Satyabhama Serial Today Episode క్రిష్‌, సత్య, జయమ్మలు చక్రవర్తి పుట్టిన రోజును సర్‌ఫ్రైజ్ చేస్తారు. కేక్ కట్ చేయమని క్రిష్ అంటాడు. ఇక మహదేవయ్య లేడు పిలుస్తానని క్రిష్ వెళ్లబోతే సత్య ఆపి మంచి నిద్రలో ఉంటారు వద్దు అంటుంది. ఇక నీ కొడుకు సంజయ్ ఉంటే బాగుండేది అని జయమ్మ అంటే ఈ కొడుకు ఉన్నాడు కదా అని క్రిష్‌ని చూపిస్తూ సత్య అంటుంది. 


జయమ్మ: వీడు కొడుకు ఎలా అవుతాడే.
సత్య: నాన్న అని పిలిస్తే అవుతాడు. అదే చినాన్న అంటే నాన్న తర్వాత నాన్న అని అర్థం. అలాంటప్పుడు చిన్నమామయ్యకి క్రిష్‌ కొడుకే కదా ఏమంటావ్ క్రిష్.
క్రిష్: ఆ కొడుకునే కానీ బాబాయ్ ఓకే అంటేనే.
సత్య: అంటున్నారా.


చక్రవర్తి క్రిష్‌ని హత్తుకొని ఎమోషనల్ అవుతాడు. క్రిష్‌కి కాస్త అనుమానం వస్తుంది. ఇక కేక్ కట్ చేయిస్తారు. చక్రవర్తి ముందు కేక్ జయమ్మకి తినిపిస్తే సత్య ఆపి క్రిష్‌కి పెట్టమంటుంది. ముందు కొడుకుకి కేక్ పెట్టాలని అంటుంది. సంజయ్‌ మిస్ అయ్యాడు అని జయమ్మ అంటే దానికి సత్య ఎన్ని సార్లు తలచుకుంటారు అంటుంది. కొడుకుతో తినిపించుకోవాలి అంటే దానికి క్రిష్ కొడుకు నేను ఉన్నా కదా అంటాడు. అదీ లెక్క అని సత్య అంటుంది. మరోవైపు అర్థరాత్రి దాటిన తర్వాత హర్ష ఇంటికి వెళ్తాడు. నందిని పడుకోకుండా హాల్‌లో కూర్చొని ఉంటుంది. హర్ష వెళ్లి కావాలని ఇలా చేయలేదు నందిని అని చెప్తాడు. దాంతో నందిని కోపంతో అక్కడున్న కుండీ తన్నేసి వెళ్లిపోతుంది. 


ఇంతలో శాంతమ్మ వచ్చి అది మంచిది కాబట్టి కోపంగా వెళ్లిపోయింది. నేను అయితే తన్నుండేదాన్ని అంటుంది. పాపం అది సాయంత్రం నుంచి ఆశ పెట్టావని నీకు చెప్పలేదు కదా తాను బయటకు తీసుకెళ్లమని అంటుంది. ఇంటికి వచ్చినప్పుడు అది జగమొండి కానీ నీ మీద ప్రేమతో నువ్వు వందతప్పులు చేసినా క్షమించే స్థాయికి ఎదిగిందని చెప్తుంది. హర్షకి లోపలకి వెళ్లమంటుంది. హర్ష నందిని దగ్గరకు వెళ్లేసరికి నందిని పడుకొని ఉంటుంది. హర్ష మైత్రి అని ఏదో చెప్పబోతే మన మధ్య ఆ పేరు రాదన్నా వదిలేయ్ మాట మీద నిలబడు అంటుంది.


సత్య: ఏం ఆలోచిస్తున్నారు చిన్న మామయ్య.
చక్రి: నా జీవితంలో ఇలాంటి ఒక రోజు వస్తుందని అనుకోలేమ్మా కన్న కొడుకుని కళ్లతో చూసుకోవడమే కష్టం గుండెకు హత్తుకునే అవకాశం రాదనుకున్నా కానీ నువ్వు వాడితోనే హత్తుకునేలా చేసి కేక్ కట్ చేయించి ఏదో లోకంలో ఉన్నట్లుంది అమ్మ.
సత్య: అంతా మీ చేతిలోనే ఉంది మామయ్య క్రిష్ మీ కొడుకు అని లోకానికి చెప్తే మీ జీవితం మొత్తం సంతోషమే. ఏదో ఒక రోజు నేను కచ్చితంగా తండ్రీ కొడుకుల్ని దగ్గరయ్యేలా చేస్తాను.


మరోవైపు క్రిష్ చక్రిని హగ్ చేసుకున్న సీన్ గుర్తు చేసుకొని కన్నీరు పెట్టుకుంటాడు. సత్య వచ్చి అవి కన్నీరు ఎందుకని అడుగుతుంది. దానికి క్రిష్ ఏదో దక్కిన ఆనందం.. అది నా నుంచి ఎప్పటికీ దూరం కాకూడదు అని అనిపిస్తుంది. అసలు ఈ కన్నీరు ఎందుకు  వస్తున్నాయో తెలీదు. చెప్పలేని ప్రేమ ఏదో నాకు దగ్గరైనట్లుంది. ఈ ఫీలింగ్ నుంచి బయటకు రావాలి అనిపించడం లేదు ఎవరితో మాట్లాడాలి అనిపించడం లేదు అని క్రిష్ అంటాడు. బాబాయ్‌కి నేను అంటే ఇష్టమని తెలుసు కానీ ఇంత ప్రేమ ఏదో కొత్తగా ఉంది బాబాయ్‌ని హగ్ చేసుకోగానే ఏదో కొత్తగా ఉంది. ఇంతకు ముందు బాపు పుట్టిన రోజుకి కేక్ కట్ చేయించా కానీ ఈ రోజు బాబాయ్‌ పుట్టిన రోజు చేయగానే ఏదో కొత్తగా ఉంది బాబాయ్ ఏడుపు చూడగానే ఏదోలా ఉంది అని అంటాడు. దానికి సత్య మనసులో ఇదే రక్త సంబంధం క్రిష్ అని అనుకుంటుంది. జీవితంలో కొత్తగా ఏదో కావాలి అనిపిస్తుంది సత్య అని క్రిష్ అంటాడు. ఇక గుడ్ న్యూస్ చెప్తావని అన్నావ్ చెప్పు సత్య అంటే చెప్పేసినట్లే అని సత్య అంటుంది. 


ఇక సత్య క్రిష్ గుడ్ న్యూస్ కోసం ఆరాట పడుతున్నాడని ఇక ఏమాత్రం ఆలస్యం చేయొద్దని అనుకుంటుంది. ఇంతలో సత్య గంగ అనే ఓకామెకు కాల్ చేస్తుంది. రేపు ఇంటికి రమ్మని మన ప్లాన్ అమలు చేయమని చెప్తుంది. దాంతో గంగ రేపు మీ మామ పని అయిపోతుందని నిజం ఎలా చెప్పిస్తానో చూడు అంటుంది. ఇక సత్య మామయ్య రేపటితో మీ చాప్టర్ క్లోజ్ కొడుకు కాని కొడుకు శివతాండవం చూస్తారని అనుకుంటుంది. మరోవైపు సంధ్య సంజయ్‌ అనుకున్నవన్నీ అబద్ధం చేయాలని తనకు కనిపించకూడదని అనుకుంటుంది. సంజయ్ మాత్రం సంధ్యకు తెలీకుండా వెనక ఫాలో అవుతాడు. మరోవైపు భైరవి నీరు తాగుతుంటే క్రిష్ అడిగితే పోయి తెచ్చుకో లేకపోతే నీ పెళ్లానికి అడుగు అంటుంది. పెళ్లాంతో తిరుగుతావ్ తిప్పుతావ్ రోజంతా తన తోనే ఉంటావ్ నేను ఎందుకు ఇవ్వాలి అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 



Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: సీత, విద్యాదేవిలు అరెస్ట్.. కథ ఇప్పుడే మొదలైందంటోన్న సీత!