Satyabhama Serial Today Episode డైనింగ్ టేబుల్ దగ్గర అందరి ముందు నడుము గిల్లినందుకు సత్య క్రిష్ మీద కోప్పడుతుంది. అందరి ముందు రొమాన్స్ ఏంటి అని అంటుంది. నేను మొగుడిని అందుకే అని క్రిష్ అంటాడు. ఇంకా సత్య ఏదో అంటుంటే క్రిష్ సత్య పెదవుల మీద వేలు అడ్డు పెట్టి ఒక్క సారి నా గురించి ఆలోచించు అని అదో ఇదో కావాలి అనిపిస్తుంది కదా అంటాడు. సత్య కావాలనే క్రిష్‌ని రకరకాల ప్రశ్నలు అడుగుతుంది. చెప్తే అర్థం కాదని చేసి చూపిస్తా అని క్రిష్ అంటే సత్య అర్థమైందని అంటుంది. 


క్రిష్: కొత్త పెళ్లి కొడుకులా అయిపోయింది నా పరిస్థితి.
సత్య: అవునా అయితే ఒకసారి వెళ్లి డాక్టర్‌కి చూపించుకో.
క్రిష్: ఆ ముచ్చట కూడా అయింది. 
సత్య: ఏమన్నారు.
క్రిష్: నువ్వు రావాల్సింది నా దగ్గరకు కాదురా నీ పెళ్లాం దగ్గరకు వెళ్లు అన్నాడు. (సత్య పెద్దగా నువ్వుతుంది) కొంచెం సేపు నీ ఒడిలో తల పెట్టుకోనా. 
సత్య: నువ్వు అడగాల్సింది నా పర్మిషన్ కాదు బామ్మ పర్మిషన్. నువ్వు ఈ మధ్య నా మాట వినడం లేదు.
క్రిష్: ఇది అన్యాయం సంపంగి నీ కోసం నేను మందు మానేశా తెలుసా మన ఇద్దరి కలిసి పోయాం అని మా ఫ్రెండ్స్ పార్టీ కూడా అడిగారు నేను ఇవ్వలేదు తెలుసా. 
సత్య: మన ఇద్దర్ని కలపడానికి నీ ఫ్రెండ్స్ చాలా సాయం చేశారు పార్టీ ఇవ్వు రేపే ఏర్పాటు చేయ్. కాకపోతే ఒక కండీషన్ పార్టీ మన ఇంట్లోనే చేయ్ మీకు కావాల్సిన వన్నీ నేను చేస్తా. 



నర్శింహ కూడా ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నిస్తాడు. మహాదేవయ్య అడ్డు తొలగిస్తే తప్ప తనకు టికెట్ రాదు అనుకుంటాడు. అది జరిగే పని కాదు అని రుద్ర ఎంట్రీ ఇస్తాడు. నర్శింహ షాక్ అయి నిల్చొంటాడు. రుద్ర నర్శింహ పక్కనున్న ఇద్దరిని పంపేస్తాడు. రుద్ర నర్శింహ ఇద్దరూ కూర్చొంటారు. రుద్ర మందు గ్లాస్‌లో పోసుకొని తాగుతూ మహదేవయ్య ఉండగా ఎమ్మెల్యే టికెట్ దొరకదని బుద్దిగా కూర్చొ అని రుద్ర అంటాడు. బెదిరిస్తే బెదిరిపోను అని నర్శింహ అంటాడు. దాంతో రుద్ర నీతో డీల్ మాట్లాడుతాను అని అంటాడు. ఎమ్మెల్యే టికెట్ నువ్వు తీసుకో మా బాపునకి చంపడానికి టికెట్ నేను రెడీ చేస్తానని అంటాడు. గతంలో నీకు అజ్ఞాతవాసిలా మాట్లాడింది నేనే అని అంటాడు. నర్శింహ బిత్తర పోతాడు. ప్లాన్ అంతా తానే చెప్తాను అని బాపుని చంపడానికి రెడీగా ఉండమని అంటాడు. తన తండ్రి చనిపోతే ఆ సామ్రాజ్యానికి నేనే రాజు అవుతాను అని అంటాడు. ఇద్దరూ డీల్ చేసుకుంటారు. 


క్రిష్ పోస్టర్లు సిటీ అంతా అతికించమని అడ్డు వస్తే చితక్కొట్టమని ఫోన్‌లో తన ఫ్రెండ్స్‌కి చెప్తుంటాడు. సత్య ఆ మాటలు విని మీ నాన్న ఎమ్మెల్యే టికెట్ కోసం ఎమ్మెల్యేని చంపేశాడు. నువ్వు యూత్ ప్రెసిడెంట్ కోసం చితక్కొడతావా అని కోప్పడుతుంది. నువ్వు రాజకీయాల్లోకి వెళ్లకని క్రిష్‌తో చెప్తుంది. క్రిష్ ఒప్పుకోడు. ఇంటి విషయాల్లో నేను కలుగ జేసుకోను నువ్వు బయట విషయాల్లో కలుగజేసుకోకు అని అంటుంది. సత్య అలిగి వెళ్లిపోతుంది. సత్య కూల్ చేస్తాడు. ఎప్పటిలా మళ్లీ బాబీతో అడ్డు వచ్చే వాళ్లని నరికేయమని అంటే సత్య ఫీలవుతుంది. సత్య క్రిష్ మాటలకు షాక్ అయి క్రిష్‌ని తన తండ్రి బాటలో వెళ్లకుండా చేయాలని అనుకుంటుంది. 


అందరూ హర్ష కోసం ఎదురు చూస్తుంటే నందిని తినేస్తుంది. ఆకలి వేసి తినేస్తున్నా అని అంటుంది. ఇంతలో హర్ష వస్తాడు. వచ్చావా నన్ను బతిమాలి తినిపించే వాళ్లు ఎవరూ లేరని నేను తినేస్తున్నా అని నందిని హర్షతో అంటుంది. నీ మనసులో ఏముందో నాకు తెలుసు నందిని అని హర్ష అంటాడు. బాధలో ఉన్న మైత్రిని ఓదార్చడానికి వెళ్లానని అంటాడు. పెళ్లాన్ని పట్టించుకోకుండా పొరుగు ఆడపిల్లని ఓదార్చడానికి వెళ్లడం కరెక్టేనా అని మామయ్యని అడుగుతుంది. అయినా తాను మైత్రి దగ్గరకు వెళ్లడం తప్పు అనడం లేదని ప్రేమగా వండిన వంట తినకుండా హడావుడిగా వెళ్లడం బాధగా ఉందని అంటుంది. మంచిగా తిని బాగుంది అంటే మురిసి పోతా కదా అని తాను కొంచెం తిని మైత్రికి కూడా ఇవ్వు  అంటే సంతోషంగా ఇచ్చే దాన్ని కదా అని నందిని అంటుంది. నువ్వు అన్నది నిజమే అమ్మా వాడు హడావుడిలో వెళ్లాడని అంటాడు. దానికి కనీసం అక్కడికి వెళ్లిన తర్వాత ఒక ఫోన్ చేయాల్సింది కదా అని అంటుంది.  


విశ్వనాథంతో పాటు ఇంట్లో అందరూ నందిని బాధలో అర్థముంది అని నందిని మీద నీకున్న ప్రేమ తనకు తెలియాలి అని అంటారు. మైత్రిని ఓదార్చడానికి నందిని బాధ పెట్టొద్దని అంటాడు. ఇక ఉదయం క్రిష్ పడుకొని లేచి సత్యని పిలుస్తాడు. సత్య కాఫీ తాగుతూ ఉంటుంది. ఫ్యామిలీ విషయాల్లో కలిగించుకోవద్దు అన్నందుకు సత్య క్రిష్‌కి దెప్పిపొడుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: 'త్రినయని' సీరియల్: గాయత్రీని చంపడానికి పాయసంలో విషం కలిపిన తిలోత్తమ.. ఎలుక ఏం చేసిందంటే!