Satyabhama Serial Today Episode ఎమ్మెల్యేగా సత్య పోటీ చేస్తుందని తెలుసుకున్న విశ్వనాథం సత్యని ఒప్పించడానికి ప్రయత్నిస్తాడు. తండ్రి ఎంత చెప్పినా సత్య వినదు. మామకు ఎదురు వెళ్లొద్దు ఈ ఇంటి దానివి ఇంట్లో అందరితో నువ్వు కలిసి ఉండాలని అంటాడు. నీ భర్త నీ వల్ల చిక్కుల్లో పడుతున్నాడని నీలా నీ భర్త స్వేచ్ఛ అని ఆలోచిస్తే నువ్వు నీ పుట్టింటిలో ఉండేదానివి అని అంటాడు.
విశ్వనాథం: నీలా నీ భర్త కన్న వాళ్లని వదులుకోడు. అలా వదులుకోవాల్సి వస్తే ఎవరిని వదులుకుంటాడో నువ్వే ఆలోచించు. ఇందాక నేను లోపలికి వస్తుంటే మీ అత్తగారు గుమ్మం ముందే నిలబెట్టి దులిపేశారు. ఆవిడ అడిగిన ప్రశ్నలకు నోరు విప్పలేకపోయాను ఎందుకంటే వాటిలో న్యాయం ఉంది కాబట్టి. రేపు క్రిష్ పరిస్థితి కూడా ఇంతే. గెలుపు అంటే ఎలక్షన్‌లో గెలవడం కాదమ్మా చుట్టూ ఉన్న వాళ్ల మనసు గెలవడం. లక్ష్యం మంచిది అయితే సరిపోదు దాని దారి కూడా మంచిగా ఉండాలి నా కూతురు క్షేమంగా ఉండాలి ఈ ఒక్క వరం ఇవ్వమ్మా.
సత్య: నాన్న.. నాన్న...
జయమ్మ: మీ నాన్న నువ్వు చేసే పనిని తప్పు పట్టలేదు. ఏం చేస్తే బాగుంటుందో చెప్పారంటే నిన్ను భయపెట్టలేదు భయపడకుండా ప్రశాంతంగా ఉండాలి అంటే ఏం చేయాలో చెప్పారు అంటే. ఆయన చెప్పింది కాస్త అర్థం చేసుకో అమ్మా. లేకపోతే నువ్వే కాదు రెండు కుటుంబాలు నష్టపోతాయి.
భైరవి: ఆగు ఏ ముఖం పెట్టుకొని వడ్డిస్తున్నావే.
మహదేవయ్య: భైరవి.
భైరవి: నీ అంత మంచి తనం ఓపిక నాకు లేదు పెనిమిటి. దానికి మామ మీద ప్రేమ లేదు. గౌరవం లేదు. అది ఈ ఇంట్లో తింటూ ఈ ఇంటి వాసానలే లెక్క పెడుతుంది.
సత్య: ఎలక్షన్‌లో నిలబడటం ఎదురు తిరగడం కాదు అత్తమ్మా నేను అనుకున్న న్యాయం వైపు నిలబడ్డా.
భైరవి: విన్నావా నీ పెళ్లానిది న్యాయం అంట అంటే మీ బాపుది అన్యాయమా అయితే నువ్వు ఎందుకు అన్యాయం వైపు నిలబడ్డావ్. నీ పెళ్లాం బాపునకి ఎదురు తిరిగితే నీకు ఎదురు తిరిగినట్టే పర్లేదా నీకు. నడుస్తదా నీ కాపురం నువ్వే చూసుకుంటావా..ఇట్లా తయారయ్యావ్ ఏంట్రా. ఎవరికీ ఇష్టం లేకపోయినా దాన్ని నీకు ఇచ్చి పెళ్లి చేశాం ఇదేనా నీ కృతజ్ఞత.
క్రిష్: నేను చెప్పాల్సింది చెప్పా వాళ్ల నాన్న వచ్చి చెప్పాడు అంత కంటే ఇంకే చేయాలి.
భైరవి: ఏం చేయాలో తెలీనప్పుడు దాన్ని పుట్టింటికి పంపేయ్. మన ఇంట్లోనే తింటూ మన ఇంట్లోనే తిరుగుతూ మనకే ఎదురు తిరుగుతా అంటే ఎట్లా.
మహదేవయ్య: ఎందుకే వాడిని అలా సతాయిస్తావ్ తినేటప్పుడు అలా సతాయిస్తావ్. మంచి చెడు చెప్పడమే మన పని తర్వాత వాళ్ల ఇష్టం
భైరవి: నువ్వు ఇలా చనువు ఇవ్వడం బట్టే అది అలా తాండవం ఆడుతుంది.
సత్య: మీరేం టెన్షన్ పడకండి మామయ్యా ఒక సారి నిర్ణయం తీసుకొంటే వెనకడుగే వేయను.
భైరవి గదిలోకి వెళ్లి మహదేవయ్య దగ్గర కోపంగా అన్ని విసిరేస్తుంది. మహదేవయ్య నచ్చచెప్పబోతే భైరవి వినదు. నిన్ను నీ చిన్న కోడలు పట్టించుకోదని మహదేవయ్య చెప్తాడు. దాంతో మహదేవయ్యని భైరవి ఎందుకు దాన్ని గారాభం చేస్తున్నావ్ ఎందుకు దానికి చెప్పడం లేదు అని భైరవి అంటుంది. దాంతో మహదేవయ్య అక్కడే ఆగిన క్రిష్‌ని చూసి చిన్నా కోసం ఆగుతున్నా వాడు బాధ పడతాడే.. వాడు ఇష్ట పడ్డ సత్యని ఎలా కోప్పడతాను చెప్పు అని అంటాడు. నా చిన్నా కోసం ఎంత నష్టం అయినా భరిస్తాను అని అంటాడు. నన్ను ఎమ్మెల్యేను చేసే బాధ్యత నా చిన్నాదే అని అంటాడు. క్రిష్ మనసులో ఇంత మంచి మనిషికి సత్య ద్రోహం చేస్తుందా అని క్రిష్ అనుకుంటారు.
ఇక మరోవైపు సంధ్య సంజయ్‌తో ఫోన్‌లో మాట్లాడుతుంటుంది. విశాలాక్షి కిచెన్‌లో లైట్ ఆపేసి సంధ్య గదిలో లైట్ ఆన్ అవ్వడం చూసి వెళ్తుంది ఇంతలో సంధ్య ఫోన్ దాచేస్తుంది. విశాలాక్షి సంధ్యకి తొందరగా పడుకోవడం లేదని చీవాట్లు పెడుతుంది. ఇక వెళ్తూ వెళ్తూ సంధ్య చేతిలో ఫోన్ తీసుకొని ఎవరిది అని అడుగుతుంది. నా ఫ్రెండ్ ఇచ్చిందని సంధ్య చెప్తుంది. అమ్మాయా అబ్బాయా అని అడిగితే అమ్మాయే అని సంధ్య కట్టుకథ అల్లేస్తుంది. ఇంత ఖరీదైన బహుమతులు తీసుకోకూడదని తిరిగి ఇచ్చేయమని చెప్తుంది. విశాలాక్షి వెళ్లగానే సంధ్య సంజయ్ మేటర్ బయట పడలేదని అనుకుంటుంది. ఇక క్రిష్ గదిలోకి వచ్చిన తర్వాత సత్య కావాలనే మాట్లాడుతుంటే క్రిష్ పట్టించుకోడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: ఇది అది కాదు.. అదే ఇది.. ఇంటి వారసురాలి ఇడ్లీ బండి కథ షురూ!