Satyabhama Serial Today January 20th: సత్యభామ సీరియల్: ఇంట్లో వాళ్లకి ఎదురు తిరిగిన సంధ్య.. అదృశ్యశక్తి అని క్రిష్‌ని ఓ ఆట ఆడుకున్న సత్య!

Satyabhama Today Episode రుద్రని బెదిరించి నామినేషన్ మీద సంతకం పెట్టించింది క్రిష్‌నే అని సత్య తెలుసుకొని ఆ విషయం క్రిష్‌తోనే చెప్పించాలని ప్రయత్నించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Continues below advertisement

Satyabhama Serial Today Episode రుద్ర రేణుకని గదిలో కొడుతూ బెదిరించిన వీడియో తనకి పంపించి ఎవరో బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఇంట్లో వాళ్లకి చెప్తాడు. ఆ వీడియో చూసిన తర్వాత మహదేవయ్య భైరవితో వీడు ఇక బాగు పడడే అని ఆ వీడియో తనకి పంపమని రుద్రతో అంటాడు. ఎందుకని రుద్ర అడిగితే కోర్టుకి ఆ వీడియో పంపి నీ బెయిల్ క్యాన్సిల్ చేయిస్తా అంటాడు.

Continues below advertisement

మహదేవయ్య: వీడు జైలుకి వెళ్లిందే పెళ్లాం మీద మర్డర్ అట్మంట్ కిందా మీద పడి బెయిల్ తెస్తే మళ్లీ ఇలా చేస్తాడా.
భైరవి: అలవాటు అయిన ప్రాణం కదా పెనిమిటి ఏం చేస్తాడు. అరేయ్ తలుపు వేయాలన్న జ్ఞానం లేదురా నీకు. అయినా ఎవర్రా ఆ వీడియో తీసింది.
రుద్ర: తెలిస్తే బతకనిస్తానా.
భైరవి: ఏమే నువ్వే ఆ వీడియో తీశావా నీ తోటి కోడలితో కలిసి ప్లాన్ చేశావా.
మహదేవయ్య: అయినది చాలు రేణుక నువ్వు లోపలికి పో
క్రిష్: నేను సీన్‌లోకి ఎంటర్ అయితే లేని పోని కిరికిరి ఎందుకు వచ్చింది లోపలికి పోతా.
రుద్ర:  అసలు తప్పు నాది కాదు బాపు ఆ చిన్నా గాడిది. నామినేషన్ నుంచి తప్పుకుంటున్న సత్యని రెచ్చగొట్టి మరీ నామినేషన్ వేయించాడు. వాడిని మాత్రం ఏం అనవు. ఊ అంటే నా చెంప మీద కొడతావ్. అయినా అమ్మా, నేను 
సంతకం పెడితే కానీ నామినేషన్ వేయలేకపోయింది. అలాంటి సత్య గురించి ఎందుకు బాబు ఆలోచిస్తావ్. ప్రచారంలోకి దిగనీ అప్పుడు చెప్తా. 
సత్య: మామయ్య కాఫీ తీసుకురానా కాబోయే ఎమ్మెల్యే ఇచ్చే కాఫీ చాలా బాగుంటుంది. 
మహదేవయ్య: జీవితాంతం నాకు నువ్వు కాఫీ ఇస్తూ బతికేయాలి అంతే.
సత్య: మీ అహంకారమే మిమల్ని ఓడిస్తుంది రెడీగా ఉండండి.
విశాలాక్షి: సంధ్య నువ్వు చేసింది నమ్మక ద్రోహం అంటారు.
సంధ్య: అక్క పోటీ చేయడం నాకు ఇష్టం లేదు అందుకే నామినేషన్ మీద సంతకం చేయడానికి రాలేదు. అక్కని ఎవరూ సపోర్ట్ చేయకూడదు అని నేను చెప్తూనే ఉన్నాను కానీ మీరే ఒకసారి అవును అని ఒకసారి కాదు అని మనసు మార్చుకున్నారు. నేను నా మాటకే కట్టుబడి ఉన్నాను. అక్క నన్ను నమ్ముకొని ఎలక్షన్‌లో నిల్చొందా ఎందుకు అందరూ నన్ను నిలదీస్తున్నారు.
శాంతమ్మ: ఎందుకే అక్క మీద అంత ద్వేషం పెంచుకున్నావ్ ఇది నీ మనసుకు పుట్టిన ఆలోచనేనా?
నందిని: నువ్వు ఇంతకు ముందు సంధ్యలా లేవు మారిపోయావ్. అమ్మానాన్నల్ని ఎదురిస్తున్నావ్.
సంధ్య: నా మనసులో మాట చెప్పడం ఎలా ఎదిరించడం అవుతుంది వదినా. అయినా నీ పుట్టింటి వాళ్ల ముఖం కూడా చూడటానికి ఇష్టపడని నీకు నన్ను ప్రశ్నించే హక్కు లేదు. నీకు మీ వాళ్ల పద్ధతులు నచ్చకపోతే నాకు నా వాళ్ల మాటలు నచ్చడం లేదు. అంత మాత్రానా నాతో ఇలా మాట్లాడుతావా
విశాలాక్షి: చాలా ఎక్కువ మాట్లాడుతున్నావ్ సంధ్య వదినకు సారీ చెప్పు. 
నందిని: పర్లేదు అత్తమ్మ ఇది నా ఇళ్లు సంధ్యని అడిగే హక్కు ఉందని అనుకున్నా కానీ నేను ఈ ఇంటికి పరాయిదాన్ని సారీ.
సంధ్య: అక్క నామినేషన్ మీద సంతకం పెట్టి మీరు తప్పు చేశారు తన కాపురం ఏమవుతుందో ఆలోచించారా. అక్క మీద నాకు ప్రేమ ఉంది ఒక్క విషయంలో విభేదించినంత మాత్రానా ద్వేషించినట్లు కాదు.

సత్య ఆరుబయట ఉంటే క్రిష్ వచ్చి పార్టీ లేదా సంపంగి అంటాడు. సత్య క్రిష్‌ని అనుమానంగా చూసి నాదో డౌట్ అని అంటాడు. మీ అన్నయ్య నా నామినేషన్ మీద ఎందుకు సంతకం పెట్టాడని అడుగుతుంది. నాకేం తెలుసు అని క్రిష్ అనేస్తాడు. రుద్ర ఇచ్చిన షాక్‌కి మా బాపునే షాక్‌లో ఉన్నాడు ఇక నేనే షాక్‌లో ఉన్నాను అంటాడు. సంతకం వెనక ఏదో అదృశ్య శక్తి ఉందని అంటుంది. తనని కనిపెట్టు అని అంటుంది. క్రిష్ సత్య నుంచి తప్పించుకోవడానికి చాలా తంటాలే పడతాడు. సత్య క్రిష్ వెళ్లిపోయిన తర్వాత ఆ అదృశ్య శక్తి నువ్వు తప్ప ఇంకెవరు అయ్యే ఛాన్సే లేదని నీతోనే చెప్పిస్తాను అనుకుంటుంది. ఇక మహదేవయ్య ఆలోచిస్తూ ఉంటే అక్కడికి భైరవి వెళ్తుంది. ఏమైందని అడుగుతుంది. దానికి మహదేవయ్య ప్రచారంలో జనాలు నీభార్య, కొడుకులే నీ వైపు లేరు అని ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పాలా అని ఆందోళనగా ఉందని అంటాడు. 

సత్య క్రిష్‌ దగ్గరకు వచ్చి అదృశ్య శక్తి ఎవరో తెలిసిపోయిందని అంటుంది. ఎలా అని క్రిష్‌ అంటే మెసేజ్ చేశాడని అంటుంది. ఇంతలో ఏదో ఫోన్ రావడంతో అదృశ్య శక్తి ఫోన్ చేసిందని గంతులెస్తుంది. క్రిష్‌ని ఉడికించాలని మెలికలు తిరుగుతూ మాట్లాడుతుంది. కావాలనే క్రిష్‌ వినాలని స్పీకర్ ఆన్ చేస్తుంది. అవతల అబ్బాయి మాటలు విని క్రిష్ షాక్ అయిపోతాడు. ఇక నందినినే అబ్బాయి గొంతులా మాట్లాడుతుంది. సత్య బాయ్ చెప్పి ఉమ్మా అనడంతో క్రిష్‌ రగిలిపోతాడు. వాడు అదృశ్య శక్తి కాదని సత్య మీద అరుస్తాడు.  సత్య కావాలనే మెలికలు తిరుగుతూ ఉంటే క్రిష్ జుట్టు పీక్కుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: ‘కార్తీక దీపం 2’ సీరియల్ : శివనారాయణ ఇంటికి వచ్చిన కాశీ – రౌడీల నుంచి బాబును కాపాడిన దీప

Continues below advertisement