Satyabhama Serial Today Episode హర్ష రాత్రి మైత్రి ఇంటికి వెళ్తాడు. మైత్రి చీర కట్టుకొని హర్ష కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇలా రెడీ అయ్యావ్ ఏంటి ఏమైనా పార్టీ ఉందా అని హర్ష అడుగుతాడు. దానికి మైత్రి ఇది నీ కోసమే నీతో గడప పోయే చివరి రాత్రి అని అంటుంది. అదేంటి అని హర్ష అడిగితే నేను ఫారెన్ వెళ్లిపోతా అని అంటుంది. రాత్రి డిన్నర్ కలిసి చేద్దాం అంటే నందిని వెయిట్ చేస్తుందని హర్ష అంటాడు. నిన్ను ప్రేమించినందుకు ఈ ఒక్క కోరిక కూడా తీర్చలేవా అని మైత్రి కన్నీరు పెట్టుకోవడంతో హర్ష సరే అంటాడు.
మైత్రి హర్ష కోసం క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేస్తుంది.కూల్ డ్రింక్ తీసుకొస్తానని వెళ్లి ఆ కూల్ డ్రింక్‌లో ట్యాబ్లెట్స్ కలుపుతుంది. హర్షకి కూల్ డ్రింక్ ఇస్తుంది. హర్ష తాగేస్తాడు. ఇక ఇద్దరూ మాట్లాడుకుంటారు. జ్యూస్ పూర్తయ్యే సరికి హర్షకి మైకం వచ్చేస్తుంది. మైత్రి హర్ష చేయి నిమురుతూ డ్యాన్స్ చేద్దామని అంటుంది. తర్వాత హర్ష పూర్తి మైకంలోకి వెళ్లిపోగానే హర్షని బెడ్ రూంలోకి తీసుకెళ్లి క్లోజ్‌గా ఫొటోలు తీసుకొని దుప్పటి కప్పేస్తుంది. మరోవైపు భైరవి అందరిని భోజనాలకు పిలుస్తుంది.
రుద్ర: రేయ్ ఆగరా. బాపు నీకో పని అప్పగించారు. పోయి వచ్చాక పని ఏమైందో చెప్పాలి కదా.
క్రిష్: అన్నం తిన్నాక మాట్లాడుకుందామని ఆగాను.
రేణుక: చిన్నాని తిననివ్వండి.
రుద్ర: నోరు మూసుకో.
క్రిష్: ఎందుకు అన్న వదిన మీద అరుస్తావ్. తిన్నాక తీరికగా మాట్లాడుకుందాం.
రుద్ర: అవసరం లేదు ఇప్పుడే చెప్పు. దాచాల్సిన అవసరం ఏముంది.
మహదేవయ్య: వీడిని నేనే అడగమని చెప్పాను.
రుద్ర: చాలా సరిపోయిందా ఇప్పుడైనా చెప్పురా.
క్రిష్: ఆ ఊరిలో మన ల్యాండ్ కబ్జా చేసిందని కలెక్టర్ రికార్డులు చూపించి చెప్పాడు. అది కరెక్ట్ అని పించింది. పేదవాళ్ల ల్యాండ్ మనం కబ్జా చేశాం అది మనది ఎలా అవుతుంది బాపు. అది మనది ఎలా అవుతుంది.
మహదేవయ్య: రేయ్ వీడితో కాదు కాబట్టి నువ్వు వెళ్లురా.
క్రిష్: అవసరం లేదు బాపు అది మనది కాదని వాళ్లకి చెప్పి సంతకం పెట్టి వచ్చా.
రుద్ర: ఏంట్రా అలా చేశావా అసలు నువ్వు ఎవడ్రా. బాపు తరపున మాట్లాడటానికి నీకు ఏం హక్కు ఉంది.
క్రిష్: మన వల్ల ఒక తప్పు జరిగింది అవసరం అయితే సరిదిద్దుకోవాలి. అంతే కాని తప్పు మీద తప్పు చేయకూడదు. ఈ ఇంట్లో నీకు ఎంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది. నేను కూడా నీలెక్కనే బాపు రక్తం పంచుకొని పుట్టిన కొడుకుని. సత్య వడ్డించు.
భైరవి: ఆగు నీ మొగుడు ఏం పెద్ద ఘనకార్యం చేశాడని వడ్డిస్తున్నావ్. ఇంటి పరువు తీశాడు. తప్పు ఒప్పుకోవడం అంటే చేతకాని తనమే కదరా. నీతులు చెప్పడానికి ఆకాశం నుంచి ఊడిపడ్డాడురా. అట్లా చూస్తూ ఊరుకుంటావేంటి అయ్యా నిలదీయవేంటి.
మహదేవయ్య: ఏం అడగాలే వాడు నా కంటే పెద్దోడు అయిపోయాడు. ఏమైనా అడిగితే నువ్వు ఎంత అని నా గల్లా పట్టుకుంటే ఇంట్లో కూడా నా పరువు పోయినట్లే కదా. అప్పుడు నేనేం అయిపోవాలి.
క్రిష్: బాపు నేను నీ గల్లా ఎందుకు పట్టుకుంటాను నీ కొడుకుని బాపు. నీ చేయి పట్టుకొని పెరిగిన వాడని.
భైరవి: నువ్వు నిజంగా మహదేవయ్య కొడుకువే అయింటే ఆయన రక్తం పంచుకొని పుట్టుంటే ఇలా చేయవురా.
సంజయ్: ఈడైలాగ్ కోసమే నేను ఎదురు చూసింది ఇప్పుడు కథ లైన్‌లోకి వచ్చింది.
క్రిష్: అమ్మా ఎందుకు అంత పెద్ద పెద్ద మాటలు అంటున్నావ్. నువ్వు అంటున్న మాటలకు అర్థం తెలిసే అంటున్నావా. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మహదేవయ్య కొడుకు అనుకొని వెనకే తిరుగుతున్నా. నా ప్రాణం అమ్మా బాపు నన్ను మహదేవయ్య కొడుకు కాదు అంటావా.
జయమ్మ: జరిగింది ఒకటి అయితే ఇలా ఇంకొకటి మాట్లాడుతారేంట్రా. అవసరమా.
సత్య: అవసరమే బామ్మ తల్లి అయిండి ఇలా మాట్లాడొచ్చా. పాతికేళ్లు పెంచిన చిన్న కొడుకు గురించి అత్తయ్య అంత మాట ఎలా అనింది.
భైరవి: కొడుకు ఎవరూ చిన్నా లెక్క ప్రవర్తించడు. వాడిని అసలు మా కొడుకే అనుకోవడం లేదు.
మహదేవయ్య: భైరవి..
సత్య: మాట్లాడనివ్వండి మామయ్య అత్తయ్య మనసులో ఏం ఉందో కక్కనివ్వండి.
భైరవి: వాడిని నేను అసలు కొడుకు కిందే లెక్క వేయను.
మహదేవయ్య: భైరవి లోపలికి పో ఇంకొక్క మాట మాట్లాడితే చంపేస్తా. చిన్నా మీ అమ్మ కోపంతో అప్నది దాని మాటలు పట్టించుకోకు. నడు తిందువు గానీ.
క్రిష్: తల్లి మాటలు గుర్తు చేసుకొని ఆవేశంగా కుండీలు తన్నేస్తాడు. చూడు సత్య నాకు ఆవేశం ఎక్కువ కొట్లాటకు పోతా. నన్ను మార్చాలని చూడకు. నా బతకు నన్ను బతకనివ్వు. క్రిష్ అంటే కళ్లెర్ర జేసి బుసలు కొట్టాలి అప్పుడే విలువ. మంచిగా మారి పద్ధతిగా ఆలోచిస్తున్నాకాబట్టి తప్పు ఒప్పుకున్నా. నీ ఒక్క దానికే అది మంచి పనిలా అనిపిస్తుంది. మిగతా అందరూ నా మీద యుద్ధం ప్రకటించారు. నా మీద నాకే అసహ్యంగా ఉంది సత్య.
సత్య: నువ్వు అంత తప్పు చేయలేదు. క్రిష్ నిన్ను నేను మారమని చెప్పింది నీ కోసం నా కోసం. వాళ్ల కోసం ఆలోచించకు. కలిసి జీవితాంతం బతకాల్సిన వాళ్లం మనకి ఏది మంచో మనమే నిర్ణయించుకోవాలి. ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: ఇంట్లో వరసగా అపశకునాలు.. లక్ష్మీ ఆందోళన నిజం అవుతుందా!!