Satyabhama Today Episode: విశ్వనాథం కూతురు అల్లుడిని పండక్కి తన ఇంటికి పంపించమని అడుగుతాడు. దానికి మహదేవయ్య తన తల్లిని అడిగి సరే అంటాడు. ఇక నందినిని కూడా పిలవమని మహదేవయ్య తల్లి చెప్తుంది. దానికి భైరవి మనం పంపించమని చెప్పడం ఏంటి.. తన బిడ్డని పిలిచిన వాళ్లు మన బిడ్డని పంపించరా ఏంటి అని అడుగుతుంది. దానికి విశ్వనాథం మీ అల్లుడిని మీరు పిలవాలి అనేం లేదు పంపిస్తాను అని చెప్తాడు. 


విశ్వనాథం: అల్లుడు గారు అమ్మాయిని తీసుకొని పండక్కి మా ఇంటికి రావాలి మీరు. 
క్రిష్: (సత్య పార్టీకి రాను అన్నది గుర్తు చేసుకొని.. సత్యని దెబ్బ కొట్టడానికి మంచి ఛాన్స్ దొరికింది అనుకొంటాడు. ) తీసుకొచ్చుడు అంటే నాతో కుదరదు. నాకు వేరే పనులు ఉన్నాయి. మీ కూతురు వస్తుంది లెండీ.
మహదేవయ్య: అదేంటిరా అంత కొంపలంటుకునే పనులేమున్నాయి. 
క్రిష్: ఏ ఉండకూడదా.. అంత పని లేని వాడిలా కనిపిస్తున్నానా మీకు. 
సత్య: మనసులో కావాలనే నాటకాలు ఆడుతున్నారు. నాన్న నేను ఆయన్ను ఒప్పిస్తాను. నేను తీసుకొస్తాను నాన్న అని సత్య చెప్పడంతో సరే అని విశ్వనాథం వెళ్లిపోతాడు.
క్రిష్: ఫోన్లో సినిమా చూసుకుంటూ.. సత్య రావడం చూసి.. అరే నీకు ఇంత తొందరగా టైం వస్తుంది అని నేను అస్సలు అనుకోలే. సత్య క్రిష్ పక్కనే బెడ్ మీద కూర్చొంటుంది. క్రిష్ కావాలనే దూరం జరుగుతాడు. సత్య అడ్డుకుంటుంది. 
సత్య: నీతో మాట్లాడాలి.
క్రిష్: పరాయి మగాడితో మాట్లాడుతావా.. ఏం కాదా.. అంటే గదిలో ఉన్నప్పుడు నువ్వు ఎవరో నేను ఎవరో అన్నావు కదా..
సత్య: ఇప్పుడు నేను మాట్లాడాలి అనుకున్న టాపిక్.. అది కాదు. రేపు ఉగాది మన పెళ్లి అయ్యాక మొదటి పండగ మానాన్న రమ్మంటే ఎందుకు రాను అన్నావ్. 
క్రిష్: పని ఉంది అన్నాను కదా..
సత్య: అది అబద్ధం అని నాకు తెలుసు. నా మీద పగ తీర్చుకోవడానికి అవకాశం దొరికింది వాడుకుంటున్నావ్.
క్రిష్: మరి తెలిసి ఎందుకు అడుగుతున్నావ్. నా ఫ్రెండ్ పార్టీకి రమ్మంటే ఏమన్నావో గుర్తుందా.. నిన్ను పెళ్లి చేసుకోవడమే ఎక్కువ పార్టీలేం లేవు అన్నావు. నేను అంటే అంత అలర్జీ ఉన్న నువ్వు మరి నేను పక్కన ఉండగా మీ పుట్టింటి ఎలా వెళ్తావ్. 
సత్య: చూడు మీ ఫ్రెండ్ పార్టీకి వెళ్లకపోతే ఒకటి రెండు రోజులు తిట్టుకొని వదిలేస్తారు.  కానీ మా ఇంటికి వెళ్లకపోతే అందరూ బాధ పడతారు.
క్రిష్: అంతకు ముందు మన రిలేషన్ అందరికీ తెలిసిపోతుంది అంతే కదా.. మొగుడు ప్రేమగా చూసుకుంటున్నాడు. ఒక్క నిమిషం వదలడు అని బిల్డప్ ఇచ్చావు. ఇప్పుడు అడ్డంగా దొరికిపోయావ్.
సత్య: చూడు నువ్వు అన్నట్లు మనం అన్యోన్యంగా ఉన్నామని మావాళ్లకి చెప్పాను. అది అబద్ధం అని తెలిస్తే బాధ పడతారు. అందుకే నీతో కలిసి మా పుట్టింటికి వెళ్లాలి అనుకుంటున్నాను.
క్రిష్: అది నీ సమస్య నాకు ఏం సంబంధం. 
సత్య: నాకు సమస్య వచ్చినప్పుడు ఈ ఇంట్లో నాకు సపోర్ట్ చేస్తున్నావు ఇప్పుడు కూడా అలాగే చేయ్. అవకాశం దొరికింది కదా అని కార్నర్ చేయకు.  
క్రిష్: బతిమిలాడు.. అప్పుడు చూస్తా.. అయినా నేను మీ పుట్టింటికి రాను పక్కింటికి రాను నువ్వే పో.
సత్య: సరే మా వాళ్ల సంతోషం కోసం నువ్వు నా భర్తగా నటించు.
క్రిష్‌: భర్తగా నటించడం కాదు. నువ్వే నా భర్త అని నువ్వు మనస్ఫూర్తిగా చెప్పే రోజు త్వరలోనే ఉంది.
సత్య: ఏదో అంటున్నావ్.
క్రిష్‌: నువ్వు ఇంత రిక్వెస్ట్ చేస్తున్నావ్ కాబట్టి. నా పెళ్లాంతోని నేను పుట్టింటికి రావడానికి నేను రెడీ..


మరోవైపు మహదేవయ్య భైరవిని పిలిచి చిన్నా ఎక్కడున్నాడు అని అడుగుతాడు. దాంతో భైరవి ఇప్పుడు వాడు చిన్నా కాదు తండ్రి మాట వినే కొడుకు కాదు పెళ్లాం మాట వినే వాడని అంటుంది. ఇంతలో సత్య క్రిష్‌లు బ్యాగులు తీసుకొని వస్తారు. ఎక్కడికి వెళ్తున్నారు అని మహదేవయ్య అడిగితే పుట్టింటికి వెళ్తున్నాం అని సత్య అంటుంది. రాను అన్నావు ఎలా వెళ్తావ్‌రా అని రాడు అని భైరవి అంటుంది. ఇక రుద్ర, భైరవి ఇద్దరూ భార్య మాట వినడం తప్పు కాదు కదా అని అంటుంది సత్య. 


భైరవి: పోతేపో కానీ ఆ ఇంట్లో పెట్టే అడ్డమైన గడ్డి తినకు కడుపు పోతుంది. నేను కమ్మగా వండి క్యారేజ్ పంపిస్తాలే.
సత్య: అవసరం లేదు అత్తయ్య. మీ అబ్బాయిని క్షేమంగా తీసుకొస్తాను. ఏమండీ వెళ్దామా..   


క్రిష్, సత్యలు పుట్టింటికి వెళ్లడం అలా చూస్తున్న రేణుక భర్త దగ్గర బాధ పడుతుంది. చిన్నా లెక్క ఆలోచించుంటే నేను పుట్టింటికి దూరమయ్యేదాన్ని కాదు అంటుంది. దానికి రుద్ర పెళ్లామంటే పెళ్లం లెక్క ఉండాలి చిన్నాలా నేను పెళ్లాం పిచ్చోడిని కాదు అని రేణుకని పంపేస్తాడు. 


మరోవైపు నందిని, హర్షలు కూడా మహదేవయ్య ఇంటికి బయల్దేరుతారు. ఇక సంధ్య అన్నయ్య నీకు బోర్ కొడుతుంది కదా నేను రానా అంటే శాంతమ్మ సామెతలతో సెటైర్లు వేస్తుంది. దీంతో అప్పగింతలు అయితే మనం పోదామని నందిని అంటుంది. ఇక విశాలాక్షి హర్షకు జాగ్రత్తలు చెప్తే నందిని అడ్డుకొని మీరు నన్ను సతాయించినట్లు నా వాళ్లు మీ కొడుకును సతాయించరని జాగ్రత్తగా చూసుకుంటారు అని చెప్తుంది.  


పారిజాతం భైరవిని తగిలిస్తుంది. కోడలితో పాటు కొడుకును పంపించడం తప్పు అని అంటుంది. ఇక భైరవి కొడుకు గురించి తనకు అవసరం లేదు అని కూతురు అల్లుడు వస్తే వాళ్ల మధ్య చిచ్చు పెట్టి విడాకులు తీసుకునేలా చేయాలి అని అంటుంది. నందినికి మళ్లీ పెళ్లి చేసి ఇళ్లరికం అల్లుడిని తీసుకొస్తాను అంటుంది. మరోవైపు క్రిష్ రాక్షసుడు అని వస్తే ఎలా ఉంటుందో అని భయపడతారు సత్య పుట్టింటి వాళ్లు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: 'త్రినయని' సీరియల్: విశాల్‌ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న నయని అనుమానాలు.. తాళి దొంగతనానికి వచ్చిన అత్తాకోడళ్లు!