Satyabhama Serial Today Episode మహదేవయ్య కారులో వెళ్తుంటే మధ్యలో కారు ఆగిపోతుంది. మహదేవయ్య డ్రైవర్‌ మీద కోప్పడి ఇంటికి ఫోన్ చేసి మరో కారు తీసుకురమ్మని చెప్పమని అంటాడు. దాంతో డ్రైవర్ ఫోన్ చేసి సంజయ్ బాబు తీసుకెళ్లాడని మహదేవయ్యతో చెప్తే మహదేవయ్య డ్రైవర్‌ని కొట్టి చిన్న బాబు అని పిలవమంటాడు. ఇక డ్రైవరే కారు రిపేర్ చేస్తా అంటాడు. ఇంతలో క్రిష్‌ అటుగా వస్తూ బాపుని చూసి ఆగుతాడు. మహదేవయ్య సిగరెట్ పట్టుకుంటే క్రిష్ వెలిగించి ఇది నీ లైటరే బాపు గుర్తుగా ఉంచుకున్నా అంటాడు. 


క్రిష్: ఎందుకు బాపు అంత కోపం నా ముఖం దిక్కు కూడా చూడవా. కొడుకు కాదని తెలిసి కూడా పాతికేళ్లు దగ్గరుండి పెంచుకున్నావ్ ఒక్క దినంతో ఇప్పుడు అంత వెగతు పుట్టిందా. నువ్వు నన్ను కాదు అనుకున్నా నేను నిన్ను కాదు అనుకోలేకపోతున్నా.
మహదేవయ్య: ఓరేయ్ గాడిద ఎంత సేపురా.
డ్రైవర్: పాత కారు కదా అయ్యా ఇంజిన్ మాట వినడం లేదు సతాయిస్తుంది.
మహదేవయ్య: అందుకే పాత కారుని పాత మనిషిని ఎక్కువ కాలం ఉంచుకోకూడదు. ఇలానే ఎదురు తిరుగుతాయి. వదిలించుకోవాలి.
క్రిష్: విశ్వాసానికి విలువ ఉండాలి పాత కారు అయినా పాత మనిషి అయినా. ఏళ్ల తరబడి సేవ చేసినప్పుడు తెలీకుండా గుండెలో ప్రేమ పుట్టుకొస్తుంది. ఎంత కోపం వచ్చినా ఆ బంధాన్ని వదులుకోకూడదు అది మంచిది కూడా కాదు మొండికేసినప్పుడు నయానో బయానో దారిలో పెట్టుకోవాలి కానీ వదిలించుకోకూడదు. జరంత ప్రేమ చూపిస్తే పోయేది ఏం లేదు అని కారు రిపేర్ చేస్తాడు.   
మహదేవయ్య: రేయ్ నాటకాలు వద్దని చెప్పు ఇక్కడ నమ్మే వాళ్లు ఎవరూ లేరు.
క్రిష్: నటించే వాళ్లకి ప్రాణం పోయినా ప్రేమించడం చేతకాదు. ప్రేమించడం చేతకాని వాడికి ప్రాణం పోయే వరకు నటించడం చేతకాదు. కొడుకుగా ఒప్పుకోవడానికి మనసు రాకపోతే కనీసం కారు డ్రైవర్‌గా అయినా చేసుకోవచ్చు కదా చూస్తూ బతికేస్తా కాపాడుకుంటా నాకు జీతం అవసరం లేదు. జీవితం ఇచ్చారు కదా అది సరిపోతుంది. రేయ్ ఈ కారులో కూర్చొని మా బాపుని ఏళ్ల తరబడి ఈ కారులో తిప్పానురా అందులో మా  బాపు నన్ను తప్పు మరొకరిని కూర్చొపెట్టలేదు. అదిరా ఆ లెవల్ అది నా పవర్.  బాపు జర్రంత నా మీద అలిగాడు. రేపోమాపో ఏయ్ చిన్నా రారా అంటాడు. ఇదే కారులో నన్ను కూర్చొపెట్టుకొని కారు నడపరా అంటాడు. భద్రంగా చూసుకో ఆ సీట్‌ని క్రిష్ మళ్లీ వస్తాడు. ఈ పచ్చబొట్టు కోపంతో పొడిపించుకున్నా అన్నాడు కానీ అందులో నిజంగా నేనే ఉన్నాను. సంజయ్‌ని కొట్టినందుకు సారీ బాపు. బాపు ప్రేమతో చేయి వేస్తే కారు కూడా పని చేసింది బాపు నా మీద నమ్మకం ఉంచుతావా. అని అంటే మహదేవయ్య వెళ్లిపోతాడు.
నందిని: అది జరిగింది వదిన మీ అన్నయ్య మైత్రి ఉచ్చులో చిక్కుకున్నాడు. 
సత్య: ఇరుకున్నాడా నిజంగా తప్పు చేశాడా. అంటే నా ఉద్దేశం తప్పు చేయకుండా ఎందుకు భయపడతాడు అని. 
నందిని: నువ్వే ఏదో ఒకటి చేసి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి వదిన. అన్నయ్యని నేను అడగలేక కాదు కానీ  విషయం మన వరకు వచ్చింది  అని తెలిస్తే హర్ష ఇబ్బంది పడతాడు. హర్ష మీద నాకు నమ్మకం ఉంది కానీ అదే కథ విడాకులు, పెళ్లి వరకు తెచ్చింది. నువ్వు మైత్రి దిక్కుకు వెళ్లి సమస్య పరిష్కరించు.
సత్య: మైత్రి ఇలా చేస్తుంది అని నేను అస్సలు అనుకోలేదు. ఇక ఇది నేను చూసుకుంటా నాకు వదిలిపెట్టు.


మహదేవయ్య అన్నం పట్టుకొని క్రిష్ మాటలు తలచుకుంటూ ఉంటాడు. భైరవి ఏం ఆలోచిస్తున్నావ్ అని అడిగితే చీ కొడితే పెంపుడు కుక్కలు కూడా అలుగుతాయిని వీడేంటి ఇలా వెంటపడుతున్నా అని చిన్నా పేరు కూడా గుర్తు లేదని వాడు వాడు అంటాడు. ఇక జరిగింది చెప్తాడు. తినకుండా ప్లేట్‌లో కడిగేసి వెళ్లిపోతాడు. సంజయ్ కోపంగా వెళ్లిపోతుంటే భైరవి ఏమైందని అడిగితే డాడ్ మనసు మార్చుకుంటున్నాడని అంటాడు. ఇక భైరవి సంజయ్‌తో చిన్నాని తిరిగి తెచ్చుకోడని మహదేవయ్య వాడి తల్లిని పురిటి మంచంలో చంపేశాడని అది చిన్నాకి తెలిస్తే వాడు మీ బాపు మీదకే కత్తి తీసుకొస్తాడని అందుకే బాపు ముందు జాగ్రత్తగా వాడిని దూరం పెట్టారని అంటుంది. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని అంటుంది. బ్రహ్మాస్త్రం దొరికింది ఒకేసారి ఇద్దరూ దొరికిపోయారని అనుకుంటాడు. 


మరోవైపు సత్య మైత్రిని కలుస్తుంది. మా అన్నయ్యని ఎందుకు బ్లాక్ మెయిల్ చేస్తున్నావ్ అని అడుగుతుంది. నన్ను ప్రేమించి మీ స్వార్థం కోసం మీరు నన్ను బలి చేశారు ఇప్పుడు నేను నా స్వార్థం చూసుకుంటున్నా అని అంటుంది. నువ్వు నిజంగా ప్రేమించి ఉంటే తనని ఇబ్బంది పెట్టవు అని నీ మనసు మార్చకో అని అంటుంది. ఒక వైపు ప్రేమించిన వాడు దూరమై మరోవైపు కన్నవాళ్లు దూరమై నా జీవితం ఎలా ఉంటుందో తెలుసా అని అంటుంది. ఇక తప్పు చేసినట్లు నమ్మించాను అని అంటుంది. సత్య ఇక మైత్రితో చిన్నప్పటి నుంచి నన్ను చూస్తున్నావ్ నేను ఏంటో నీకు తెలుసు కదా  ఈరోజు రాత్రిలో నా ఫ్యామిలీకి సారీ చెప్పకపోతే నీ అంతు చూస్తా అని అంటుంది. మరోవైపు సంజయ్ పంతులుకి కాల్ చేసి భైరవికి కాల్ చేసి మహదేవయ్యకి ప్రాణ గండం మృత్యుంజయ హోమం చేయాలని చెప్పమంటాడు. పంతులు భైరవికి కాల్ చేసి విషయం చెప్తాడు. భైరవి కంగారు పడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: సిద్ధాంతం సావిత్రీదేవి గారి బంగారు గాజులు కొట్టేసిన దేవా.. ఇంట్లో టెన్షన్‌ టెన్షన్!