Satyabhama Serial Today Episode సత్యని కిడ్నాప్ చేయాలనుకున్న రౌడీలను ఆర్‌డీఎక్స్ గ్యాంగ్ జ్యూస్‌ల పేర్లు చెప్పి తిప్పి తిప్పి పడిపోయేలా చేస్తారు. మరో ఇద్దరు రౌడీలు మందు తాగుతుంటే కిడ్నాప్ చేయడానికి వచ్చిన వాళ్లు కూడా ఫుల్లుగా తాగేస్తారు. ఇక ఇంట్లో మెహందీ సందడి మొదలవుతుంది. ఎవరి భర్తలు వాళ్ల భార్యలకు మెహందీ పెడతారు. నందిని కూడా తన భర్తని లాక్కొని వచ్చి మెహందీ పెట్టమని అడుగుతుంది. నేను పెట్టను అని హర్ష మొండికేస్తే విశ్వనాథం, విశాలాక్షిలను చూపించి మెహందీ పెట్టమని అంటుంది.


హర్ష: అసలు ముచ్చట తీరలేదు కానీ కొసరు ముచ్చట్లు ఎక్కువయ్యాయి.
నందిని: అసలు ముచ్చట కూడా తీరుతుందిలే.
హర్ష: అవునా ఎప్పుడు
నందిని: ముందు మా అమ్మానాన్నల పెళ్లి కానీ. 


క్రిష్, సత్యని చూసి బాధగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోవైపు భైరవి మహదేవయ్యని లాక్కొని వస్తుంది. తనకు మెహందీ పెట్టమని అంటుంది. తన వల్ల మెహందీ పెట్టడం కాదని మహదేవయ్య అంటే రుద్ర తండ్రిని పిలుస్తాడు. రుద్ర రేణుకకి మెహందీ పెట్టడం, విశ్వనాథం, హర్షలు కూడా మెహందీ పెట్టడం చూసిన మహదేవయ్య తన భార్యకి కూడా మెహందీ పెట్టడానికి రెడీ అవుతాడు. అన్ని జంటల్నీ చూసి జయమ్మ సంతోషపడుతుంది. ఇక సత్య క్రిష్ వెనకాలే పడుతుంది. క్రిష్‌ని పిలుస్తున్నా క్రిష్‌ ఫోన్‌లో మాట్లాడుతూ  కావాలనే సత్యని దూరం పెట్టి వెళ్తాడు. అయినా సత్య క్రిష్ వెనకాలే వెళ్తుంది. మరో వైపు రుద్ర ఏర్పాటు చేసిన రౌడీ అందరికీ డ్రింక్స్ ఇస్తూ సత్య గురించి ఆరా తీస్తుంటాడు. నందిని దగ్గర రౌడీ ఓవర్ చేస్తే నందిని ఒక్కటిస్తుంది. ఇక క్రిష్ ఎదుటకి సత్య ఫ్రెండ్స్ వెళ్తారు. సత్యని క్రిష్ పక్కన పెట్టి ఈ అమ్మాయి ఎవరో తెలుసా అని ఒకవేళ తెలియకపోతే పరిచయం చేస్తాం అంటారు. 


మా ఫ్రెండ్ మీతో మెహందీ పెట్టుకోవాలని ట్రై చేస్తుంటే మీరు తప్పించుకొని తిరుగుతున్నారు. మెహందీ అంటే అలర్జీనా మా సత్య అంటే అలర్జీనా అని అడుగుతారు. తనకి మెహందీ పెట్టడం రాదు అని క్రిష్ అంటాడు. ఇక తన ఫ్రెండ్స్ మెహందీ పెట్టకపోతే వచ్చే జన్మలో కూడా ఇదే భార్య దొరుకుతుందని మీకు ఇష్టమేనా అని అడిగి మెహందీ తీసుకొచ్చి సత్యకు మెహందీ పెట్టమని అంటారు. సత్య క్రిష్‌కి మెహందీ పెట్టమని గోరింటాకు ఎంత ఎర్రగా పండితే నీ ప్రేమ అంత ఎక్కువని చెప్పి క్రిష్‌కి కోన్ అందిని గోరింటాకు పెట్టమని అంటుంది. దాంతో క్రిష్ సత్యకు మెహందీ పెడతాడు. ఇక  సత్య తన ఫ్రెండ్స్‌కి సైగ చేసి గోరింట ఆకు పాట పెట్టమంటే జెరా అన్న చెల్లెల అనుబంధం అంటూ పాట పెడతుంది. దాంతో సత్య కోపంగా చూస్తే జరా మళ్లీ వేరే పాట పెడుతుంది. ఈ సీన్ చూడ్డానికి చాలా ఫన్నీగా ఉంటుంది. ఇక క్రిష్ మెహందీ పెడుతుంటే సత్య క్రిష్‌నే చూస్తూ లైన్ వేస్తుంది. సత్య క్రిష్‌ని చూసి ఏమని పిస్తుందని అడిగితే క్రిష్ నీ కళ్లలో కనిపించే ప్రేమ నిజం అయితే బాగుండు అని అనిపిస్తుందని చెప్పి వెళ్లిపోతాడు.  సత్య ఆ మాట తన ఫ్రెండ్స్‌కి చెప్పుకొని బాధ పడుతుంది. 


ఇక ఆర్డీఎక్స్ గ్యాంగ్ కిడ్నాప్ చేయబోయే రౌడీ తల మీద ఒక్కటిచ్చి వాడు పడిపోయేలా చేస్తారు. జరా వాడిని కొడితే చనిపోయాడని మిగతా ఇద్దరూ వాడు చనిపోయాడని అంటారు. జర భయపడుతూ టెన్షన్ పడటం చాలా కామెడీగా ఉంటుంది. మొత్తానికి ముగ్గురు ఫ్రెండ్స్ బండలా ఉన్న ఆ రౌడీని లాక్కెళ్లి స్టోర్‌ రూంలో పడేయాలని తీసుకెళ్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: కార్తీకదీపం 2 సీరియల్: గ్రానీని అడిగి నిజం నిర్ధారించుకున్న జ్యోత్స్న ఇప్పుడేం చేయనుంది.. అసలైన ఆట ఇప్పుడు మొదలైందా!