్చజెండా ఊపిందా.. 
కాళీ: వదిన ఒక్కర్తే వచ్చుంటే ఈ టైంకి ఈ గుడిలో మొత్తం మేటర్ సెట్ అయిపోయున్ను. మీరు దండలు మార్చుకోవడం పూర్తయ్యేది. కానీ మొత్తం ఫ్యామిలీని వెంటేసుకొని వచ్చింది వదిన. ఒక్కర్తే దొరకలేదు అన్న. చుట్టూ బాడీగర్డ్‌లా ఉన్నారు. మరో ప్లాన్ ఉంది అన్నా ఈ ప్లాన్ సక్సెస్ అయితే వదినకు నీ మీద పీకల్లోతు ప్రేమ ఉన్నట్లు లెక్క. ఇంకా వెనక్కి చూసుకోవడం కూడా లేదు.
క్రిష్:  నా బండి వెనకాల ఎక్కించుకొని గోవా కూడా వెళ్లిపోవచ్చు.
కాళీ: ఈ గుడిలో అమ్మవారి కుంకుమకి ఒక స్పెషల్ ఉంది అన్నా. ఇక్కడి అమ్మవారి కుంకుమని ఏ అబ్బాయి అయిన కోరుకున్న అమ్మాయి నుదిటిన పెడితే వాళ్లిద్దరికి సగం పెళ్లి అయిపోయినట్లే.. 
క్రిష్:  మరి మిగతా సగం పెళ్లి.
కాళీ: తాళి కడితే అయితాది. 
క్రిష్:  అంటే నేను నా సంపంగి నుదిటి మీద బొట్టు పెడితే ఊరుకుంటుందా.. 
కాళీ: నువ్వు వదిన దగ్గరకు వెళ్తే కదా రిస్క.. వెళ్లకుండా పెట్టేలా చేద్దాం.
క్రిష్:  నేనేమైనా మాయలు మంత్రాలు చేయాలారా.. వెళ్లకుండా ఎలా పెట్టాలి.
కాళీ: అన్నా చెప్పేది విను. అన్నా నీ చేత్తో అమ్మవారి కుంకుమని తీసుకొని పేపర్‌లో పొట్లాం చుట్టి వదిన చేతికి అందేలా చేస్తే.. ఆ కుంకుమ వదిన పెట్టుకుంటే అయిపోయే..
క్రిష్:  రేయ్ మరి నా మనసులో మాట నా సంపంగికి ఎలా తెలియాలి.
కాళీ: దానికి కూడా ఐడియా ఉంది అన్నా. మనం పొట్లం కట్టి పేపర్ మీద ఏం రాస్తామంటే.. నేను నీకు నచ్చితే ఈ బొట్టుపెట్టుకో అని.. 
క్రిష్:  నేను రాసింది చదివి బొట్టుపెట్టుకుంది అంటే తనకు నేను నచ్చినట్లే కదా.. అంటే సంపంగి మనసులో నేను ఉన్నట్లే కదా.. మరి కుంకుమ ప్యాకెట్ మీ వదినకు ఎవరు ఇస్తారు. 
బాబీ: అన్నా నా వల్ల కాదే నా కోటా అల్రెడీ అయిపోయింది. 
కాళీ: ఆల్రెడీ నాకు ఒకసారి పగిలింది. 
క్రిష్:  మరెట్లారా..
కాళీ: అన్నా దానికి ఒక ఐడియా చేశా.. ఒక చిన్న పాపని రెడీ చేశా..
క్రిష్: రేయ్ సూపర్‌రా..మరి లేట్ ఎందుకు. ఈ రోజుతో నా మనసు సత్యభామకు తెలిసిపోతుంది. సత్యభామ మనసులో నేను ఉన్నానో లేదో కూడా తెలిసిపోతుంది. నేను ఎప్పుడూ నా కోసం మొక్కుకోలే. మొదటి సారి మొక్కుతున్నా నాకు నా సంపంగి కావాలి.
కాళీ: అన్నా ఆ పేపర్ ఇటు ఇవ్వు అన్నా. అన్నా నువ్వు ఏ టెన్షన్ పడకు. అంతా నేను చూసుకుంటా.. 
క్రిష్:  సరే తేడా ఏం రాదుగా.. సరే ముందు పని చూడు.


మరోవైపు సత్యభామ వాళ్లు బయటకు వస్తుంటే అక్కడ చిలక జోస్యం చెప్తుంటారు. సత్యకు వాళ్ల నానమ్మ చిలక జోస్యం చెప్పించుకోమని అంటుంది. దానికి సత్య ఒప్పుకోదు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: కృష్ణ ముకుంద మురారి సీరియల్ జనవరి 18th: ముకుంద కారణంగా ఆగిపోయిన కృష్ణ, మురారిల ఫస్ట్‌ నైట్!