Satyabhama Serial Today February 25th: సత్యభామ సీరియల్: కిరాతకంగా క్రిష్‌ని తన్ని మెడ పట్టుకొని ఇంటి నుంచి గెంటేసిన మహదేవయ్య..!

Satyabhama Today Episode క్రిష్‌ని మెడ పట్టుకొని మహదేవయ్య గెంటేయడం చక్రవర్తి వచ్చి అన్న గొంతు పట్టుకొని నిలదీయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Continues below advertisement

   Satyabhama Serial Today Episode క్రిష్‌ తన కొడుకు కాదని మహదేవయ్య చెప్పి క్రిష్‌ని తన్ని కొడతాడు. క్రిష్‌ మహదేవయ్యతో నిజం చెప్పి తప్పు చేశావ్ బాపు నువ్వు ప్రశాంతంగా ఉన్నావ్ కానీ నాకు జీవితాంతం శిక్ష వేశావని అంటాడు.

Continues below advertisement

మహదేవయ్య: ఓరేయ్ నీ తండ్రి ఎవరో చెప్పాను కదా ఇక్కడ నుంచి నీ పెళ్లాన్ని తీసుకొని ఆ ఇంటికే పోరా.
రేణుక: చిన్నా గుండె కోత అర్థం చేసుకోండి మామయ్య.
రుద్ర: అయితే వాడిని ఇంట్లో ఉంచి ఆస్తిలో వాటా ఇవ్వమంటావా.
క్రిష్: నాకు కావాల్సింది ప్రేమలో వాటా.. రుద్ర, సంజయ్, మహదేవయ్య పెద్దగా నవ్వుతారు. పచ్చబొట్టు చూపించి ఇదేంటి బాపు. నీ ప్రేమ గుర్తొచ్చిందా.
మహదేవయ్య: చెరిపేశా అర్థమైందా నువ్వు నా గుండెల్లో ఎప్పుడూ లేవురా. గుండెల్లో ఉంచుకోవాల్సిన అంత గొప్ప పర్సనాలిటీ కాదురా నీది  అద్దె కొడుకువి. అంతే నీ లెవల్ అంత కంటే ఏం కాదు. నా దగ్గర చాలా మంది పనోళ్లు ఉన్నారు పైసలు పడేస్తే ఏమైనా చేస్తారు. నా కోసం ఏమైనా చేసే పెద్ద పనోడు కావాలని అనిపించింది. నిన్ను తెచ్చుకున్నా. పనోడా అంటే బాగోదని చిన్నా అన్నా. కుక్క లెక్క నా కాళ్ల దగ్గర పడుంటావు అనుకున్నా కానీ నీ పెళ్లాం అని వచ్చిన తర్వాత అన్నీ మారిపోయావ్.  నీ పెళ్లాన్ని ఎలక్షన్‌లో పోటీ చేయొద్దని అంటే మోజుతో నువ్వే దాన్ని బరిలో దించావు. నీ పెళ్లాం దిక్కు ఇన్‌డైరెక్ట్ పబ్లిసిటీ చేస్తూ నాకే వెన్ను పోటు పొడవడానికి రెడీ అయిపోయావు. ప్రాణం ఇస్తే చేసే పని ఇదేరా గుంట నక్క అని తోసేస్తాడు. ఇప్పుడు నీ పెళ్లాంతో కలిసి నా కొడుకు మీదకు వచ్చావ్. అద్దె కొడుకు కోసం కన్న కొడుకుని పొగొట్టుకుంటానని ఎలా అనుకున్నావ్‌రా. అయిపోయింది నీకు నాకు లెక్కలు అయిపోయావి. రేయ్ నీ అంతట నువ్వు మర్యాదగా ఈ ఇంటి నుంచి పోతావా. మెడపట్టుకొని బయటకు పడేయాలా. రేయ్ చిన్న కొడకా వాడికి మైండ్‌ బ్లాంక్ అయింది నువ్వు నీ అన్న కలిసి వాడిని బయట పడేయండ్రా.
సంజయ్: సరే బాపు.
సత్య: ఏయ్ ముట్టుకుంటే చస్తారు. ఎవరి మీద చేయి వేస్తున్నారో తెలుసా. ఎవరి గురించి చులకనగా మాట్లాడుతున్నారో తెలుసా. ఈ ఇళ్లే దైవం అనుకొని మీరే తన ప్రాణం అనుకొని వ్యక్తి కోసం. కింద పడిన వస్తువునే తీసి ఇచ్చి థ్యాంక్స్ చెప్తాం. అలాంటిది మీ కోసం ఇన్నేళ్లు ఊడిగం చేస్తే కనీసం కృతజ్ఞత లేదు. క్రిష్ ప్లేస్‌లో ఇంకెవరైనా ఉంటే మీరు చేసినదానికి మీ గుండెల మీద ఎగిరి తన్నేవాడు. ఈ కత్తితో లెక్కలేనన్ని పోట్లు పొడిచేవాడు. ఈ పాటికి రక్తపు మడుగులో ఉండేవారు. ఇప్పటికీ మిమల్ని గుండెల్లో మోస్తున్నాడు కాబట్టి గుండెల్లో పడిలేలా ఏడుస్తాడు. ఇలా ఎందుకు చేశావయ్యా అని కనపడని దేవుడిని అడుగుతున్నాడు. క్రిష్ గుండె బాపు బాపు అని కొట్టుకుంటుంది. నా కంటే ఎక్కువ మిమల్ని ప్రేమిస్తున్నాడు. అది తెలుసా మీకు. ఇద్దరి కొడుకుల్ని పక్కన పెట్టుకొని రొమ్ము విరుచుకుంటున్నారు. మీరు సాధించింది ఏం లేదు పైగా పోగొట్టుకున్నారు. క్రిష్ కూడా పొగొట్టుకున్నది ఏంలేదు. తనకు మనసున్న తండ్రిని దగ్గర కాబోతున్నాడు. ఇక నుంచి మిమల్ని మీ కొడుకుల్ని మీరే కాపాడుకోండి. ఏముంది క్రిష్ ఈ ఇంట్లో అబద్ధాలు మోసాలు ఇవే కదా. నరకం కావాలి ఇంటే ఈ ఇంట్లో ఉంటే చాలు అంతే కదా అమ్మమ్మ అంతే కదా అక్క. 
రుద్ర: ఏయ్ ఆడదానికి హద్దుల్లో ఉండు.
సత్య: మీరు మీ భార్యని ఎంత అయినా సతాయించొచ్చు తిట్టొచ్చు కొట్టొచ్చు మీ తమ్ముడు ఎంత మందితో అయినా విచ్చల విడిగా తిరగొచ్చు మీ తప్పులు చూపే నేను హద్దుల్లో ఉండొచ్చు.
భైరవి: చూడమ్మా నీకు బాధ అనిపిస్తే బాధ పడు కానీ ఈ ఇంటి పెద్ద మీద నోరు పడితే బాగోదు.
సత్య: భర్త మీద ప్రేమ సరే. పాతికేళ్లు కొడుకు అని పెంచి మీ చిన్న మీద ప్రేమ ఏమైంది. కొడుకు కాదు అనగానే మాయమైంది. కొత్త కొడుకు మీద ప్రేమ పొంగు కొస్తుంది. మీరు నాకు నీతులు చెప్తున్నారా. ఇలాంటి వాళ్ల కోసమా నువ్వు బాధ పడేది ఏడ్చేది. మారిన క్రిష్‌లా కాకుండా ఒక్క సారి పాత క్రిష్‌లా ఆలోచించు.  ఇప్పుడు ఇక్కడ నీకు అవమానం జరుగుతుంటే రాజీ పడతావేంటి. కోపం ఆవేశం వద్దన్నాను అనా మాట వెనక్కి తీసుకుంటాను. తిరగబడు.
మహదేవయ్య: ఏ ఆపు పోనీలే అని వింటుంటే చేతకానం అనుకుంటున్నావా. ఏయ్ లేరా ఇది నీకు సొంతిళ్లు కాదు నట్టింట్లో కూర్చొని ఏడ్వడానికి లేరా అని బయటకు గెంటేస్తాడు. చక్రవర్తి పట్టుకుంటాడు.
సత్య: ఏం జరిగిందో జరుగుతుందో అర్థమైందా మామయ్య ఈ రోజు క్రిష్‌కి ఈ ఇంట్లో అవమానం జరిగింది. నిజం చెప్పేయండి అని అంటే మీ అన్నయ్యకి భయపడి చెప్పలేదు. ఇప్పుడు ఆ పెద్ద మనిషి క్రిష్‌ని గుండెల మీద తన్నారు. గుండె పడిగేలా ఏడ్పించారు. మెడ పట్టుకొని గెంటేశారు.
చక్రవర్తి: క్రిష్‌కి సారీ చెప్పు అని ఒకరి కాలర్ ఒకరు పట్టుకుంటారు.  అన్నయ్య నా కొడుకుని లాక్కున్నాడు. బలవంతంగా తన కొడుకుని నా చేతిలో పెట్టాడు. జాగ్రత్తగా వాడిని పెంచి తిరిగి తన చేతిలో పెట్టాను. కానీ అన్నయ్య నా కొడుకుని గెంటేశాడు. మర్యాదా ఇది అడగమ్మ అమ్మ అన్నని. 
మహదేవయ్య: ఏం చేస్తావురా.
చక్రవర్తి: చూస్తావా. రుద్ర, సంజయ్‌ చక్రిని పట్టుకుంటే చక్రి సంజయ్ వైపు చూస్తాడు. సంజయ్ తల దించుకుంటాడు. 
సత్య: ఇది ఈ ఇంటి పరిస్థితి మామయ్య ఈ లెక్కలను సరిచేసే వాడు క్రిష్ మాత్రమే. సమయం వస్తుంది. క్రిష్ అన్నీ లెక్కలు సరిచేస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: సత్యభామ సీరియల్: క్రిష్‌ని తన్ని నిజం బయట పెట్టేసిన 'రౌడీ'దేవయ్య.. గుండె బాధుకొని ఏడ్చి కాళ్లవేళ్లా పడిన క్రిష్!

Continues below advertisement