Satyabhama Today Episode: తన తండ్రి మహదేవయ్య, అన్న రుద్రలతో కలిసి క్రిష్ మినిస్టర్ ఇంటికి వస్తాడు. అక్కడ ఉండటం ఇష్టం లేక క్రిష్ బాబీకి ఫోన్ చేసి బైక్ తీసుకొని అక్కడికి రమ్మని చెప్తాడు. ఇక మినిస్టర్ కూతురు క్రిష్‌ని చూస్తుంది. నెల రోజుల నుంచి తన కోసం వెతికితే ఇప్పుడు మా ఇంటికే వచ్చాడా అనుకుంటుంది. ఇక తన కోసం అందంగా రెడీ అవ్వాలి అనుకొని వెళ్తుంది. 


రుద్ర: కొన్ని విషయాలు నేరుగా వచ్చి మాట్టాడితేనే మంచిది అని మా బాపూ నేరుగా వచ్చాడు. మా బాపు రాజకీయాల్లోకి రావాలి అనుకుంటున్నాడు. నేను కూడా మీ లెక్క మస్తు షాక్ అయినా కానీ ఈ మధ్య కొన్ని వీధి కుక్కలకు కూడా చాలా నోరు వచ్చింది. కార్పొరేటర్ అవ్వగానే మస్తు ఎగురుతున్నారు అందుకే బాపూ ఈ నిర్ణయం తీసుకున్నాడు.
మినిస్టర్: ఆ నర్శింహం గాడి గురించి అంత ఆలోచించడం ఎందుకు నేను తలచుకుంటే ఇప్పుడే వాడిని ఆ పోస్ట్ నుంచి పీకేస్తా.
మహదేవయ్య: వాడు ఆడనే ఉండాలి. నేను వెళ్తే వాడు నాకు జిందాబాద్ కొట్టాలి. నా కాళ్లు కడిగి వాడు నెత్తిన జల్లుకోవాలి. అప్పుడు కానీ నా పగ చల్లారదు.
మినిస్టర్: పగ కోసం రాజకీయాల్లోకి రావడం కరెక్ట్ కాదు అన్న.
మహదేవయ్య: ఏయ్ మినిస్టర్.. ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదో నువ్వు నాకు చెప్పకూడదు. నేను నీకు చెప్పకూడదు. ఈ విషయంలో నేను ఎవరి మాట నేను వినను. వాడు నా కాళ్ల దగ్గర ఉండాలి. అది కావాలి అంటే నాకు పవర్ ఉండాలి. నేను ఎమ్మెల్యే అయి తీరాలి. 


మినిస్టర్ కూతురు శైలజ క్రిష్ గురించి తన తండ్రిని అడుగుతుంది. వాళ్లు వెళ్లిపోయారు అని చెప్పడంతో తననే పెళ్లి చేసుకుంటానని శైలజ అంటుంది. తన తండ్రి ఎంత చెప్పినా వినిపించుకోదు. 


మరోవైపు సత్యభామకు కాబోయే భర్త మాధవ్ అమెరికా నుంచి ఇండియాకు తిరిగి వస్తాడు. వాళ్ల అమ్మానాన్న ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లి రిసీవ్ చేసుకుంటారు.  ఇక మాధవ్‌కి వాళ్ల అమ్మ పెళ్లి చూపులకు వెళ్దామని అడుగుతుంది. వాళ్ల ఇంట్లో చెప్తామని మాధవ్ తండ్రి అనగానే మాధవ్ ఏంటి ఇంకా చెప్పలేదా నేను అయితే ఆ అమ్మాయి ఫొటోని నా ఫోన్ స్కీన్‌కు పెట్టుకున్నా గుండెలకు దగ్గరగా పెట్టుకొని తిరుగుతున్నానని అంటాడు. పెళ్లి చూపులు అవ్వగానే ఆ ఫొటోని గుండెల్లో సేవ్ చేసుకుంటానని చెప్తాడు. ఇక శేఖర్ విశ్వనాథానికి ఫోన్ చేస్తారు.


శేఖర్‌:  రేయ్ పెళ్లి ఏర్పాట్లు ఎక్కడి వరకు వచ్చాయి రా. 
విశ్వనాథం: పెళ్లి ఏర్పాట్లు ఏంట్రా ఇంకా పెళ్లి చూపులు కాలేదు కదా..
శేఖర్: పెళ్లి చూపులు ఏముంది లేరా అదో ఫార్మాలిటీ. 
విశాలాక్షి: పెళ్లి చూపులు లేకుండా డైరెక్ట్‌గా ముహూర్తాలు పెట్టేసుకుందాం అంటారేంటో అడగండి.. 
శేఖర్: రేయ్ చెప్పడం మర్చి పోయా మా వాడు అదే మీ కాబోయే అల్లుడు ఇప్పుడే ఇండియాలో అడుగుపెట్టాడు. ఇంటికి వెళ్తూ దారిలో ఉన్నాం రా.. ఆల్రెడీ మా పంతులు గారితో మాట్లాడాం రేపు పెళ్లి చూపులు పెట్టుకోమన్నాడు. మీకు ఏం అభ్యంతరం లేదు కదా..
విశ్వనాథం: తప్పకుండా రండి మాకు ఆరాటంగా ఉంది. 
హర్ష: నాన్న పెళ్లి చూపులకు ఏం కావాలో చెప్పండి తెచ్చేస్తా. 
శాంతమ్మ: వచ్చేది అమెరికా ఇళ్లు ముందు ఇళ్లంతా నీటిగా ఉండాలి. సంధ్య ఆ పని నువ్వు చూడమే.
సంధ్య: నువ్వు ఉండు నానమ్మ నాకు రెడీ అవ్వడానికే టైం సరిపోదు ఇక ఆపనులన్నీ నాకు టైం సరిపోదు. 
శాంతమ్మ: నువ్వు రెడీ అవ్వడం ఏంటే పెళ్లి చూపులు నీకు కాదు మీ అక్కకి. ఇంటికి అప్పుడే పెళ్లి కల వచ్చేసిందిరా విశ్వం. చూడు ఎంత సందడిగా ఉందో... 
విశ్వనాథం:  పెళ్లి అనగానే ఏ ఆడపిల్ల అయినా సంతోషంతో తల దించుతోంది. కానీ నువ్వేంటమ్మ దిగులుగా తన దించుకున్నావ్. నువ్వు ఒప్పుకుంటే కదా ఈ పెళ్లికి రెడీ అయ్యాం. ఇప్పుడు ఎందుకు ఇలా ఉన్నావ్. 
సత్య: నాన్న జరిగేవి పెళ్లి చూపులే కదా.. పెళ్లి ఫిక్స్ అవ్వలేదు కదా అని అడగడంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.


Also Read:  ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌ జనవరి 15: రిషిని వెతుక్కుంటూ చక్రపాణి ఇంటికెళ్లిన శైలేంద్ర – కాలేజీలో రిషి చనిపోయాడని న్యూస్‌ వైరల్