Satyabhama Serial Today Episode సత్య ఎమ్మెల్యేగా పోటీ చేస్తుందని తెలిసి విశ్వనాథం ఫ్యామిలీ మొత్తం కంగారు పడతారు. ఇక టీవీలో న్యూస్ చూసిన నర్శింహ ఎగిరి గంతేస్తాడు. సత్య వచ్చింది కాబట్టి ఓట్లు చీలుతాయని తన గెలుపు పక్కా అని అంటాడు. కానీ మహదేవయ్య సత్యని బతకనిస్తాడా.. క్రిష్ కూడా ఎర్రోడని తండ్రి పిచ్చోడని తన చెంచాలతో చెప్తాడు. మహదేవయ్యకి పార్టీ ప్రెసిడెంట్ కాల్ చేసి నీ కోడలు నీకు వ్యతిరేకంగా పోటీ చేస్తుంది ఏంటి ఇదంతా అని అడుగుతాడు. తనకి అంత సీన్ లేదు లైట్ తీసుకోమని మహదేవయ్య చెప్తాడు. దానికి పార్టీ ప్రెసిడెంట్ ముందే జాగ్రత్త పడమని తర్వాత ఏం చేయలేను అని అంటాడు.
మహదేవయ్య: ఈ చిన్న కోడలితో నెత్తి నొప్పి అయిపోయింది.
భైరవి: చేసుకున్నోళ్లకి చేసుకున్నంత పెనిమిటి. గట్టిగా కళ్లెర్ర చేయమన్నా కానీ చేశావా ప్రతీ సారి ఇలా మ్యానేజ్ చేయాలి అంటే కుదరదు.
మహదేవయ్య: ఏం బావగారు బాగున్నారా. మీరు మంచిగా ఉంటే మేం మంచిగా ఉంటాం. అయినా ఇప్పుడు మీ బాగోగులు కనుక్కోడానికి చేయలే నువ్వు ఉంటే ఎంత పోతే ఎంత. ఎలక్షన్ విషయంలో నీ కూతురి బుద్ధి మార్చమని చెప్పా ఏం చేశావ్.
విశ్వనాథం: చెప్పాను బావగారు.
మహదేవయ్య: మరెందుకు మీడియా ముందు ప్రకటించింది. ఈ తండ్రీ కూతుళ్లకు ఈ మహదేవయ్య అంటే భయం లేదు కదా. నేను అనుకుంటే ఏమైనా సాధిస్తా ఆ సంగతి నీ కూతురు మీకు చెప్పుంటుంది కదా. మొన్న మీ ఇంటిలో సునామికీ నేను కారణం అని మీ కూతురు చెప్పుంటుంది కదా ఈ సారి డైరెక్ట్‌గా చెప్తున్నా నా దెబ్బకి నీ ఫ్యామిలీ నీ కూతురు కొట్టుకుపోతారు. పిచ్చి పిచ్చి నాటకాలు వద్దని చెప్పు. బుద్ధిగా ఉండమను అది మీ అందరికీ మంచిది ఇంకొకసారి వార్నింగ్ ఉండదు డైరెక్ట వారే.
సత్య మల్లెపూలు పెట్టుకొని వచ్చి క్రిష్‌ని కవ్విస్తుంది. ఇంకాసేపు సత్య దగ్గరే ఉంటే తనని మాయచేసి మడత పెట్టేస్తుందని క్రిష్ భయపడి బామ్మ దగ్గరకు వెళ్తాడు. బామ్మ భగవద్గీత చదువుతుంటే అక్కడికి వెళ్తాడు. దూరం నుంచి సత్య కావాలనే క్రిష్‌ని చూస్తూ మెలికలు తిరుగుతూ క్రిష్‌ని పిలుస్తుంది. క్రిష్ సత్య నుంచి డైవర్ట్ అవ్వలేక జుట్టు పీక్కుంటాడు. సత్య కావాలనే కృష్ణ కృష్ణ అని పిలుస్తుంది. సత్య కన్ను కొడుతూ కవ్విస్తుంది. దానికి క్రిష్ ఈ రోజు ఉపవాసం నేను రాను అని చెప్తాడు. ఇప్పుడే తిన్నావ్ కదా అంటే అది వేరే ఉపవాసం దానికి తెలుసు అంటాడు. ఇక సత్య క్రిష్ పక్కనే కూర్చొని క్రిష్‌ని లాక్కొని వెళ్తుంది. గది వరకు వెళ్లిన క్రిష్ రొమాంటిక్‌గా మారి తర్వాత తేరుకొని బామ్మ దగ్గరకు వెళ్తాడు. బామ్మ తిట్టి క్రిష్‌ని గదిలోకి పంపుతుంది. తగ్గేదేలేదని లొంగేదిలేదని క్రిష్ అంటే వదిలేదే అని సత్య అంటుంది. మొత్తానికి సత్య క్రిష్‌ని తన దారిలోకి తెచ్చుకుంటుంది.
మరోవైపు నందిని ఆ రౌడీ తన తండ్రి గురించి చెప్పిన విషయం గురించి ఆలోచిస్తుంది. ఇలాంటి తండ్రిని ఇచ్చావ్ ఏంట్రా దేవుడా అని అనుకుంటుంది. ఇంతలో హర్ష వచ్చి కష్టాలు అన్నీ తీరిపోయావి అనుకుంటే సత్య కొత్త కష్టం తెచ్చిందని మనల్ని ఆదుకున్న మీ నాన్నకి సత్య ఎదురు తిరగడం ఏంటి అని అంటాడు. మహదేవయ్యని అల్లుడు పొగిడితే నందిని తండ్రిని తిడుతుంది. పుట్టింటి వాళ్లం మనమే సత్యకి సపోర్ట్ చేయాలని అంటుంది. సత్య భైరవి, మహదేవయ్యలకు కాఫీ తీసుకెళ్తే దానికి భైరవి విషం ఇచ్చి చంపేయ్ నీకు మా పీడ ఉండదు అని అంటుంది. నామినేషన్ డేట్స్ అనౌన్స్ చేశారని మంచి ముహూర్తం పెట్టించాలి అంటే దానికి సత్య మన పంతులు తోనే నేను ముహూర్తం పెట్టించుకుంటా అని అంటుంది. దానికి మహదేవయ్య నీలా ఇండిపెండెంట్‌గా పోటీ చేసేవాళ్లకి పది మంది సపోర్ట్‌గా సంతకాలు చేయాలని చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: సత్యభామ సీరియల్: సత్య ఎనౌన్స్‌మెంట్‌కి ఫ్యామిలీ ఫ్యూజులు అవుట్.. క్రిష్ చేతకాని వాడంటూ విరుచుకుపడ్డ భైరవి!