Ammayi garu Serial Today Episode రూప చేసిన నాట్యానికి మందారం కోమా నుంచి బయటకు రావడంతో అమ్మాయిగారు సీరియల్ ఆసక్తికరంగా మారింది. తమ్ముడికి నిజం తెలిస్తే చంపేస్తాడని విజయాంబిక జీవన్‌కి చెప్పి చంపేయాలని చెప్పడంతో జీవన్ అఘోరా వేషంలో సూర్యప్రతాప్‌ని టార్గెట్ చేస్తాడు. సూర్య ప్రతాప్‌ని జీవన్ త్రిశూలంతో పొడిచే టైంకి మందారం లేచి జీవన్ చేతిలో ఉన్న త్రిశూలం పట్టుకోవడం సీరియల్ చాలా ఆసక్తికరంగా మారింది. ఈ తరుణంలో ఇవాళ్టి ఎపిసోడ్ ఇంకా ఇంట్రస్ట్ పెంచేస్తుంది. ఇంతకీ ప్రోమోలో ఏం ఉందంటే..
"మందారాన్ని తీసుకొని ఇంటికి వస్తారు. దీపక్ మందారానికి స్ట్రాంగ్ కాఫీ పెట్టి తీసుకురమ్మని చెప్తాడు. మందారం సరే అని అంటుంది. ఇక దీపక్ రెండో భార్య మౌనిక దీపక్ దగ్గరకు వచ్చి ఈ సారి ప్లాన్ మిస్ అవ్వదు కదా అండీ అని అంటుంది. అస్సలు మిస్ అవ్వదని దీపక్ అంటాడు. అందుకు మౌనిక కిచెన్‌కి వెళ్లే గుమ్మం ముందు ఉన్న మ్యాట్ కింద కనిపించకుండా గోలీలు వేస్తుంది. తర్వాత దీపక్ కరెంట్ షాక్ తగిలేలా వైరు తెచ్చి గదిలో పడేలా ఏర్పాట్లు చేస్తాడు. మందారం దీపక్ కోసం కాఫీ చేయడానికి వెళ్తే రూప తానే చేస్తానని చెప్తుంది. ఇంతలో విజయాంబిక వచ్చి దీపక్ కోసం తాను కాఫీ చేసి తీసుకొస్తానని వెళ్తుంది. విజయాంబిక కాఫీ తీసుకొస్తుండగా మ్యాట్ మీద కాలు వేసి జారి పడుతూ వెళ్లి బెడ్ పక్కనున్న లైట్ మీద పడిపోతుంది. దాంతో కరెంట్ షాక్ కొడుతుంది. విజయాంబిక గిలగిలా కొట్టుకుంటే మౌనిక, దీపక్‌లు వెళ్లి విజయాంబికను కంగారులో పట్టుకుంటారు. దాంతో ముగ్గురికీ షాక్ కొడుతుంది. దాంతో రూప చీపురు పట్టుకొని వచ్చి ముగ్గురిని చితక్కొడుతుంది. దీంతో ప్రోమో పూర్తయిపోతుంది."
నిన్నటి ఎపిసోడ్‌లో ఏం జరిగింది అంటే..
రూప నాట్యం చేస్తుంటుంది. స్వామీజీ రూప చేతికి రెండు మట్టి కుండల్లో దీపాలు వెలిగించి ఇచ్చి నాట్యం చేస్తూ అఖండ దీపం వెలిగించాలని చెప్తారు. రూప అలాగే చేస్తుంటుంది. ఇక జీవన్ సూర్యప్రతాప్‌ని చంపడానికి తన రౌడీతో మాటి మాటికి ఫోన్ చేయిస్తాడు. ఫోన్ మాట్లాడటానికి సూర్య బయటకు వెళ్తాడు. జీనవ్ పొడిచే టైంకి రాజు వచ్చి సూర్యప్రతాప్‌ని తీసుకెళ్లిపోతాడు. ఇక తర్వాత విజయాంబిక కొడుకుతో చెప్పి రూప కాళ్ల దగ్గర గాజు పెంకులు వేయమని అంటుంది. దీపక్ గులాబి రేకుల్లో పెంకులు వేసి రూప కాళ్ల కింద వేస్తాడు. రూప నొప్పితో విలవిల్లాడిపోతే సూర్య పట్టుకోవడానికి వెళ్తే రూపని ముట్టుకోవద్దని స్వామీజీ చెప్తారు. దాంతో అందరూ దూరం జరుగుతారు. రూప ఇబ్బంది పడుతూనే అఖండ దీపం వెలిగిస్తుంది. ఇక జీవన్ సూర్య ప్రతాప్‌ని పొడిచే టైంకి మందారం అడ్డుకుంటుంది. అందరూ షాక్ అయిపోతారు. విజయాంబిక వాళ్లు పారిపోవాలని అనుకుంటారు. మందారాన్ని సూర్య ప్రతాప్ ఈ దుస్థితికి కారణం ఎవరు అని అడిగితే తన భర్త అత్త అని చెప్తుంది. దీంతో ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: ఇంట్లో వరసగా అపశకునాలు.. లక్ష్మీ ఆందోళన నిజం అవుతుందా!!